ప్రఖ్యాత కవి ఇమ్రోజ్‌ కన్నుమూత | Sakshi
Sakshi News home page

ప్రఖ్యాత కవి ఇమ్రోజ్‌ కన్నుమూత

Published Sat, Dec 23 2023 6:16 AM

Artist and poet Imroz passed away at mumbai - Sakshi

ముంబై: ఇమ్రోజ్‌గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ కవి, కళాకారుడు ఇందర్‌ జీత్‌(97) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. వయో సంబంధ రుగ్మతలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇమ్రోజ్, రచయిత్రి అమృతా ప్రీతమ్‌ మధ్య నాలుగు దశాబ్దాల బంధం ఉంది. ముంబైలోని కాండివిలిలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు అమృతా ప్రీతమ్‌ కోడలు అల్కా క్వాట్రా చెప్పారు.

ఇమ్రోజ్‌ చితికి ప్రీతమ్‌ మనవరాలు నిప్పంటించారు. 1926లో పంజాబ్‌లోని ల్యాల్‌పూర్‌లో ఇమ్రోజ్‌ జన్మించారు. పంజాబీలో రచయిత్రిగా మంచి పేరున్న అమృతా ప్రీతమ్‌తో 1950ల నుంచి ఆయన అనుబంధం కొనసాగింది. దాదాపు 40 ఏళ్లపాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్‌ చనిపోయారు. ప్రీతమ్‌ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్‌ కవితలు రాయడం ప్రారంభించారు. అమృతా ప్రీతమ్‌ చనిపోయాక కూడా కవితా వ్యాసంగం కొనసాగించి, ఆమెకు అంకితం చేశారు.

Advertisement
 
Advertisement