breaking news
india funds
-
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు
న్యూఢిల్లీ/జ్యురిచ్: స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నిధులు (డిపాజిట్లు, సెక్యూరిటీలు సహా) మూడింతలకు పైగా పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్‌కు (రూ.37,600 కోట్లు) చేరాయి. 2021 తర్వాత స్వివ్స్ బ్యాంకుల్లో భారత నిధులు గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే కావడం గమనార్హం. 2021లో ఈ మొత్తం 3.83 స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఈ వివరాలను స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) గురువారం విడుదల చేసింది. బ్యాంక్ ఛానళ్లు, ఇతర ఆర్థిక సంస్థల రూపంలో జమ అయిన నిధులు ఇవి. ఇక స్విస్ బ్యాంకుల్లోని భారత క్లయింట్ల ఖాతాల్లోని డిపాజిట్లు 11 శాతం పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.3,675 కోట్లు)గా ఉన్నాయి. మొత్తం నిధుల్లో క్లయింట్ల ఖాతాల్లో ఉన్నవి 10 శాతమేనని తెలుస్తోంది. విడిగా చూస్తే.. 3.02 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఇతర బ్యాంకుల రూపంలో ఉంటే, 346 మిలియన్ల ఫ్రాంక్స్ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లో ఉన్నాయి. 41 మిలియన్లు ఫిడూషియరీలు లేదా ట్రస్ట్‌ల రూపంలో, 135 మిలియన్ల ఫ్రాంక్స్ బాండ్లు, ఇతర సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు ఎస్ఎన్బీ వెల్లడించింది. నిజానికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి 1.04 ఫ్రాంక్స్‌గా ఉండడం గమనార్హం. ఆ తర్వాత రెండేళ్లలో ఇవి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, 2026లో స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 6.5 బిలియన్ల ఫ్రాంక్స్ కంటే తక్కువే. బ్యాంకులు అందించిన సమాచారంగా ఎస్ఎన్బీ విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇందులో నల్లధనం వివరాల్లేవు. అలాగే, ఏ సంస్థల పేరు మీద ఖాతాలున్నాయనే వివరాలను కూడా వెల్లడించలేదు. నల్లధనంగా చూడరాదు.. భారతీయులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న ఆస్తులను ‘నల్లధనం’గా పరిగణించకూడదన్నది స్విస్ అధికారుల వాదన. ‘‘పన్ను మోసాలు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్ మద్దతుగా నిలుస్తుంది. 2018 నుంచి భారతీయుల డిపాజిట్ల వివరాలను ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ మార్గంలో అందజేస్తున్నాం. మొదటిగా 2019లో డేటా బదిలీ చేయగా.. అప్పటి నుంచి ఏటా ఇది కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనుమానం ఉన్న ఖాతాల వివరాలు కూడా అందిస్తూనే ఉన్నాం’’అని స్విస్ అధికారులు తెలిపారు. ఇక స్విస్ బ్యాంకుల్లో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 983 బిలియన్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఫండ్స్‌లో దేశాల వారీగా చూస్తే భారత్ 48వ స్థానంలో ఉంది. గతేడాది 67వ స్థానం నుంచి పుంజుకుంది. అంతర్జాతీయంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లోని విదేశీ క్లయింట్ల నిధుల్లో 222 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూకే నుంచే ఉండడం గమనార్హం. 89 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూఎస్, 68 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వెస్టిండీస్ క్లయింట్లకు చెందినవి. పాకిస్థాన్ క్లయింట్లకు సంబంధించి 272 మిలియన్ ఫ్రాంక్స్, బంగ్లాదేశ్ క్లయింట్లకు సంబంధించి 589 మిలియన్ ఫ్రాంక్స్ కూడా ఉన్నాయి. -
స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
భారతదేశంలో చాలా మంది ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయని కొన్ని సందర్భాల్లో వినే ఉంటారు. స్విస్ బ్యాంకుల ఖాతాలను గురించి నిజ జీవితంలో కంటే సినిమాల్లో బ్లాక్ మనీ గురించి వచ్చే చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ కలిగిన ఇండియన్స్ చాలా మందే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంత ఉండొచ్చు? స్విస్ బ్యాంకు రూల్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల ధనవంతులు తమ డబ్బుని స్విస్ బ్యాంకులో దాచుకుంటారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్విస్ బ్యాంకు రూల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెబుతారు. కావున అక్కడ అకౌంట్ ఉంటే చాలు లాకర్ ఇచ్చేస్తుంటారు. ఎవరు ఖాతా ఓపెన్ చేసారనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా ఖాతాదారులకు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‌ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?) స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2022 చివరి నాటికి భారతీయులకు, మన దేశంలోని కంపెనీలకు సంబంధించిన డబ్బు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అని తెలుస్తోంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లు. 2021 కంటే 2022లో 11 శాతం డిపాజిట్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) స్విస్ బ్యాంకుల్లో భారతీయుడు దాచుకున్న డబ్బుని బ్లాక్ మనీ అనలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను ఎగవేత వంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇండియాకి నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం స్విట్జర్లాండ్ 2018లో భారత్‌లో టాక్స్ విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారి వివరాలను భారత ట్యాక్స్ అథారిటీ చేతికి అందించినట్లు సమాచారం. -
భారత్ నిధులతో నేపాల్‌లో స్కూల్ ప్రారంభం
కఠ్మాండ్: భారత ప్రభుత్వ నిధులతో ఉద యగిరి జిల్లా జోగిదహాలో నిర్మించిన శ్రీ జనతా హయ్యర్ సెకండరీ స్కూల్ భవంతి ని నేపాల్‌లో భారత రాయబారి మన్జీవ్ సింగ్పూరీ ఆదివారం ప్రారంభించారు. ఇదే జిల్లాలోని బాసాహాలో నిర్మించనున్న శ్రీనారద్‌ఆదర్శ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. భారత్–నేపాల్ మధ్య జరిగిన ‘ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్’ లో భాగంగా కేంద్రం ఈ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు భారత రాయబార కార్యా లయం తెలిపింది.ఇందుకు స్మాల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.4.16కోట్ల సాయం అందించామని పేర్కొంది.