breaking news
Hyderabad Open Athletics Meet
-
లాంగ్‌జంప్‌లో సోనమ్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్, జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సోనమ్ స్వర్ణంతో మెరిసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో సోనమ్ లాంగ్‌జంప్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో సోనమ్ అత్యధికంగా 5.13మీ. దూరం జంప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అచ్యుత కుమారి (హైదరాబాద్) 4.99 మీటర్లు జంప్ చేసి రజతాన్ని గెలుచుకోగా... 4.47 మీటర్ల దూరం జంప్ చేసిన సింధు (మేడ్చల్)కు కాంస్యం దక్కింది. మరోవైపు పురుషుల 400మీ. పరుగులో రిషబ్ మిశ్రా (హైదరాబాద్) విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 51.0సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని అందుకున్నాడు. వరంగల్‌కు చెందిన ఇంద్రసేన్ (52.4 సెకన్లు) రజతాన్ని, అభిషేక్ (ఎంఎల్ఆర్ఐటీ) కాంస్యాలను గెలుచుకున్నారు. ఈ పోటీలను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు అండర్–10 బాలుర 300 మీ. పరుగు: 1. ఎల్. రాము (వరంగల్), 2. కె. సాయి ఆనంద్ (ఐఈసీఎస్), 3. ప్రణయ్ (ఏఈసీఎస్); బాలికలు: 1. విభా రావు (చిరెక్), 2. ఆర్. రాగిణి (వరంగల్), 3. సంజన (చిరెక్). లాంగ్‌జంప్: 1. ఎం. నవదీప్ (జీపీఎస్టీ), 2. ప్రణవ్ (డీపీఎస్), 3. కె. అమోఘ్ (సారథి). అండర్–12 బాలుర 300మీ. పరుగు: 1. జె. రాఘవ (వరంగల్), 2. ఎం. శంకర్ (వరంగల్), 3. బి. మోహిత్‌కృష్ణ (కొత్త గూడెం); బాలికలు: 1. శరణ్య (ఫోనిక్స్), 2. పి. దీప్తి, 3. శ్రేయశ్రీ (ఐఎస్). అండర్–14 బాలుర 400మీ. పరుగు: 1. టి. సురేశ్ (ఎస్డబ్ల్యూ), 2. వి.శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్), 3. ఉదయ్ కిరణ్ (హెచ్‌పీఎస్–ఆర్); బాలికలు: 1. ఎం. ఇందు (జీహెచ్ఎస్), 2. సి. వాణి (టీఎస్‌డబ్ల్యూ), 3. యువిక (కెన్నడీ). అండర్–16 బాలుర 400మీ. పరుగు: 1. కె. మహేశ్ (వెస్లీ), 2. బి. హరి (వరంగల్), 3. నితిన్ (రంగారెడ్డి); బాలికల లాంగ్‌జంప్: 1. వి. సంధ్య (టీఎస్‌డబ్ల్యూ), 2. రంజిత (టీఎస్‌డబ్ల్యూ), 3. శ్రేయ మీనన్ (సెయింట్ ఆన్స్). -
100 మీ. పరుగు విజేతలు సురేశ్, మహేశ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్, జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టి. సురేశ్, కె. మహేశ్ స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్– 14 బాలుర 100 మీ. పరుగును సురేశ్ 12.01 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. బి. భానుప్రసాద్ (12.07 సెకన్లు) రజతాన్ని గెలుచుకోగా... స్వేజన్ (12.61 సెకన్లు) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అండర్–16 బాలుర 100 మీ. పరుగులో మహేశ్ 11.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని సాధించాడు. జి. గణేశ్ 11.95 సెకన్లతో రజతాన్ని, మీనల్ 11.96 సెకన్లతో కాంస్యాన్ని గెలుచుకున్నారు. లాంగ్‌జంప్ ఈవెంట్లో హెచ్. మురళీ (5.40 మీ.), ఎం. చంద్ర కుమార్ (5.33 మీ.), జి. అజయ్ (5.16 మీ.) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్ నాగపురి రమేశ్, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ కె. రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–10 బాలుర 60 మీ. పరుగు: 1. ఎం. రిషికేశ్ (జెనెసిస్ స్కూల్), 2. పార్థ్ (గార్డియన్), 3. ఎం. రిషికేశ్ (భారతీయ విద్యాభవన్). అండర్–12 బాలుర 80 మీ. పరుగు: 1. జె. అనిల్ (వరంగల్), 2. వి. గోపాల్ (బీసీడబ్ల్యూ), 3. కె. ఆనంద్ (బీసీడబ్ల్యూ). లాంగ్‌జంప్: 1. జి. లక్ష్మణ్ (ఎల్బీహెచ్ఎస్), 2. జె. అనిల్ (జీపీహెచ్ఎస్), 3. కె. ఆనంద్ (ఎంజేపీ). అండర్–16 బాలుర లాంగ్‌జంప్: 1. వి. స్వామి (జీజేసీ), 2. మొహమ్మద్ మన్సూరి (ఏఈసీఎస్), 3. వాసు (హెచ్‌పీఎస్). పురుషుల 100 మీ. పరుగు: 1. కె. రాజు (రంగారెడ్డి), 2. అమ్లాన్ (రంగారెడ్డి), 3. షర్మిన్ (హైదరాబాద్). లాంగ్‌జంప్: 1. రాజు (రంగారెడ్డి), 2. సి. ఫణీంద్రనాథ్ (రంగారెడ్డి), 3. అమ్లాన (రంగారెడ్డి). అండర్–10 బాలికల 60 మీ. పరుగు: 1. విభా రావు (చిరెక్), 2. రాజశ్రీ (ఎస్‌డబ్ల్యూఎస్), 3. సంజన (చిరెక్). లాంగ్‌జంప్: 1. ఎస్. రాజశ్రీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్), 2. ప్రీతిక (హైదరాబాద్), 3. జె. పండు (వరంగల్). అండర్–12 బాలికల 80 మీ. పరుగు: 1. శ్రీయాని (ఇంటర్నేషనల్ స్కూల్), 2. సహన (చిరెక్), 3. ఎం. హర్ష వర్ధిని (ఏఈసీఎస్). అండర్–14 బాలికల 100మీ. పరుగు: 1. ఆర్. మేఘన (సెయింట్ గాబ్రియెల్), 2. నిఖిల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్), 3. కృతి. లాంగ్‌జంప్: 1. కె. నిఖిల (టీఎస్డబ్ల్యూఆర్ఈటీఎస్), 2. అంజలి (హైదరాబాద్), 3. అదితి (సంగారెడ్డి). అండర్–16 బాలికల 100 మీ. పరుగు: 1. రియా గ్రేస్ (సెయింట్ ఆన్స్), 2. ఎం. అక్షయ, 3. సంధ్య (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్). 400 మీ. పరుగు: 1. రియాగ్రేస్ (సెయింట్‌ఆన్స్), 2. పి. వసంత (బీహెచ్ఈఎల్), 3. శర్వాణి (చిరెక్). మహిళల 100 మీ. పరుగు: 1. జి. నిత్య (హైదరాబాద్), 2. సోనమ్ (హైదరాబాద్), 3. అచ్యుత కుమారి (హైదరాబాద్). 400 మీ. పరుగు: 1. జి.నిత్య (హైదరాబాద్), 2. కె. రమాదేవి, 3. అనురాఘ.