breaking news
hospital icu
-
ఐసీయూలో రోగిపై అత్యాచారం
జైపూర్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి ఆలనాపాలనా చూడాల్సిన నర్సింగ్ అసిస్టెంట్ అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. అఘాయిత్యం వేళ ప్రతిఘటించిన ఆమెకు నిందితుడు మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడం దారుణం. అల్వార్ జిల్లాలోని శివాజీ పార్క్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల వివాహిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో తీవ్ర అస్వస్థతకు గురై జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూ గదిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడే పనిచేసే చిరాగ్ యాదవ్ అనే నర్సింగ్ అసిస్టెంట్ ఆమెను రేప్‌చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన ఆమెకు ఒక మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి ఘోరానికి పాల్పడ్డాడు. తర్వాత కొంతసమయానికి భర్త ఫోన్ చేయగా ఆమె జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఐసీయూలో పేషెంట్లను వదిలేసి.. డాన్సులు!
ఐసీయూలో ఎవరినైనా చేర్చారంటే.. వాళ్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అర్థం. అలాంటిచోట్ల రోగులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాంటిది, అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రోగులను గాలికి వదిలేసి నర్సులు, ఇతర సిబ్బంది గార్బా డాన్సులు వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. అహ్మదాబాద్‌లోని సోలా సివిల్ ఆస్పత్రిలో సిబ్బంది పెద్ద సౌండుతో మ్యూజిక్ పెట్టుకుని మరీ డాన్సులు చేశారు. గుజరాత్ వైద్యవిద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్ ఆ ఆస్పత్రిలో కొత్త డయాలసిస్ సెంటర్ ప్రారంభించి వెళ్లిన కొద్దిసేపటికే ఇదంతా జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగానే పెద్ద సౌండుతో పాటలు పెట్టుకుని డాన్సులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐసీయూలో, అది కూడా పేషెంట్లను గాలికి వదిలేసి ఇలా డాన్సులు చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, అసలు డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తాము ఎలాంటి గార్బా డాన్సు ముందుగా ప్లాన్ చేయలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హెచ్‌కే భవ్సర్ తెలిపారు. కొందరు నర్సులు, బోయ్‌లు, పేషెంట్లు కలిసి ఆ కార్యక్రమం అయిపోయాక డాన్సులు చేశారని, తమకు విషయం తెలియగానే దాన్ని ఆపించామని ఆయన చెప్పారు. ఇలా జరిగి ఉండకూడదని, బాధ్యులందరికీ నోటీసులు ఇస్తున్నామని అన్నారు.