breaking news
Horse Riding Training Institute
-
అప్పుడు వద్దు.. ఇప్పుడు ముద్దు!
విశాఖపట్నం: తాము చేసిందే సంసారం.. అన్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పార్టీ స్థానిక నేతల ద్వంద్వ వైఖరి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.6 కోట్లతో ప్రతిపాదించి, నిర్మాణం ప్రారంభించిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంపై అప్పట్లో నానా యాగీ చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు దాన్ని మించిన గొప్ప ప్రాజెక్టు లేదంటూ కితాబులిస్తున్నారు. నిలిచిన పనులను సత్వరమే పూర్తిచేసి, ప్రారంభిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్దనున్న రోజ్ పార్కులో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి మేయర్ గొలగాని హరివెంకట కుమారి చర్యలు తీసుకున్నారు. పేదలకు ఉపయోగపడని, కేవలం ధనికుల కోసమే దీన్ని నిర్మిస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అడ్డగోలుగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాక ఆ పనుల్ని అర్ధంతరంగా నిలిపేశారు. ఇప్పుడు మాత్రం దాన్ని చాలా గొప్ప ప్రాజెక్టుగా కీర్తిస్తూ, అదే కేంద్రాన్ని కొనసాగిస్తామని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, మేయర్ పీలా కలసికట్టుగా చెప్పడం గమనార్హం. శిక్షణ పార్క్ మంచిదే.. కానీ..! బుధవారం ఇక్కడి నిర్మాణాల పరిశీలనకు వచ్చిన ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం ఏర్పాటు మంచిదేనని, అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానం సరికాదని సెలవిచ్చారు. మేయర్ పీలా శ్రీనివాస్ అయితే మరో అడుగు ముందుకేసి మరీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దీని ఏర్పాటును తానే వ్యతిరేకించానని, అయితే అప్పట్లో దీని గురించి జీవీఎంసీలో ‘సరిగా’తనకు ఎవరూ వివరించలేదని, అందుకో అడ్డుకున్నామని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నేతల తీరును స్థానికులు ఆక్షేపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమం అన్న ప్రాజెక్టు.. ఇప్పుడు సక్రమం ఎలా అయిందంటూ.. ప్రశ్నిస్తున్నారు. వీళ్లది అధికారంలో లేకపోతే ఓ మాట, ఉంటే మరో మాట అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..! జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రోజ్ పార్కులో అర్ధంతరంగా నిలిచిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంను ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు బుధవారం సందర్శించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన గుర్రాల శిక్షణ పార్కు అవసరమేనన్నారు. ఇక్కడ గుర్రాల శిక్షణ కేంద్రం పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లతో దీని ఏర్పాటుకు సంకలి్పంచిందన్నారు. నెలకు రూ.3 వేలు తక్కువ అద్దెకు నిర్వాహకుడికి ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దాన్ని ఎక్కువ అద్దె వచ్చేలా తాము ప్రయతి్నస్తామన్నారు. -
Horse Riding.. సాహసపు.. సవారీ..!
గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్ కాలనీలో నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్ హార్స్ రైడింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు.సహసక్రీడతో జర జాగ్రత్త..గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి. పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్చౌదరీ, హార్స్ రైడింగ్ శిక్షకుడుమానసిక రుగ్మతలకు..చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్ రైడింగ్ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్.అపర్ణఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది? -
ధైర్యాన్ని పెంపొందించుకోవాలి
మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మొయినాబాద్ రూరల్: విద్యార్థులు బా ల్యం నుంచే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు పేర్కొన్నారు. మండలంలోని అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్న హార్స్ రైడింగ్ శిక్షణ సంస్థలో శనివారం అండర్-25, అండర్-16 విభాగాల్లో పో టీలు నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. హార్స్‌రైడింగ్‌తో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని హార్స్ రైడింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అబ్బాస్, మిక్కెల్‌లు మొదటి స్థానంలో, ప్రవీణ్, అలెన్, రాజు, అంగన్, గోపన్నలు రెండో స్థానంలో, విశాల్రావు తృతీయ స్థానంలో నిలి చారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అంనంతరం కార్యక్రమంలో సినీనటుడు నాగార్జున కుమారుడు అఖిల్, హార్స్ రైడింగ్ సంస్థ నిర్వాహకులు చేతన్‌బాబు, అజీజ్‌నగర్ సర్పంచ్ మంగ రాములు, నాయకులు మల్లారెడ్డి, ఖాసీంఖాన్, రిటెర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్‌యాదవ్ తదితరులున్నారు.


