breaking news
imam bukhari
-
పాక్ ప్రధానికి లేఖ రాసిన జుమా మసీద్ ఇమామ్
న్యూఢిల్లీ: ఢిల్లీ జమా మసీదు షాహి ఇమామ్, సయ్యద్ అహ్మద్ బుఖారీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి పరిష్కారం, కాల్పుల విరమణ, వేర్పాటువాద నాయకులు, తీవ్రవాద యువతతో చర్చలకు తనను ఉపయోగించుకోవాలని నవాజ్‌ను కోరారు. భారతదేశం, పాకిస్తాన్‌లతోపాటు, వేర్పాటు నాయకులు, తీవ్రవాద యువత, రెండు దేశాల ప్రభుత్వాలకు మధ్యవర్తిగా ఉంటానని ఇమాం చెప్పాడు, తెలివితేటలతో అక్కడ ఉన్న అశాంతి, హింసలను తొలగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర చర్చల ద్వారా కాల్పుల విరమణను ప్రకటించాలని తద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు బుఖారీ జూన్ 22 న రాసిన ఈ ఉత్తరంలో భూతలంపై స్వర్గం పేరుపొందిన కశ్మీరీ లోయలో ఇప్పడు కన్నీరు ప్రవహిస్తోందన్నారు. ఇప్పడు అది నమ్మలేనంత నేడు ఇది ఒక వధశాల మారిందన్నారు. కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు ఆలస్యం అయ్యే కొద్ది సమస్యకు పరిష్కారం మరింత క్లిష్టమవుతుందని బుఖారీ తెలిపారు. శాంతి భద్రతలు కనుమరుగవడంతో కశ్మీర్‌లోని సాధారణ ప్రజలు, ఏకే-47ల నీడలోనిస్సహాయ స్థితిలో ఉన్నారు. లక్షలాదిమంది భారతీయ ముస్లింలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని బుఖారీ చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చల ద్వారా సరిహద్దుల వద్ద ఉద్రిక్తత తగ్గించటం, పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చని సూచించారు. కాశ్మీర్ పరిస్థితి తుపాకీలు, సైనిక దాడుల ద్వారా పరిష్కరించబడదన్నారు. చర్చలకు అనుకూమైన వాతావరణాన్నిరెండు దేశాల మధ్య తాము ఏర్పాటు చేస్తామని ఆయన తన లేఖలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కాల్పుల విరమణ కోసం, తీవ్రవాద యువత హుర్యిత్ నాయకులను ఒప్పించాలని ఆయన పాక్ ప్రధానిని కోరారు. -
ముస్లింల మద్దతు కాంగ్రెస్ కేనన్న ఇమాం బుఖారీ
ఊహించినట్టుగానే చరిత్రాత్మక జామా మసీదు షాహీ ఇమాం బుఖారీ కాంగ్రెస్ కి తన మద్దతును ప్రకటించారు. దేశం మత తత్వ శక్తులతో పోరాడుతున్న ఈ సమయంలో సెక్యులర్ శక్తులు కలిసికట్టుగా ఉండాలని, ఓట్ల చీలిక జరగకూడదని బుఖారీ అన్నారు. ఇమాం బుఖారీ కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుసుకున్నారు. సెక్యులర్ శక్తులను బలపరచాలని, ముస్లిం ఓట్లు చీలిపోకుండా చూడాలని ఆమె బుఖారీని కోరారు. ఈ సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక ముస్లిం మత నేతను ముస్లింల పేరిట ఓట్లడగడం మత రాజకీయమేనని బిజెపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఇమాం బుఖారీ ప్రభావం ఢిల్లీ దాటి ఉండకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాత ఢిల్లీలో మాత్రమే ఆయన మాట చెల్లుబాటు కావచ్చునని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇమాం బుఖారీ కుటుంబం షాజహాన్ కాలంలో మధ్య ఆసియా లోని సమర్కండ్ నుంచి షాజహాన్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చారు. 1980 వ దశకం వరకూ ఇమాం బుఖారీ ఆదేశాన్ని ముస్లింలు శిరోధార్యంగా భావించారు. అయితే ఇటీవలి కాలంలో ముస్లిం నేతృత్వంలో చీలికల వల్ల ఇమాం బుఖారీ ప్రభావం గణనీయంగా తగ్గింది. -
బెడిసికొట్టిన సోనియా ప్రయత్నం