I-League
-
వివాదం ఇంకా ఉంది!
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐ–లీగ్ చాంపియన్‌షిప్‌లో చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ను విజేతగా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించడంపై అంతర్జాతీయ స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టు (సీఏఎస్) స్టే విధించింది. కేసులో విచారణ ముగిసేవరకు టైటిల్ చాంప్‌పై ఓ నిర్ణయానికి రావొద్దని సీఏఎస్ డివిజన్ డిప్యూటీ ప్రెసిడెంట్ మధ్యంతర తీర్పు ఇచ్చారు. ఈ సీజన్ ఐ–లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంటర్ కాశీ జట్టు తమకు సంబంధించిన ఒక మ్యాచ్ ఫలితంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించకుండానే ఏఐఎఫ్ఎఫ్ ఏకపక్షంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును విజేతగా ప్రకటించడం అసంబద్ధమని కోర్టుకెక్కింది. దీనిపై ఆదివారం విచారించిన సీఏఎస్ డివిజన్ ఏఐఎఫ్ఎఫ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. జట్టు సభ్యులకు పతకాలు గానీ, ట్రోఫీని గానీ బహూకరించరాదని స్పష్టం చేసింది. ప్రతివాదులైన విజేత జట్టు చర్చిల్ బ్రదర్స్ యాజమాన్యం, ఏఐఎఫ్ఎఫ్లకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 29 వరకు గడువిచ్చింది. కానీ జరగాల్సిన తంతు ఆదివారమే జరిగిపోవడంతో ఇప్పుడు ఏఐఎఫ్ఎఫ్ నవ్వులపాలైంది. వివాదం ఉన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోని ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్సాహానికి పోయి ఆదివారం విజేత జట్టుకు ట్రోఫీని, పతకాలను బహూకరించింది. అయితే తుదితీర్పుకు లోబడే తమ నిర్ణయముంటుందని, అప్పుడు ట్రోఫీని, పతకాలను వెనక్కి తీసుకుంటామని ముక్తాయించిన తీరు సర్వత్రా విమర్శల పాలైంది. ఏమిటీ వివాదం! ఐ–లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో నాకౌట్ పోటీలు, ఫైనల్ మ్యాచ్ అనేవి ఉండవు. మొత్తం పాల్గొన్న జట్లలో సాధించిన విజయాలు, కొట్టిన గోల్స్, ఇచ్చిన గోల్స్ ఆధారంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో 40 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న చర్చిల్ బ్రదర్స్‌ను ఏఐఎఫ్ఎఫ్ విజేతగా ప్రకటించింది. కానీ 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంటర్ కాశీ జట్టుకు అంతకుముందు నాంధారి జట్టుతో జరిగిన మ్యాచ్ ఫలితం వివాదం రేపింది. ఈ మ్యాచ్‌లో ఇంటర్ కాశీ జట్టు 2–0తో నాంధారి జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అనర్హతకు గురైన ఆటగాడితో మ్యాచ్ ఆడించినందు వల్ల నాంధారి జట్టుపై పెనాల్టీ విధించి ఫలితాన్ని తమకు అనుకూలంగా ఇవ్వాలని ఇంటర్ కాశీ కోరింది. ఒకవేళ తీర్పు ఇంటర్ కాశీ జట్టుకు అనుకూలంగా వస్తే ఆ జట్టు 42 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్‌గా అవతరిస్తుంది. -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్‌ను హెడర్ షాట్‌తో లాల్రొమావియా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోకులం కేరళ ఎఫ్‌సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
I League: మళ్లీ టాప్ ర్యాంకులోకి శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఫుట్‌బాల్ ఐ–లీగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. మంగళవారం జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి జట్టు 4–0 గోల్స్ తేడాతో రౌండ్‌గ్లాస్ పంజాబ్ ఎఫ్‌సీ జట్టును చిత్తుగా ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున కెప్టెన్ డేవిడ్ కాస్టెనెడా మునోజ్ రెండు గోల్స్ (30వ, 88వ ని.లో) చేయగా ... షహబాజ్ (12వ ని.లో), సొరైషామ్ దినేశ్ సింగ్ (62వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. 12 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు 12 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 8 విజయాలు, ఒక ‘డ్రా’, మూడు పరాజయాలతో మొత్తం 25 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 23న ముంబైకి చెందిన కెన్క్రె ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది. చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి -
I- League: దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ.. టాప్‌లో శ్రీనిధి డెక్కన్
I-League 2022-23- ఇంఫాల్: భారత దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన తొమ్మిదో లీగ్ మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 1–0 గోల్ తేడాతో నెరోకా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 47వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ రామ్లున్చుంగా శ్రీనిధి జట్టుకు గోల్ అందించాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోఉంది. 26న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 26న తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ జరగనుంది. లాల్‌బహదూర్ స్టేడియంలోని యోగా హాల్ వేదికగా జరిగే అండర్–7, 9, 11, 13, 15, 17, 19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు 7337578899 లేదా 7337399299 ఫోన్ నంబర్లలో నిర్వాహకులను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ కోరారు. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం?