మక్కా ప్రమాదంలో బోధన్ వాసి మృతి
బోధన్: సౌదీ అరేబియాలోని మక్కామసీదులో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ వాసి ప్రాణాలు కోల్పోయాడు. బోధన్‌కు చెందిన షేక్ హైదర్ అలీ ఖాద్రీ(65) అనే వ్యక్తి మక్కా సందర్శనకు వెళ్లాడు. కాగా, శుక్రవారం మసీదులో జరిగిన ప్రమాదంలో హైదర్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మసీదులో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, మరో 15 మంది గాయపడిన్టటు సమాచారం. మసీదు ప్రాంగణాన్ని విస్తరించే పనుల్లో వాడుతున్న భారీ క్రేన్ పైభాగం కుప్పకూలడంతో 107 మంది దుర్మరణం చెందగా , మరో 184 మంది గాయపడ్డారు.