breaking news
Hukumpet
-
హుకుంపేటలో వైఎస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య
రాజమండ్రి : కుటుంబ వివాదాల నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో సోమవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న రియల్ఎసేట్ట్ వ్యాపారిని అతని భార్య, బావ మరిది, ఇద్దరు కుమారులు కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం తాళ్ల ముదునూరుపాడు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగల పట్టాభి రామారెడ్డి (54) ప్రస్తుతం హుకుంపేట గ్రామంలోని బాలాజీటవర్స్లో మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన గిరిజన యువతితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి 12.15 గంటల సమయంలో రామారెడ్డి భార్య సూర్యావాణి, బావ మరిది సత్తిశివకృష్ణా రెడ్డి, కుమారులు యోగాదుర్గాతేజ్ రెడ్డి, డోలాశంకర్తేజ్ రెడ్డి బాలాజీటవర్స్కు చేరుకున్నారు. అక్కడున్న వాచ్మెన్ సాయంతో అతడుండే రెండో ఫ్లోర్లో ఫ్లాట్‌కు వెళ్లి బలవంతంగా తలుపులు పగులగొట్టి రామారెడ్డిపై దాడికి దిగారు. కత్తితో పొట్టపైన, మెడపైన విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో వేరే గదిలో ఉన్న గిరిజన యువతితోపాటు, మరో మహిళ కూడా భయపడి బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు. నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా రామారెడ్డి నాలుగేళ్ల క్రితం వెలగల పట్టాభిరామారెడ్డికి, భార్య సూర్యావాణికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇంటిలో రూ.15 లక్షల నగదు, పెద్దమొత్తంలో బంగారం చోరీకి గురయ్యాయి. ఆ చోరీ భార్య, బావమరుదులు చేశారని రామారెడ్డి నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య, బావమరుదులు ఆయనను అంతమొందించేందుకు అన్నంలో విషప్రయోగం చేశారు. అప్పటి నుంచి రామారెడ్డి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో సూర్యావాణి రామారెడ్డిపై 498ఏ కేసు పెట్టింది. రామారెడ్డి ఆమెతో విడిపోవడానికి కోర్టులో విడాకుల కేసు వేశాడు. అప్పటి నుంచి రామారెడ్డి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. తొమ్మిది నెలల క్రితమే హుకుంపేటకు.. కొంతకాలం మారేడుమిల్లిలో ఉన్న రామారెడ్డి, తొమ్మిదినెలల క్రితమే హుకుంపేటలోని బాలాజీ టవర్స్‌లోని ఫ్లాట్‌లోకి అద్దెకు వచ్చారు. అపార్టుమెంటువాసులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని చెప్పినట్టు సమాచారం. మారేడుమిల్లికి చెందిన గిరిజన యువతి చదల దుర్గాదేవి తన మేనకోడలు అని చదివిస్తున్నానని, రాజమహేంద్రవరానకి చెందిన యేరుకొండ శ్రీవిద్య, ఏడాది పాపతో తనతో పాటు తనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుందని తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ.. వెలగల పట్టాభి రామారెడ్డిపై అతడి భార్య సూర్యవాణి, బావమరిది సత్తి శివకృష్ణారెడ్డి, కుమారులు నాలుగేళ్లుగా రెక్కీ నిర్వహిస్తూ వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒకసారి అతడిపై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఇద్దరు కుమారులు బాలాజీ టవర్స్‌కు వచ్చి తండ్రి రామారెడ్డిని కలిసి వెళ్లినట్టు సమాచారం. అర్ధరాత్రి వచ్చి హత్యకు పాల్పడినట్లు పక్కా ప్రణాళిక ప్రకారమే చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు రామారెడ్డిపై తాడేపల్లిగూడెం పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. అధికారులను ఏసీబీకి పట్టించడంలో దిట్ట. అధికారులను బ్లాక్మెయిల్ చేసేవాడు. హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు పోలీసులు పరిశీలించి, క్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండల డీఎస్పీ, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ
హుకుంపేట(గోపాలపురం): జిల్లాలో త్వరలో వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కె.కోటేశ్వరి చెప్పారు. మండలంలోని హుకుంపేట ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డాక్టర్ల కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు నిరాకరించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. హుకుంపేట పీహెచ్‌సీకి శాశ్వత వైద్యులు, స్టాఫ్‌నర్స్, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తామని చెప్పారు. ముందుగా పోలవరం నిర్వాసితులు పైడిపాక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. కె.నాగేశ్వరావు, పీడీఆర్ కె.స్వామి, సత్యవతి, త్రిమూర్తులు ఆమె వెంట ఉన్నారు. -
మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో హుకుంపేటకు చేరుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం హుకుంపేటలో సముద్రంలో గల్లంతైన ముగ్గురు మత్య్సకారుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అంతకముందు విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన 22 మంది కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం తుని సమీపంలోని పెరుమాళ్లపురంలో సభలో ఆయన ప్రసంగించారు.