breaking news
Identity card to vote
-
ఓటు వేసెందుకు 12 గుర్తింపు పత్రాలు
సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. అయినా పోలిగ్ సమయంలో ఆ స్లిప్పులు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయంగా 12రకాల గుర్తింపు కార్డులు చూపేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. వీటిలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగంచుకోవచ్చు. జాబితాలో ఓటరు పేరుకు సంబంధించి తప్పొప్పులు ఉన్నట్లయితే గుర్తింపు పత్రంలో నిర్ధారించుకుని ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. గుర్తింపు కార్డులు ఇవే.. పాస్‌పోర్ట్, డ్రైౖవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్ స్లిప్, ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్ నేడు, రేపు సెలవు విద్యారణ్యపురి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 6, 7వ తేదీల్లో ప్రభుత్వ, జిల్లాపరిషత్, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఈఓలు తెలిపారు. కేయూ పరిధిలో 7న.. ఎన్నికల సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌తోపాటు యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు ఈనెల 7న సెలవు ప్రకటించినట్లు కేయూ రిజిస్ట్రార్ పురుషోత్తమ్ తెలిపారు. పెయిడ్ హాలిడే హన్మకొండ అర్బన్: శాసన సభ ఎన్నికల సందర్భంగా ఈ నెల 7న జిల్లాలోని కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పెయిడ్ హాలీడేగా ఎన్నికల కమిషన్ ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పెయిడ్ హాలీడే ఉత్తర్వులు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘గుర్తింపు’ లేకున్నా ఓటు వేయవచ్చు
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఓటు ఉన్న వారిందరూ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకునేలా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఏప్రిల్ లో జరగనున్న పరిషత్ ఎన్నికలు, మే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటు గుర్తింపు కార్డు లేక పోయినా ఓటరు జాబితాలో పేరు ఉంటే వారందరూ ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా 13 గుర్తింపు కార్డులను ఎంపిక చేసి ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని.. ఈ మేరకు ఓటర్లకు చైతన్యం కల్గించమని ఆదేశించింది. దీంతో ఓటు ఉండీ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్లు ఆందోళన చెందనవసరం లేదు. ఈ కారణంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని నిరాశ పడాల్సిన అవసరం లేదు. జాబితాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన 13 కార్డుల్లో ఏ ఒకటి ఉన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు.