breaking news
Huge trees
-
రూ.2,700 కోట్ల స్థలంపై గురి.. క్యాంపు ‘భరతం’ పట్టేస్తా..!
చుట్టూ కాంక్రీట్ కట్టడాల నడుమ ఫొటోలో ఆకుపచ్చగా కనిపిస్తున్న ఈ ప్రాంతం కర్నూలులోని బీ, సీ క్యాంపు క్వార్టర్స్. కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు అధికారులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఏ, బీ, సీ క్వార్టర్లను నిర్మించింది. బీ, సీ క్యాంపు క్వార్టర్స్‌లో దాదాపు వంద ఏళ్ల నాటి భారీ వృక్షాలు ఉన్నాయి. కిక్కిరిసిన నగరానికి ప్రాణ వాయువు అందించడంలో వీటి పాత్ర చాలా కీలకం. కర్నూలులోనే అత్యధికంగా చెట్లు ఉన్న ఈ ప్రాంతం కూడా ఇదే. అక్కడకు వెళితే ఆ చల్లదనానికి మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాంటి భారీ వృక్షాలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. బీ, సీ క్వార్టర్లను కూలగొట్టి టీడీపీ జిల్లా కార్యాలయానికి స్థలంతోపాటు మినీ క్రికెట్ స్టేడియం, మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో చకచకా మంత్రాంగం జరుగుతోంది. దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపు క్వార్టర్స్ విలువ దాదాపు రూ.2,700 కోట్లు! కర్నూలు చరిత్రలోనే దీన్ని అతి పెద్ద దోపిడీగా అభివర్ణిస్తున్నారు. బీ, సీ క్యాంపు స్థలాలను ఖాళీ చేయాలని అందులో ఉంటున్న వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు తాజాగా నీరు, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబరు 31 వరకూ కర్నూలే రాజధాని. అప్పట్లో అధికారులు నివాసం ఉండేందుకు ఏ, బీ, సీ క్వార్టర్లను నాటి ప్రభుత్వం నిర్మించింది. నగరంలో ఆ ప్రాంతాలను ఇప్పటికీ ఏ, బీ, సీ క్యాంపు అని వ్యవహరిస్తుంటారు. మొత్తం 1,090 క్వార్టర్లలో ప్రస్తుతం 953 ఉన్నాయి. ఇందులో 367 క్వార్టర్లలో అధికారికంగా కొందరు, 490 క్వార్టర్లలో అనధికారికంగా మరికొందరు నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ సెంటు రూ.30 లక్షలకుపైగా ఉంది. ప్రధాన రహదారి ప్రాంతంలోనైతే రూ.50 లక్షలుపైనే ఉంది. సగటున రూ.30 లక్షలు అనుకున్నా ఎకరా రూ.30 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం 90 ఎకరాల విలువ రూ.2,700 కోట్లపైనే! నగర నడిబొడ్డున అత్యంత విలువైన ఈ ప్రాంతంలో 70 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిని తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని, అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆలోచించారు. ఆయన హఠాన్మరణంతో ఆ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. సర్కారు ఖరీదైన స్థలంపై టీడీపీ ప్రజాప్రతినిధుల కన్ను బీ, సీ క్యాంపులోని క్వార్టర్లను తొలగించి మినీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని మంత్రి టీజీ భరత్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తక్కిన స్థలాలను లీజు పేరుతో కూటమి నేతలు గుప్పిట పట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో 33 ఏళ్లు లీజుకు తీసుకుని మల్టీప్లెక్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్‌హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలుత 39 క్వార్టర్లను కూల్చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు అందులో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం మిగతావారికి జారీ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ స్థలం కర్నూలు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. తొలగించిన స్థలంలో 3–5 ఎకరాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి మిగతా 85–87 ఎకరాల స్థలాన్ని లీజు పేరుతో 33 ఏళ్లు దక్కించుకునేలా సిద్ధమయ్యారు. ఆ తర్వాత కూడా లీజుదారుడు కొనసాగాలని భావిస్తే మరో రెండు దఫాలు అంటే 66 ఏళ్లు వారి ఆదీనంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే లీజు పేరుతో 99 ఏళ్లు వారి ఆజమాయిషిలోనే ఉంటుంది. కర్నూలులో అత్యంత విలువైన స్థలం ఇదే కావడం గమనార్హం! స్టేడియం కోసం ఇప్పటికే స్థలం సేకరించిన బీసీసీఐ.. కర్నూలులో భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐ ఇప్పటికే నేషనల్ హైవే సమీపంలో బాలసాయి స్కూలు పక్కన 16.40 ఎకరాలను సేకరించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించే వీలుంది. హైదరాబాద్–బెంగళూరు హైవే పక్కనే ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు. ఈ స్థలం ఉన్నప్పటికీ మళ్లీ మినీ క్రికెట్ స్టేడియం పేరుతో నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై కూటమి ప్రజాప్రతినిధులు కన్నేయడం గమనార్హం! రెండు నెలలు గడువిద్దామన్నా.. క్వార్టర్లు ఖాళీ చేయించేందుకు కీలక ప్రజాప్రతినిధి ఐదు ప్రభుత్వ శాఖలను పురమాయించారు. పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ అధికారులను రంగంలోకి దించారు. ఈ నెల 8వతేదీ నుంచి అధికారులు నీరు, కరెంట్ సరఫరా నిలిపివేశారు. పండుగ వేళ తామంతా ఎక్కడికి వెళ్లాలి? పిల్లల చదువులు ఏం కావాలి? ఉన్నఫళంగా కరెంటు, నీరు ఆపేస్తే తాము ఏం చేయాలని అందులో ఉంటున్న కుటుంబాలు అవస్థ పడుతున్నాయి. ఆర్అండ్బీ, కలెక్టరేట్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మూడు రోజులుగా ఆందోళనకు దిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రెండు నెలలు గడువిద్దామని కీలక ప్రజాప్రతినిధికి అధికారులు సర్దిచెప్పే యత్నం చేసినా వినలేదని చర్చించుకుంటున్నారు. రూ.120 కోట్ల స్థలంలో టీడీపీ కార్యాలయం!టీడీపీ జిల్లా కార్యాలయం కోసం రెండెకరాలు 99 ఏళ్ల పాటు లీజుకివ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలెక్టర్ రంజిత్‌బాషాకు లేఖకు రాశారు. కర్నూలులో ‘బీ’ క్యాంపు మెయిన్ రోడ్డులోని ఖరీదైన స్థలాన్ని టీడీపీ కోరింది. ఇక్కడ సెంటు రూ.60 లక్షలు వరకు ఉంది. ఈ లెక్కన టీడీపీ కోరుతున్న రెండు ఎకరాల విలువ రూ.120 కోట్లకుపైనే ఉంటుంది! -
తిరుమల ఘాట్ రోడ్లో విరిగిపడిన భారీ వృక్షాలు
-
హోరు గాలి.. జోరు వాన
జిల్లాలో గాలివాన బీభత్సం పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు అంధకారంలో గ్రామాలు పటాన్చెరు/చేగుంట/భెల్/ శివ్వంపేట: జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలికి వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పటాన్చెరు పట్టణం వెంకటేశ్వర కాలనీ,ఆల్విన్ కాలనీల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. అమీన్పూర్, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ ప్రాంతాల్లోని 50 కాలనీలు అంధకారంలో ఉండిపోయాయి. చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో మామిడిచెట్టు ఈదురుగాలులకు కూలిపోయింది. దీంతో పాడిగేదె చె ట్టుకింద పడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన జంగం కృష్ణ, జంగం స్వామిలకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో సుమారు వంద చెట్లు నేలకూలాయి. అనేక విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివ్వంపేట మండలం పోతారంలో పౌల్ట్రీఫాం కూలిపోయింది. సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. రూ. 6లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు. దొంతి, మగ్దుంపూర్, ఉసిరికపల్లిలో రేకుల ఇళ్ల పైకప్పులు కూలాయి. దీంతో భయభ్రాంతులకు గరైన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహధారి పక్కన చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
స్వార్థానికి నేలకొరిగి..
