breaking news
Housing construction company
-
నిధుల సమీకరణకు హౌసింగ్ బోర్డు భూముల వేలం
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విక్రయం ద్వారా సేకరించిన నిధులను ఓఆర్ఆర్ పరిసరాలు, జిల్లాల్లో ఇళ్లను నిర్మించి సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడానికి వినియోగించనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ కమిషనర్ గౌతమ్ వెల్లడించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీన వీటి వేలానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ వేలానికి ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు.రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్లలో ఫ్లాట్లతోపాటు, ఓపెన్ ప్లాట్లను, ఖాళీ స్థలాలను బహిరంగ వేలంలో విక్రయించనున్నట్లు చెప్పారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న టవర్లలో ఒక్కోదాంట్లో దాదాపు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లను ఏక మొత్తంగా విక్రయించనున్నట్లు వివరించారు. బిల్డర్లు, ఒక గ్రూపుగా ఏర్పడి కొనుగోలు చేయాలనుకునేవారు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు అవసరం ఉన్న సంస్థలు వీటిని కొనుగోలు చేసే వీలు కల్పిçస్తున్నట్లు చెప్పారు. వేలం వేయనున్నవి ఇవే..రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్‌గూడలో 20, చందానగర్‌లో 3, బహదూర్‌పల్లిలో 69 ఓపెన్ ప్లాట్లు, బండ్లగూడలో పూర్తయిన 159 ఫ్లాట్లు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలోని ఐదు టవర్లలో పూర్తికాని కట్ట డాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ స్థాయిలోని ఫ్లాట్లు వేలం వేయను న్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పోతుల మడుగులో 111, అమిస్తాపూర్‌లో 45 ఓపెన్ ప్లాట్లు, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతోపాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా విక్రయించనున్నారు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో 7.33 ఎకరాలు..కూకట్‌పల్లిలోని హౌసింగ్‌బోర్డు 4వ ఫేజ్‌లో ఖాళీగా ఉన్న 7.33 ఎకరాలు, అదే కాలనీలో ఉన్న మరో రెండు ప్లాట్లను (4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు) కూడా ఈ వేలంలో విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డినగర్‌లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌కు చెందిన 2,605 చదరపు గజాలను విక్రయిస్తామన్నారు. సంజీవరెడ్డినగర్‌లోని కమ్యూనిటీ హాల్ (సెల్లార్, స్టిల్ట్, జి+1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణం, 37,030 అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉన్నదని, దీనిని ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసమే వేలం వేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. -
ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములపై సర్వే!
టీఎస్ అవసరానికి వినియోగించకుంటే వెనక్కి హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, గృహనిర్మాణ సంస్థలను ఆదేశించిన ప్రభుత్వం ఈ సంస్థలతోపాటు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనూ సర్వే హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను నిర్ణీత వ్యవధిలో సద్వినియోగం చేసుకోని పక్షంలో వాటిని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. తెలంగాణలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వివిధ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటకాభివృద్ధి, గృహ నిర్మాణ సంస్థల కార్యక్రమాల కోసం కేటాయించారుు. కాగా, ఇలా కేటారుుంచిన భూవుుల్లో నిరుపయోగంగా ఉన్న స్థలాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, పరిశ్రమల మౌలిక సదుపాయల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, పర్యాటక శాఖల ద్వారా ఇచ్చిన భూములపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు తెలంగాణలో నేరుగానే 16వేల ఎకరాలకుపైగా భూమిని వివిధ సంస్థలకు కేటాయించినట్లు సమాచారం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కేటాయించిన ఆ భూవుులను నిజంగానే నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా? లేక ఏదైనా ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారా? వృథాగా ఉ న్నాయా? అన్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలనుంచి పూర్తి సవూచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఎపీ ఎన్జీవోలు, ఎపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కేటారుుంచిన స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ తాజాగా ఇలాంటి భూములపై సర్వే చేపట్టింది. నిర్దేశిత లక్ష్యం మేరకు భూవుులను వినియోగించని వారికి నోటీసులు జారీ చేస్తూ.. ఆ భూములను స్వాధీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇదే విధానాన్ని హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ, పర్యాటక శాఖలు కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అందులో దాదాపు 90 శాతం మేరకు సంబంధిత సంస్థలు కనీసం పనులు కూడా మొదలుపెట్టలేదని అందువల్ల అలాంటి సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవాలని రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. తవు సర్వేలో నిరుపయోగంగా ఉన్నట్టు తేలిన భూముల వివరాలను సంబంధిత శాఖలకు కూడా పంపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇలాంటి భూవుులను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
‘బాబు’ రాగానే జాబు పోయింది
ఒంగోలు అర్బన్ : జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారని, కానీ, బాబు రాగానే జాబు పోయిందని గృహ నిర్మాణ సంస్థ (హౌసింగ్) ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.మస్తాన్‌రావుమాట్లాడుతూ హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు గృహాలు నిర్మించడంలో హౌసింగ్ శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అడకా స్వాములు, జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, నగర ప్రెసిడెంట్ తాడి శ్రీనివాసులు, యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీబీ బ్రహ్మచారి, కార్యదర్శి జీవీ రాగయ్య, యూనియన్ జిల్లా కోశాధికారి ఆర్.ఉదయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ మురళీమోహన్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.