breaking news
Housing loan schemes
-
గృహ రుణాల్లో 8–10 శాతం వృద్ధి
ముంబై: గృహ రుణ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం మేర వృద్ధిని సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో హెచ్ఎఫ్సీలు అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే ఎటువంటి వృద్ధిని నమోదు చేయలేదని.. రుణాల మంజూరు, వసూళ్ల సామర్థ్యంపై కరోనా రెండో విడత ప్రభావం ఉందని ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ సానుకూల పరిస్థితుల మద్దతుతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి సాధ్యమేనని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. అయితే జూన్ చివరి నుంచి వసూళ్ల సామర్థ్యం తిరిగి పుంజుకుందని.. అది సెప్టెంబర్ త్రైమాసికంలో మరింత మెరుగుపడిందని తెలిపింది. పరిశ్రమలో డిమాండ్ బలంగా ఉండడం, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, టీకాల కార్యక్రమం విస్తృతం కావడం అన్నవి హెచ్ఎఫ్సీల నుంచి స్థిరమైన రుణాల మంజూరుకు సాయపడతాయని ఇక్రా పేర్కొంది. ‘‘హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియో (ఆన్బుక్/పుస్తకాల్లోని రుణాలు) 2021 జూన్ చివరికి రూ.11 లక్షల కోట్లుగా ఉంది. గృహ రుణాలు, ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు, నిర్మాణ రుణాలు, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ వీటిల్లో ఉన్నాయి’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ తెలిపారు. కరోనా కారణంగా 2020–21 సంవత్సరంలో హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియో 6 శాతమే వృద్ధి చెందడం గమనార్హం. -
గృహ కొనుగోలుదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: గృహా కొనుగోలుదారులకు శుభవార్త అందించింది కేంద్రం. మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెంచే లక్ష్యంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లో గృహాల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది 2022 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు ఈ రాయితీ వర్తించనుంది. మొదటిసారి రూ.45 లక్షల లోపు ఇళ్లు కొనేవారికి అదనంగా రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు సరసమైన ధరలో ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తికి 3.5 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో దేశంలోని 7-8 ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు 40-50 శాతం తగ్గాయని ప్రాపర్టీ కన్సల్టెంట్స్, డేటా అనలిటిక్ సంస్థలు వెల్లడించాయి. (చదవండి: ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు) -
ఐసీఐసీఐ బ్యాంక్ అదనపు గృహ రుణం!
- దేశంలో మొట్టమొదటి ‘తనఖా’ హామీ ఆధారిత పథకం - 20 శాతం వరకూ అదనపు రుణం - రుణ కాల వ్యవధి పొడిగింపు అవకాశం ముంబై: దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ బుధవారం సరికొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. అదనపు గృహ రుణం పొందే అవకాశాన్ని తద్వారా కల్పిస్తోంది. ఈ తరహా పథకం ఆవిష్కరణ దేశంలో ఇదే తొలిసారి. అమెరికా, కెనడాల్లో ఈ తరహా పథకాలు ప్రాచుర్యం పొందాయి. బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు ఇవీ... - ‘ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ట్రా హోమ్ లోన్స్’ ప్రొడక్ట్‌గా ఇది ప్రారంభమైంది. - ఇది ‘తనఖా’ హామీ ఆధారిత పథకం. - 20 శాతం వరకూ అదనపు రుణం దీనివల్ల లభ్యం అవుతుంది. - రుణ చెల్లింపు కాల వ్యవధి ఏడేళ్ల (67ఏళ్ల వయస్సు వరకూ) వరకూ పెంచుకునే వీలుంది. - ఈ సౌలభ్యతలను పొందడానికి రుణం పొందే ప్రారంభ దశలోనే ఒకేసారి కొంత మార్టిగేజ్ గ్యారంటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. - మొత్తం రుణ పరిమాణంలో గరిష్టంగా 2 శాతం వరకూ ఈ ఫీజు ఉంటుంది. - అదనపు రుణం, ఫీజు నిర్ణయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణ గ్రహీత వయస్సు.. రుణ కాలపరిమితి పొడిగింపు.. రుణ గ్రహీతకు ఆదాయ వనరు.. సంబంధిత వ్యక్తి ఏదైనా ఉద్యోగస్తుడా? లేక స్వయం ఉపాధి పొందుతున్నాడా... రుణం-ఆస్తివిలువ నిష్పత్తి తత్సంబంధ అంశాలు అన్నింటిపై ఆధారపడి అదనపు రుణం అందుకు సంబంధిత ఫీజ్ నిర్ణయం చేస్తారు. - ఇండియా మార్టిగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ పథకం అమలవుతుంది. ఈ కార్పొరేషన్ ఇంక్రిమెంటల్ రిస్క్‌కు గ్యారంటీగా ఉంటుంది. - మధ్య వయస్సున్న వ్యక్తులు, స్వయం ఉపాధి ఆధారంగా జీవనం సాగిస్తున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రధానంగా ఈ పథకాన్ని ఉద్దేశించడం జరిగిందని బ్యాంక్ ఈడీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు. తనఖా మార్కెట్ వృద్ధికి దోహదం: కొచర్ తమ బ్యాంక్ తాజా చొరవ దేశంలో మార్టిగేజ్(తనఖా) మార్కెట్ వృద్ధికి దోహదపడుతుందని కొచర్ తెలిపారు. రుణ గ్రహీతలకు ఇబ్బందులేవీ పెరక్కుండా... కస్టమర్లకు మెరుగైన రుణ సౌలభ్యతను ఈ తరహా పథకాలు అందిస్తాయని వివరించారు. కాగా, చైనా ప్రభావం వల్ల వచ్చిన ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలు, కరెంట్ అకౌంట్, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాల్లో సానుకూలతలు దేశానికి కలిసివచ్చే అంశాలని సైతం అన్నారు. -
సులభంగా గృహరుణం..