ప్రభుత్వభూముల్లో భారీ వృక్షాల్ని కూలగొడుతున్న అక్రమార్కులు మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం పిఠాపురం : ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నిలబడే సైన్యమది. భారీ వరదలను సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఆ వృక్షాలు.. అక్రమార్కుల ధనదాహానికి మాత్రం నేలకొరుగుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ తదితర శాఖలకు చెందిన భూముల్లోని వృక్షాలను స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు నీటి పారుదల శాఖ పరిధిలో భారీ వృక్షాలను కొద్ది రోజులుగా కొల్లగొడుతున్నారు. ఎలా జరుగుతోందంటే.. పంట కాలువల గట్లు, ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా, పోరంబోకు భూముల్లో ఉన్న చెట్లను అక్రమార్కులు గుర్తిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా వాటిని నరికేస్తున్నారు. ఎవరైనా అడిగితే.. రోడ్డు విస్తరణ, కాలువల అభివృద్ధి కోసం తొలగిస్తున్నట్టు నమ్మిస్తున్నారు. నెల రోజులుగా ఏలేరు కాలువకు ఇరువైపులా ఉన్న 38 భారీ వృక్షాలను కూలగొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటిని కొన్ని సామిల్లులకు తరలించి, విక్రయిస్తున్నట్టు తెలిసింది. కొందరు వ్యాపారులు కాలువ పక్కనున్న పొలాల్లో చెట్లను కొనుగోలు చేసి, పనిలోపనిగా కాలువ గట్లపై ఉన్న చెట్లను నరికేస్తున్నారు. చెట్టు నరికాక ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువగా రాత్రివేళ చెట్లు నరుకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం పూటే చెట్ల మొదళ్ల వద్ద శుభ్రం చేసుకుంటున్నారు. గట్లకు తూట్లు చెట్లను కొట్టవేయడం ద్వారా అక్రమార్కులు.. పంటకాలువల గట్లుకు తూట్లు పొడుస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనపడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు మొదలు నరికేందుకు గట్లను తవ్వేస్తుండడంతో.. నీటి ఉధృతికి గట్లు తెగిపోవడం ఖాయమని అంటున్నారు. పట్టించుకోని అధికారులు ఇటీవల పిఠాపురం-ఉప్పాడ, పిఠాపురం-సామర్లకోట ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా ఉన్న అనేక వృక్షాలను కొందరు అక్రమంగా తరలించుకుపోయారు. పిఠాపురం-ఉప్పాడ రోడ్డులో ఇరిగేషన్ శాఖకు చెందిన పంటకాలువలకు ఇరువైపులా ఉన్న చెట్లను పట్టపగలే నరికి, తరలించుకుపోయినా అధికారులు పట్టించుకోలేదు. కిర్లంపూడి నుంచి పిఠాపురం వరకు ఉన్న ఏలేరు కాలువకు ఇరువైపులా మామిడి, చింత, సుబాబుల్, జీడిమామిడి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిలో అత్యంత భారీ వృక్షాలను నెల రోజులుగా కూల్చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెట్ల నరికివేతపై అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. విచారణ జరిపిస్తాం ఏలేరు, పీబీసీ కాలువ గట్లపై చెట్లను నరికేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. సొంత భూముల్లో ఉన్న చెట్లను రైతులే నరుకుతున్నట్టు భావిస్తున్నాం. కాలువగట్లపై చెట్లను కూల్చడం నేరం. దీనిపై విచారణ జరిపిస్తాం. చెట్ల నరికివేతకు ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేవు. చెట్ల తొలగింపులో అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణ నిజం కాదు. - కృష్ణారావు, ఇరిగేషన్ డీఈ, ఏలేరు సెక్షన్ -
అంతటా తీవ్ర నష్టం
చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ‘హుదూద్’ విలయం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల భా రీవృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరి, చెరకు, కంది, ఇతరపంటలతో పాటు కూరగాయలకు తీవ్రనష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల ఈదురుగాలులకు వరి పంట పూర్తిగా నేలకొరిగింది. సుమారు వందల ఎకరాల్లో చెరకు పంటకు నష్టం వాటిల్లింది. అన్నదాతకు కోలుకోలేనిదెబ్బ తగిలింది. చోడవరం నియోజకవర్గంలోని చోడవరం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట మండలాల్లో గాలులకు పలుచోట్ల పంటలు నేలమట్టమయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. టెలికాం సేవలు స్తంభించాయి. ఫోన్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రచండ గాలులకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. చోడవరంలోని తహశీల్దార్ కార్యాలయం పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయింది. రోడ్లకుఅడ్డంగా చెట్లు కూలిపోయాయి. వాగులు, చెరువులు నీటితో నిండిపోయాయి. కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చీడికాడ, బుచ్చెయ్యపేట, రావికమతం, మాడుగుల, కె.కోటపాడు, చోడవరం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా చిమ్మచీకట్లు కమ్ముకోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. -
జిల్లాలో గాలివాన బీభత్సం
న్యూస్‌లైన్ నెట్వర్క్: జిల్లాలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని చర్ల, కూనవరం, చింతూరు, గుండాల, టేకులపల్లి మండలాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చర్ల మండలంలో గాలిదుమారం.... చర్ల: చర్ల మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలిదుమారం కారణంగా పలు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరి గాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో తీగలు తెగడంతో పాటు, స్తంభాలు విరిగిపోయాయి. మండలంలోని రాళ్లగూడెంలో ఓ తాటి చెట్టుపై పిడుగుపడి భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. దేవరాపల్లి, కుదునూరు, ఆర్ కొత్తగూడెం, సత్యనారాయణపురం, కలివేరు, గాంధీనగరం తదితర గ్రామాల్లో పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. దేవరాపల్లిలో 11కేవీ విద్యుత్ లైన్‌కు సంబంధించిన స్తంభాలు విరిగిపోగా, గొమ్ముగూడెంలో ఎల్టీ లైన్‌కు సంబంధించిన స్తంభం విరిగి పోయింది. చినమిడిసిలేరు, ఆంజనేయపురం, కలివేరు గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు, తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లింగాపురం, గొంపల్లి, విజయకాలనీ, గుంపెన్నగూడెం తదితర గ్రామాలలో సైతం విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని సత్యనారాయణపురం, చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని అన్నీ 11 కేవీ విద్యుత్ ఫీడర్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో మండలం మొత్తం అంధకారం నెలకొంది. చర్ల మండలంతో పాటు వెంకటాపురం వాజేడు మండలాలలకు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లో కూడా పలు చోట్లు చెట్లు తీగలపై పడడంతో ఆ రెండు మండలాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గుండాలలో భారీ వర్షం... గుండాల: గుండాల మండలంలో శనివారం రాత్రి గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలువాగులు, వంకల్లో స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఈ వర్షానికి మల్లన్నవాగు, కిన్నెరసాని, జలేరు, దున్నపోతులవాగు, ఏడుమెలికల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతర్గత రోడ్లు బురదతో నిండిపోయాయి. ఇల్లెందు - గుండాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలిదుమారానికి పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. నిన్నమొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు. కూనవరంలో గాలి దుమారం... కూనవరం: మండలంలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీగా గాలి దుమారం రావడంతో జనజీవనం అతలాకుతలం అయింది. మండలంలోని పల్లురు గ్రామంలో వందేళ్లనాటి భారీ వృక్షం ఒక పక్కనే ఉన్న సవలం భద్రమ్మ ఇంటిపై కూలింది. ఇంట్లోని వారంతా సమీప గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసం అయింది. టేకులబోరు సమీపంలో ఓ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మర్రిగూడెం-పల్లూరు గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. గాలివాన కారణంగా మండలం కేంద్రంలోని పళ్ల పైకప్పులు లేచిపోయాయి. సుమారు గంటన్నర పాటు వీచిన గాలిన వాన బీభత్సం కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగి పడడంతో రాకపోకలు స్తంభించాయి. టేకులపల్లిలో వర్షం టేకులపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రెయినేజీల్లో మురుగునీరు బయటకు వచ్చింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం కారణంగా మండలంలోని ముత్యాలంపాడు, బొమ్మనపల్లి పంచాయతీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చింతూరులో... చింతూరు: మండలంలో శనివారం సాయంత్రం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చింతూరు, మోతుగూడెం రహదారిలో ఎర్రంపేట నుంచి లక్కవరం జంక్షన్ వరకు సుమారు 20 చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చింతూరు, వీఆర్‌పురం రహదారిలో కూడా చింతూరు, చూటూరుల నడుమ పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు చింతూరులోని శబరిఒడ్డులో పిసిని సోమరాజుకు చెందిన ఇంటిపై మామిడిచెట్టు కూలడంతో ఇల్లు కుప్పకూలింది. ఈదురు గాలుల ధాటికి పెదశీతనపల్లిలో వంజం పాపారావుకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గాలిదుమారం కారణంగా పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో మండలం లోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
అడవిలో అగ్నికీలలు
తగలబడుతున్న భారీ వృక్షాలు {పాణాలు కోల్పోతున్న వన్యప్రాణులు ఏటా 1500కు పైగా ప్రమాదాలు పర్యావరణానికి పెద్ద ఎత్తున చేటు కొయ్యూరు, న్యూస్‌లైన్: నిత్యం పచ్చగా కళకళలాడే తూర్పుకనుమల్లో అగ్గి రేగింది. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడం తో విలువైన వృక్షాలతోపాటు వన్యప్రాణులు కాలిబూడిదవుతున్నాయి. జీకే వీధి మండలం దబ్బకోట ప్రాంతం, డుంబ్రిగుడకు సమీపంలోని పెద్దపాడు కొండలు మూడు రోజు లుగా కాలిపోతున్నాయి. పరి సర గ్రా మస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలి తం లేకపోతోంది. తామంతా అడవిలో వ్యవసాయ పనుల్లో ఉండగా మంటలు ఎగిసిపడితే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 53 శాతం విసీ ్తర్ణం కలిగి ఉన్న విశాఖ మన్యంలో అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నా యి. వేసవిలో ఆకురాల్చే చెట్లు తూర్పుకనుమల్లో ఎక్కువ. మార్చి-ఏప్రిల్ మధ్యలో ఈ రాలిన ఆకులు ఎండిపోతాయి. అడవి లోకి వెళ్లే గిరిజనులు లేదా పశువుల కాపరు లు ఆకులను తగులబెడతారు. దీంతో పక్క నే ఉన్న భారీవృక్షాలకు కూడా మంటలు తాకి విలువైన కలప బూడిదైపోతోంది. మన్యంలో ఐదున్నర లక్షల హెక్టార్లకు పైబడి అడవులు ఉన్నాయి. ఇందులో సు మారు లక్ష హెక్టార్లలో దట్టమైన అడవి ఉంది. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకచోట్ల ప్రమాదాలు జరుగుతున్నా అటవీ శాఖ పెద్దగా స్పందించడంలేదు. కొన్నిచో ట్ల ప్రమాదాల నివారణకు కొన్ని చోట్ల తవ్వకపోవడంతో ఇలాంటి దావానలం వ్యాపిస్తోంది. ఈ మంటల్లో కొన్నిచోట్ల ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అటవీ శాఖ నివేదిక ప్రకారం ఏడాదిలో 1,500కు పైగా అగ్నిప్రమాదాలు అడవుల్లో చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 30శాతానికి పైగా అడవులు అగ్నిప్రమాదంలో నష్టపోతున్నాయి. దీనికితోడు చెట్లను నరికి న తర్వాత మోడులను కాల్చడం కూడా అట వీ నాశనానికి కారణమవుతోంది. దీంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడమేకాకుం డా వన్యప్రాణులు సైతం మరణిస్తున్నా యి. దీనిపై ‘న్యూస్‌లైన్’ నర్సీపట్నం డీఎ ఫ్వో లక్ష్మణ్‌ను సంప్రదించగా విశాఖమన్యంలో అంత ఎక్కువగా ప్రమాదాలు జరి గే అవకాశం లేదన్నారు. ప్రమాదం జరిగి నా ఎండిపోయిన ఆకులు కాలుతాయి త ప్ప చెట్లకు ప్రమాదం ఉండదన్నారు. శేషాచలం అడవులకు ఇక్కడి అడవులకు వ్యత్యాసాలు ఉన్నాయన్నారు.