breaking news
india england t20
-
రెండో టీ20: భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు!
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు(ఆదివారం) ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్ స్పిన్నర్ చాహల్, పేసర్ శార్థూల్ ఠాగూర్ల స్థానాల్లో లెగ్ బ్రేక్ బౌలర్ రాహుల్ చాహర్, మీడియం పేస్ బౌలర్ దీపక్ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి: హార్దిక్ షాట్‌కు ఐసీసీ ఫిదా.. ఏమని పిలవాలి? కాగా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను రొటేషన్ పేరుతో తప్పించి.. టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్‌లో చేస్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ రీ ఎంట్రీ, రాహుల్, దీపక్ చాహర్‌లకు తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం చూసినా రోహిత్, రాహుల్‌ల జోడీకి ఓపెనర్లుగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వీరి జోడీ రెండో టీ20లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులిచ్చిన చాహల్ స్థానంలో దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబర్చిన రాహుల్ చాహర్‌ను, తొలి మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయగలిగిన శార్థూల్ స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఇక్కడ చదవండి: ఆ రూల్ నీకు కూడా వర్తిస్తుందా.. కోహ్లిపై ధ్వజమెత్తిన వీరూ -
రైనా కొట్టిన సిక్సర్ తగిలి..
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లు రెండూ గెలిచినా, టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్పోవడంతో సిరీస్ విజయం కావాలంటే చివరి మ్యాచ్ కూడా తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే. ఇలాంటి టి20లో టీమిండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనా రెచ్చిపోయాడు. 45 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 140. జట్టులో టాప్ స్కోరర్ కూడా రైనాయే. అటు ఫీల్డింగ్‌లో కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి అది మరెవరికీ సాధ్యం కాదని నిరూపించాడు. అయితే, రైనా కొట్టిన ఐదు సిక్సర్లలో ఒక సారి మాత్రం బంతి ఒక కుర్రాడికి తగిలింది. చాలాసార్లు బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్సర్లు ప్రేక్షకుల్లోకి వెళ్లడం, వాళ్లు వాటిని క్యాచ్ పట్టి సంబరం చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఆరేళ్ల కుర్రాడికి ఆ బాల్ తగిలింది. అది కూడా సరిగ్గా తొడమీద పడింది. దాంతో అతడికి తొడమీద కొద్దిపాటి గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న ఆ పిల్లాడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందించి అనంతరం డిశ్చార్జి చేశారు.