breaking news
IDC survey
-
ఇండియాలో చైనా స్మార్ట్ ఫోన్ల హవా
బీజింగ్: భారత మార్కెట్ లో చైనా స్మార్ట్ ఫోన్లు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద విపణిగా అవతరించిన భారత్ లో గతేడాది చైనా ఫోన్లు 40 శాతం వరకు అమ్ముడుపోయాయి. ఇండియాలో నిరుడు అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో లెనొవో రెండో స్థానంలో నిలిచినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) సర్వేలో తేలిందని చైనా అధికారిక పత్రిక వెల్లడించింది. శాంసంగ్ టాప్ లో ఉంది. 10. 7 శాతంతో షియామి మూడు స్థానం దక్కించుకుంది. చైనా కంపెనీలు ప్రవేశించడంతో భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని 30 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది. మైక్రోమ్యాక్స్ అమ్మకాలు అక్టోబర్ లో 16.7 శాతం క్షీణించినట్టు వెల్లడైంది. మార్కెట్ అవకాశాల్లో ‘న్యూ చైనా’గా అభివృద్ధి చెందుతున్న భారత్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మున్ముందు మరింత పెరుగనున్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే లెనొవో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు సర్వే అంచనా వేసింది. మోటొరాలా హైయండ్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది. -
ఆ ఫోన్‌ను వెనక్కిచ్చేసి ఐఫోన్ కొంటున్నారు!
గెలాక్సీ నోట్7 పేలుళ్ల దెబ్బతో శాంసంగ్‌కు తీవ్ర ప్రతికూలతే ఏర్పడిందని పలు రిపోర్టులొచ్చాయి. అయితే గెలాక్సీ నోట్7 రీకాల్ తర్వాత మార్కెట్లలో శాంసంగ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో సగం మంది గెలాక్సీ నోట్7 యూజర్లు, తమ ఫోన్లను నగదుకు వెనక్కి ఇచ్చేసి, ఆ క్యాష్తో ఆపిల్ ఐఫోన్లను కొంటున్నారని తేలింది. 17 శాతం యూజర్లు మాత్రమే వేరే శాంసంగ్ డివైజ్ తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో శాంసంగ్‌కు తలెత్తిన గెలాక్సీ నోట్7 సంక్షోభం వల్ల ఆ కంపెనీ కొంతమంది విధేయులను కోల్పోవాల్సి వస్తుందని ఐడీసీ పేర్కొంది. మొత్తం 1,082 మంది ఆన్లైన్ కస్టమర్లతో ఐడీసీ ఈ సర్వే చేపట్టింది. వారిలో 507 మంది శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఓనర్స్, 347 మంది గతంలో శాంసంగ్ యూజర్లు, 228 మంది శాంసంగ్ కాని యూజర్లు, 24 మంది ప్రస్తుత నోట్7 యూజర్లు ఉన్నారు. అయితే భవిష్యత్తులో వచ్చే శాంసంగ్ ఫోన్లు కొనుక్కునే వాటిపై ఈ గెలాక్సీ సంక్షోభం ఉండదని చాలామంది చెప్పినట్టు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ కాని ఇతర శాంసంగ్ ఉత్పత్తులపైనే ఈ ప్రభావం చూపదని పేర్కొన్నారు. రీకాల్ ప్రాసెస్‌లో కంపెనీ కస్టమర్లతో చాలా విధేయతతో ప్రవర్తిస్తుందని ఈ సర్వేలో తెలిసింది. ఆశ్చర్యకరంగా మరో విషయమేమిటంటే 13 శాతం మందికి అసలు శాంసంగ్ రీకాల్ ప్రక్రియనే తెలియదని తేలింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనతో శాంసంగ్ కంపెనీ ఆ ఫోన్లను రీకాల్ చేస్తూ.. వాటి స్థానంలో కస్టమర్లకు క్యాష్ లేదా గెలాక్సీ ఎస్7/ఎస్ 7 ఎడ్జ్‌లను ఆఫర్ చేస్తోంది. ఆ ఫోన్ల రీకాల్ చేపట్టి, ఉత్పత్తులనూ నిలిపివేసింది. ఎట్టిపరిస్థితుల్లో తమ ఫోన్లను వాడొద్దని ఆ కంపెనీనే హెచ్చరించిన సంగతి తెలిసిందే.