త్వరలోనే వడ్డీరేట్లు దిగిరానుండటంతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలు ఖాతాదారులను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 20 ఏళ్లకు ఫిక్స్డ్ హోమ్‌లోన్ ప్రకటిస్తే, మరికొన్ని బ్యాంకులు బేస్‌రేటు కంటే వడ్డీరేట్లను తగ్గించడానికి వీలు లేకపోవడంతో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు, ప్రీక్లోజర్ చార్జీలపై మినహాయింపులతో ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా గృహరుణం తీసుకోవాలనుకునే వారు పరిశీలించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. సొంతింటి కల సాకారం చేసుకోవడవునేది చాలా క్లిష్టమైన అంశం. సరైన ఇంటిని అన్వేషించడం దగ్గర నుంచి, దానికి తగ్గ నగదును సవుకూర్చుకోవడం వరకు అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అందుబాటు ధరలో ఉన్న ఇంటిని ఎంచుకోవడం, దీనికి తగిన నగదును సవుకూర్చుకోవడవునేవి చాలా ముఖ్యాంశాలు. ఇప్పుడు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాలను అందిస్తున్నాయి. గృహరుణాన్ని ఇచ్చే సంస్థలో సరైన సంస్థను ఎంచుకోకపోతే సొంతింటి కల నెరవేర్చుకున్న ఆనందం ఒక్క రోజూ కూడా మిగలదు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణం పొందాలంటే ఈ అంశాలే కీలకం. ఎటువంటి గృహ రుణం కావాలి మార్కెట్లో అనేక గృహ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ గృహరుణం, ఇంటి విస్తరణకు రుణం, ఇంటి వురవ్ముతులకు రుణం, ఇంటిని తనఖా పెట్టి తీసుకునే రుణం, వుహిళల గృహరుణం, నివాసేతర గృహరుణం, స్టెప్ అప్ ఈఎంఐ, లీజ్ రెంటల్ ఫైనాన్స్ వంటి అనేక పథకాలున్నాయి. ముందుగా ఈ పథకాల్లో ఏది మీకు సరిపోతుందో పరిశీలించండి. మీరు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నారా లేక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారా లేక ప్రస్తుతమన్న ఇంటిని విస్తరిస్తున్నారా అనేవి కీలకం. ఎందుకంటే ఇవి దేనికవి విభిన్నం. వడ్డీ రేట్ల దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ల వరకు అన్నీ వూరిపోతాయి. ఎవరు తీసుకోవచ్చు వ్యక్తిగతంగా లేదా సహకార సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, వివిధ సంఘాలు గృహరుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత గృహరుణాల విషయూనికి వస్తే జీతం ఆదాయుంగా ఉన్న వారితో పాటు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు ఇలా ఆదాయుం ఉన్న ప్రతీ ఒక్కరు తీసుకోవచ్చు. సాధారణంగా ఇంటి విలువలో 80 శాతం వరకు గృహ రుణం లభిస్తుంది. పైన పేర్కొన్న వాటిలో ఏ విభాగంలోకి వస్తారన్నదాన్ని బట్టి డాక్యుమెంటేషన్, వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయి. ఎంత రుణం వస్తుంది... ఈ విషయూనికి వచ్చేసరికి గృహరుణ సంస్థలు అనేకాంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ముఖ్యంగా మీ చెల్లింపు సావుర్థ్యంతో పాటు, మీ వయసు, విద్యార్హత, మీపై ఆధారపడి జీవించే వారి సంఖ్య, అప్పులు, పొదుపు, ఆస్తులు, స్థిరంగా వచ్చే ఆదాయుం వంటి అంశాలను పరిశీలిస్తారు. అలాగే రుణం తీసుకునే వారు ఇంటిలోని ఇతర కుటుంబ సభ్యులకు ఆదాయం ఉంటే వారిద్దరూ కలసి రుణానికి దరఖాస్తు చేస్తే వురింత రుణం పొందే అవకాశంతో పాటు, సులభంగా లభిస్తుంది. రుణ కాలపరిమితి.. గృహరుణాల్లో పరిశీలించాల్సిన వాటిలో వురో ముఖ్యమైన అంశం రుణ కాలపరిమితి. సాధారణంగా అన్ని బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్ల కాలపరిమితిలో రుణాలను అందిస్తాయి. వురికొన్ని సంస్థలు అయితే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా