breaking news
Inderjeet
-
ప్రఖ్యాత కవి ఇమ్రోజ్ కన్నుమూత
ముంబై: ఇమ్రోజ్‌గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్ జీత్(97) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత్రి అమృతా ప్రీతమ్ మధ్య నాలుగు దశాబ్దాల బంధం ఉంది. ముంబైలోని కాండివిలిలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు అమృతా ప్రీతమ్ కోడలు అల్కా క్వాట్రా చెప్పారు. ఇమ్రోజ్ చితికి ప్రీతమ్ మనవరాలు నిప్పంటించారు. 1926లో పంజాబ్‌లోని ల్యాల్‌పూర్‌లో ఇమ్రోజ్ జన్మించారు. పంజాబీలో రచయిత్రిగా మంచి పేరున్న అమృతా ప్రీతమ్‌తో 1950ల నుంచి ఆయన అనుబంధం కొనసాగింది. దాదాపు 40 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్ చనిపోయారు. ప్రీతమ్ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్ కవితలు రాయడం ప్రారంభించారు. అమృతా ప్రీతమ్ చనిపోయాక కూడా కవితా వ్యాసంగం కొనసాగించి, ఆమెకు అంకితం చేశారు. -
వరల్డ్ వర్సిటీ గేమ్స్‌లో మనోడి ఘనత
గ్వాంగ్జు: వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో భారతీయ షాట్‌పుటర్ ఇంద్రజీత్ గోల్డ్ మెడల్ సాధించాడు. 'యూనివర్సిటీ + ఒలింపియాడ్ = యూనివర్సియాడ్' నినాదంతో జరిగే ఈ పోటీల్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడం ఇదే ప్రధమం కావడం విశేషం. దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో నిర్వహిస్తోన్న ఈ క్రీడాపోటీల్లో భాగంగా బుధవారం షాట్‌పుట్ ఈవెంట్ జరిగింది. మొత్తం ఆరు సార్లు షాట్ విసిరిన ఇంద్రజిత్.. చివరి ప్రయత్నంలో 20.27 మీటర్ల రికార్డుదూరంతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఇవే పోటీల్లో తెలుగమ్మాయి, విజయవాడ కేఎల్ యూనివర్సిటీకి చెందిన జ్యోతి సురేఖ ఆర్చరీలో రజతం సాధించిన సంగతి తెలిసిందే.