breaking news
Human resource department
-
దిగ్గజ కంపెనీ నిర్ణయం: వేలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఐటీ పరిశ్రమలో ఉద్యోగ కోతలు మరింత పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఐబీఎం కంపెనీ ఏకంగా 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఐబీఎం కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల జాబితాలో అధికంగా హెచ్ఆర్ విభాగానికి చెందినవారే (సుమారు 200 మంది) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తొలగించడానికి ప్రధాన కారణం.. హెచ్ఆర్ ఉద్యోగుల పనిచేయడానికి కంపెనీ ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడమే. సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పేపర్ వర్క్ నిర్వహించడం వంటి పనులను పూర్తి చేయడానికి కంపెనీ ఏఐను అభివృద్ధి చేసింది.ఏఐ టెక్నాలజీ పనిని మరింత వేగంగాఈ చేయడంతో.. హెచ్ఆర్ ఉద్యోగుల అవసరం దాదాపు అనవసరమని భావించి కంపెనీ లేఆప్స్ ప్రకటించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మరింత మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2024 నాటికి ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య 2.8 లక్షలు. అయితే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.ఇదీ చదవండి: ఏఐ ఆటోమేషన్‌కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలుసంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను కొన్ని ఎంటర్ప్రైజ్ వర్క్‌ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్ఆర్లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు. -
హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..
న్యూఢిల్లీ: మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి కంపెనీ యాజమాన్యం నోరెళ్లబెట్టింది. కంపెనీ హెచ్ఆర్ కావడంతో ఎటువంటి ఉద్యోగం లేని తన భార్యకు తాను పనిచేస్తోన్న కంపెనీ నుండి జీతం వచ్చేలా చేసి పదేళ్లలో నాలుగు కోట్ల కంపెనీ సొమ్మును కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును ఎలాగోలా తన కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్లో జమయ్యేది. కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు. మొదటగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు యధాప్రకారమే జీతాలు చెల్లించేవారు. ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడటంతో కంపెనీ యాజమాన్య నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు. ఇది కూడా చదవండి: కీచక డీఎస్పీ.. బాధితురాలి ఫోన్‌కు రొమాంటిక్ పాటలు, వీడియోలు -
ఐదో శ్వేతపత్రం విడుదల చేయనున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వివిధ శాఖలపై శ్వేతపత్రాల విడుదల పరంపర కొనసాగుతోంది. తాజాగా మానవ వనరుల శాఖపై శ్వేతపత్రాన్ని గురువారం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఆ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు వారానికి ఓ శాఖ చొప్పున విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటి పారుదల రంగంపై శ్వేతప్రతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా చంద్రబాబు ఈ రోజు సమావేశమైయ్యారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లతో బాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత అవినీతి నిర్మూలనపై మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.00 గంటలకు పలువురు ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.