breaking news
IFRS
-
ఏఐ అద్దాలతో రంగంలోకి పోలీసులు
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధతో పనిచేసే కళ్లద్దాలు ధరించనున్నారు! ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)తో పనిచేసే ఈ ఏఐ స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే బలగాలను హెచ్చరిస్తాయి! తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్‌గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితున్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు.ఎరుపొస్తే పట్టివేత‘‘ ఏఐ స్మార్ట్‌గ్లాస్ ఆయా పోలీస్ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌కు వెంటనే సందేశం పంపుతుంది. ఆ సందేశంలో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్‌లను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనావా కావా? వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేవి పోలీసులు నిర్ణయించి తగు రీతిలో స్పందిస్తారు’’ అని ఏసీపీ దేవేశ్ వెల్లడించారు. ‘‘వ్యక్తుల చరిత్రను తక్షణం గుర్తించడం అనే ఈ ప్రక్రియ కారణంగా గతంలో మాదిరి ఒక్కో వ్యక్తిని మాన్యువల్‌గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. దీనికితోడు విస్తృతంగా ఏర్పాటుచేసిన సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ, ఏఐ ఆధారిత విశ్లేషణ విధానాలతో ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలనూ వేగంగా గుర్తించవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.20 ఏళ్ల పాత ఫొటో అయినాసరే..‘‘ మా దగ్గర ఉన్న డేటాబేస్‌లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితంనాటి ఫొటో ఉన్నాసరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్‌గాŠల్స్ అనేది సరిపోల్చుకోగలదు. అంతటి సామర్థ్యం ఇంటిగ్రేటెడ్ ఫేషియల్ రికగ్నీషన్ సిస్టమ్‌కు ఉంది. స్మార్ట్ గ్లాసెస్ చూపు నుంచి నేరస్తులు తప్పించుకోలేరు. ఈ అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ సామర్థ్యమూ ఉంది. ఇనుము, ఉక్కు లోహాలు సహా పదునైన వస్తువులు, నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులనూ ఇవి గుర్తించగలవు. సబ్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ఈ కళ్లద్దాలను ఇస్తున్నాం. పోలీసు వాహనాల ముందుభాగంలోనూ వీటిని అమర్చుతాం. గణతంత్ర వేడుకల్లో వీటిని ఢిల్లీలో ఉపయోగించడం ఇదే తొలిసారి’’ అని అధికారి చెప్పారు. అయితే ఎన్నింటిని కొనుగోలు చేశారో, వాటి ధర తదితర వివరాలను ఆయన వెల్లడించలేదు. ‘‘ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతు మార్గంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో మొత్తంగా 10,000 మంది పోలీసులను న్యూఢిల్లీ జిల్లా నుంచి రప్పిస్తున్నారు. వేడుకలకు వచ్చే ప్రతి వాహనం మూడంచెల భద్రతావలయాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు మరో షాక్!
లా సూట్ దాఖలు చేసిన అమెరికా సంస్థ లుండిన్లా కంపెనీ ఆర్థిక ఫలితాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ ఖండించిన డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం నెల రోజుల్లో రూ. 20,000 కోట్ల మార్కెట్క్యాప్ ఆవిరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్‌కి కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. తాజాగా డాక్టర్ రెడ్డీస్ ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందంటూ అమెరికాలో క్లాస్ యాక్షన్ లా సూట్ దాఖలయ్యింది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన లా సంస్థ లుండిన్ లా ఈ లా సూట్‌ను దాఖలు చేసింది. డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆరోపించింది. అంతేకాదు ఈ లా సూట్లో ఇతరులు కూడా భాగస్వామ్యులుగా చేరవచ్చని లుండిన్లా ఆహ్వానించడం విశేషం. కానీ ఆరోపణలను డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. కార్పొరేట్ గవర్నెన్స్ పాటించడంలో తామెప్పుడూ ముందుంటామని, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీ నిబంధనలను పాటిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే తాము ఇండియన్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాండర్స్ (ఐఎఫ్ఆర్ఎస్) ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇటువంటి లాసంస్థలు విడుదల చేసే అడ్వటోరియల్ పత్రికా ప్రకటనలపై తాము స్పందిచమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మధ్యనే డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలు లేవని యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఆస్ట్రాజెన్‌కాకు చెందిన జెనరిక్ ఔషధం నెగ్జియమ్ను అమెరికాలో విక్రయించడంపై స్థానిక కోర్టు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇలా వరుసగా తగులుతున్న దెబ్బలతో డాక్టర్ రెడ్డీస్ షేరు నెల రోజుల్లో 25 శాతంగా నష్టపోయింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్లు హరించుకుపోయింది. గురువారం అమెరికాలో లాసూట్ దాఖలయ్యిందని వార్తలు వెలువడగానే డాక్టర్ రెడ్డీస్ షేరు 7 శాతంపైగా నష్టపోయి రూ. 3,138 కనిష్ట స్థాయికి పడిపోయింది. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రితం ముగింపుతో పోలిస్తే 3% నష్టపోయి రూ. 3,287 వద్ద ముగిసింది. షేర్లు కొన్న ప్రమోటర్లు భారీగా పతనమైన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ప్రమోటర్లకు చెందిన హోల్డింగ్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ గురువారం మార్కెట్లో 45,000 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ లాబ్‌లో హోల్డింగ్ కంపెనీ వాటా 23.35 శాతం నుంచి 23.37 శాతానికి పెరిగింది.