రుణాన్ని ఇస్తున్నాయి. జీతం ఆదాయుం ఉన్న వారికి 60 ఏళ్ల వరకు, అదే వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు 65 ఏళ్ల వరకు మాత్రమే రుణాన్ని ఇస్తాయి. ప్రతీ ఒక్కరు పదవీ విరవుణలోపే గృహరుణాన్ని తీర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ఇవి కావాలి.. గృహరుణానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరి. కేవైసీ నిబంధనలకు అనుగుణంగా మీ నివాస, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఉద్యోగస్తులు అయితే మీ జీతానికి సంబంధించిన ఆరు నెలల శాలరీ స్లిప్, అపాయింట్మెంట్ ఆర్డరు, ఫాం 16, ఒక ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే వృత్తినిపుణులు అయితే మూడేళ్ల లాభనష్టాల చిట్టా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యం ఇది మీ వ్యక్తిగత జీవిత అలవాట్లు, బాధ్యతలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఉన్న వారు నెల జీతంలో గరిష్టంగా 40 శాతం వరకు వూత్రమే ఈఎంఐ ఉండే విధంగా చూసుకోవాలి. అదే ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు లేనివారు 60 శాతం వరకు చెల్లించే విధంగా ఈఎంఐ ఎంచుకోవచ్చు. ఈఎంఐ ఎంత అనేది మీరు తీసుకునే రుణం, అది చెల్లించే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ గృహరుణంలో ఎంచుకునే వడ్డీరేటు విధానం కూడా చాలా కీలకమైనది. సాధారణంగా బ్యాంకులు చలన (ఫ్లోటింగ్), స్థిర (ఫిక్స్డ్) వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్న విషయూనికి వస్తే... సాధారణంగా వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు (అంటే ఇప్పుడున్న పరిస్థితిలాగానే ) ఫ్లోటింగ్, అదే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరాయునుకున్నప్పుడు ఫిక్స్డ్ రేటుకు వెళ్లాలి. ఉదాహరణకు 1983-84 సవుయుంలో చాలా బ్యాంకులు 7.5 శాతానికే హోమ్లోన్స్ అందించాయి. అప్పుడు చాలావుంది ఫిక్స్డ్ విధానం ఎంచుకున్నారు. ఆ తర్వాత వడ్డీరేట్లు గణనీయుంగా పెరిగినా ఈఎంఐ భారం పెరగకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంళ్ళకు బ్యాంకులు ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయూ అని బ్యాంకు అధికారులను సంప్రదించండి. ఇవి పరిశీలిస్తాయి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత మంజూరు చేయూలా వద్దా అన్న అంశంపై హోమ్‌లోన్ సంస్థలు అనేక అంశాలను పరిశీలిస్తాయి. ఇందులో రెండు అంశాలు కీలకమైనవి. ఇందులో మొదటిది రుణ చెల్లింపు సావుర్థ్యం, రుణ చరిత్ర వంటివి అయితే రెండోది ఆస్తి పరిశీలన. ఎంచుకున్న ఆస్తి ఎటువంటి వివాదాలు లేకుండా సరిగా ఉందా లేదా, అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయూ లేదా అని పరిశీలిస్తాయి. ఈ రెండు అంశాల్లో బ్యాంకులు సంతృప్తి చెందితే మీకు రుణం మంజూరు అవుతుంది. బీమా తప్పనిసరి.. గృహరుణం తీసుకునే వారు రుణ మొత్తానికి సరిపడా బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చాలా హోమ్‌లోన్ సంస్థలు గ్రూపు ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. బీమా తీసుకుంటే రుణం తీసుకున్న తర్వాత అనుకోని సంఘటన ఏదైనా జరిగినా.. కుటుంబ సభ్యులకు ఈ రుణం భారంగా మారదు. అటువంటి సమయంలో చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీనే చెల్లిస్తుంది. సాధారణంగా ఈ బీమా పాలసీలకు ప్రీమియం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియానికి కూడా రుణం లభిస్తుంది. - ఆర్. నంబిరాజన్ ఎండీ, డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్