breaking news
IMA hall
-
ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యం
విజయవాడ (లబ్బీపేట): ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోందని, దుష్ఫలితాలు లేని వైద్యం కావడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ అన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. నగరంలోని ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాల బలరామ్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న మధుమేహ నియంత్రణ, చికిత్సపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీవీఎం కృష్ణ, కార్యదర్శి టీవీఎన్ రామకృష్ణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీలు భర్తీ చేస్తాం
* ఆస్పత్రిని కళాశాలకు అనుసంధానిస్తాం * రెండు, మూడు రోజులలోనే ఉత్తర్వులు * దవాఖానాలో తగిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం * వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.రాజయ్య * వార్డులలో కలియదిరిగిన ఉప ముఖ్యమంత్రి * రోగులతో మాటామంతీ, వైద్య సేవలపై ఆరా నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాలలో పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం ఆయన జిల్లా ఆసుపత్రి ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన బ్లడ్ సెల్స్ సెపరేటర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలో పోస్టులు ఖాళీగా ఉం డడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాటి భర్తీపై దృష్టిసారించామన్నారు. కళాశాలకు అత్యవసరంగా మరో మూడు ఎకరాల స్థలం అవసరమని ప్రిన్సిపాల్ జిజియాబాయి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాలకోసం మూడెకరాల స్థలం చూడాలని ఆర్డీఓ యాదిరెడ్డిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానిస్తూ రెండు, మూడు రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కళాశాల, ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఉన్నాయని ప్రిన్సిపాల్ పేర్కొనగా, ఆయా పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆసుపత్రి పరిశీలన బ్లడ్‌సెల్స్ సెపరేటర్‌ను ప్రారంభించిన అనంతరం ఉపముఖ్యమంత్రి ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోగిని పరీక్షించారు. చిన్నపిల్లల విభాగంలోకి వెళ్లి అత్యవసర వైద్యసేవలను పరిశీలించారు. రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని, సమయ పాలన పాటించాలని వైద్యాధికారులకు సూచించారు. మెడికల్ కళాశాలకు వెళ్లి అనాటమీ డిపార్ట్మెంట్ను, వ్యాయామశాలను పరిశీలించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన గురించి తెలుసుకున్నారు. కళాశాలకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. సదరం క్యాంప్‌ను సందర్శించి వికలాంగులతో మాట్లాడారు. వికలాంగులకు సర్టిఫికెట్లు సకాలంలో అందుతున్నాయో లేదో ఆరా తీశారు. సన్మానం ఐఎంఏ హాలులో ప్రైవేట్ వైద్యులు ఉప ముఖ్యమంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని ప్రైవేట్ వైద్యులకు సూచించారు. ఆయన వెంట ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ రాజారాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, ఆర్‌ఎంఓలు డా.విశాల్, బన్సీలాల్ తదితరులున్నారు.