Horse Riding.. సాహసపు.. సవారీ..! | Horse Riding Has Become A Trend In Hyderabad City, Check Out The More Details Inside | Sakshi
Sakshi News home page

Horse Riding.. సాహసపు.. సవారీ..!

Published Wed, Sep 25 2024 8:36 AM | Last Updated on Wed, Sep 25 2024 9:40 AM

Horse Riding Has Become A Trend In Hyderabad City

యువత, చిన్నారుల ఆసక్తి

మానసిక రుగ్మతలకు సంజీవని

హార్స్‌ రైడింగ్‌ సెంటర్లకు డిమాండ్‌

సాహసపు క్రీడపై నగర యువత క్రేజ్‌

గుర్రపు సవారీ అనేదీ ఆటవిడుపు, సాహస క్రీడ, ప్రస్తుతం నగరంలో ఇదే ట్రెండ్‌గా మారుతోంది. యువతతో పాటు చిన్నపిల్లలు సైతం గుర్రపు సవారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై సవారీ చేస్తుంటే చూసి ముచ్చటపడుతుంటారు. యువతకు, వారి తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్‌ రైడింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ఈ కోవలోనే నాగోలు డివిజన్‌ పరిధి రాక్‌టౌన్‌ కాలనీలో నవీన్‌ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌ గత కొన్నేళ్లుగా గుర్రపు స్వారీలో అనేక మందికి శిక్షణ ఇస్తూ మన్ననలను పొందుతోంది. – మన్సూరాబాద్‌

మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి సాహసపు సవారీ సంజీవనిలా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన చిన్నారులకు మంచి ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, అశ్వాన్ని  దూకించడం ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యలతో మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయి. అనేక మంది విదేశీయులు కూడ నవీన్‌ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

సహసక్రీడతో జర జాగ్రత్త..
గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు కూడా ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రమాదాలు సంభవించినా కూడా రైడర్‌కు ప్రమాదం జరగకుండా శిక్షకులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుక నేలల్లో శిక్షణ ఇస్తుంటారు.

ఎంపిక చేసిన గుర్రాలతో శిక్షణ..
మా శిక్షణా కేంద్రంలో మొత్తం 13 గుర్రాలున్నాయి.  పదేళ్ల పాటు సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న గుర్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా చికిత్స కోసం వచ్చే పిల్లల సేవలకు వినియోగిస్తాము. చిన్నపిల్లలతో మంచిగా మసలేందుకు, రౌతు తీరుని గమనించేందుకు గుర్రాలకు ముందే శిక్షణ ఇస్తాము. పిల్లల వైకల్యానికి అనుగుణంగా ఏ గుర్రంతో స్వారీ చేయాలనేది నిర్ణయించి శిక్షణ ప్రారంభిస్తాము. ప్రతి నెలా రాజస్థాన్‌ నుంచి వచ్చిన నిపుణులతో గుర్రాలకు నాడలను వేయిస్తాం. – నవీన్‌చౌదరీ, హార్స్‌ రైడింగ్‌ శిక్షకుడు

మానసిక రుగ్మతలకు..
చిన్నారుల్లో వివిధ మానసిక రుగ్మతలను నయం చేసేందుకు వివిధ వైద్య విధానాల్లో లొంగని వాటికి అరుదైన చికిత్సా విధానం హార్స్‌ రైడింగ్‌ అని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. మా పాపను గత కొన్ని నెలలుగా గుర్రపుస్వారీకి తీసుకొస్తున్నాను. గతంలో కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. తనంతట తానుగా పనులు చేసుకుంటుంది. మెదడు, శారీరక ప్రక్రియ మెరుగ్గా అనిపిస్తుంది. మానసికంగా దృఢంగా తయారవుతుంది. – ఎన్‌.అపర్ణ

ఇవి చదవండి: నూనెల ధర ఎందుకు పెరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement