breaking news
Hong Kong Cricket Sixes 2024
-
మళ్లీ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. నవంబర్ 7 నుంచి 9 వరకు జరిగే హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అశ్విన్ టీమిండియా తరఫున బరిలోకి దిగనున్న విషయాన్ని క్రికెట్ హాంగ్‌కాంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నీలో అశ్విన్‌తో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు పాల్గొంటారు.ఏడేళ్ల తర్వాత పునఃప్రారంభంహాంగ్కాంగ్ సిక్సస్ టోర్నీ ఏడేళ్ల విరామం తర్వాత కిందటి ఏడాదే (2024) పునఃప్రారంభమైంది. ఈ ఎడిషన్‌ను మరింత రంజుగా మార్చే ఉద్దేశంతో నిర్వహకులు అశ్విన్ లాంటి స్టార్లను ఆహ్వానించారు. గతేడాది అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత, ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అశ్విన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్ల లీగ్‌ల్లో పాల్గొంటానని ప్రకటించాడు. హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీతో అశ్విన్ కొత్త ప్రయాణం మొదలవుతుంది.నిబంధనలు ఎలా ఉంటాయంటే..?హాంగ్‌కాంగ్ సిక్సస్లో ప్రతి జట్టులో ఆరు మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ప్రతి ఆటగాడు ఒక్కో ఓవర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటర్లు 50 పరుగుల తర్వాత రిటైర్ అయ్యేలా ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఈ టోర్నీకి గతంలో (టీ20లకు ముందు) చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే టీ20ల రాకతో ఈ ఫార్మాట్ మరుగున పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే, అశ్విన్ గతేడాది చివర్లో (డిసెంబర్ 18, 2024) అంతర్జాతీయ క్రికెట్‌కు.. ఈ ఏడాది అగస్ట్ 27న ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్‌తో సంబంధాలన్నీ తెగిపోయాయి. ఇకపై అతను ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాంటి టోర్నీలో అయినా పాల్గొనవచ్చు. ఈ విషయంలో అతనికి బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. భారత క్రికెట్ సహా ఐపీఎల్‌తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న ఏ భారత క్రికెట్ అయినా ప్రపంచంలో తనకు ఇష్టమైన చోట క్రికెట్ ఆడుకోవచ్చు. -
హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ విజేత శ్రీలంక
హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఇవాళ (నవంబర్ 3) జరిగిన ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5.2 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది (6 వికెట్లు). పాక్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ అఖ్లక్ (20 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ ఫహీమ్ అష్రాఫ్ 13, ఆసిఫ్ అలీ 0, హుసేన్ తలాత్ 1, ఆమెర్ యామిన్ 6, షహాబ్ ఖాన్ 1 పరుగు చేశారు. లంక బౌలర్లలో ధనంజయ లక్షన్, థరిందు రత్నాయకే తలో రెండు వికెట్లు.. నిమేశ్ విముక్తి, లిహీరు మధుషంక చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 73 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సందున్ వీరక్కొడి 13 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేయగా.. లిహీరు మధుషంక 5 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ఆఖర్లో థరిందు రత్నాయకే 4 బంతుల్లో బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ లక్షన్ 2, లహీరు సమరకూన్ ఒక్క పరుగు చేశారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్, హుసేన్ తలత్ తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంకకు ఇది రెండో హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ టైటిల్. -
టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
హాంకాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఓటమి చవిచూసిన భారత జట్టు.. తాజాగా యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. భారత స్టార్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విరోచిత పోరాటం చేసినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. చివరి బంతికి బిన్నీ అనుహ్యంగా రనౌట్ కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో 131 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 129 పరుగుల వద్ద అగిపోయింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ(11 బంతుల్లో 44, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో పాటు కెప్టెన్ రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.యూఏఈ ఇన్నింగ్స్‌లో ఖలీద్ షా(42), జహూర్ ఖాన్(37)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. భరత్ చిప్లి, షెహ్బాజ్ నదీమ్‌కు చెరో వికెట్ దక్కింది. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో కేవలం ఆరుగురు ప్లేయర్లే మాత్రమే ఉంటారు. India needed 32 in 6 balls:Stuart Binny - 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024 -
Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.కాగా 1992లో మొదటిసారిగా హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీ నిర్వహించగా.. 2017 వరకు కొనసాగింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల 2023 వరకు బ్రేక్ పడగా.. ఈ ఏడాది తిరిగి మళ్లీ మొదలైంది. ఇండియా, సౌతాఫ్రికా, ఆతిథ్య హాంగ్‌కాంగ్, న్యూజిలాండ్, నేపాల్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ తదితర 12 జట్లు ఈసారి పోటీలో దిగాయి.భారత బ్యాటర్ల విధ్వంసంఈ క్రమంలో శుక్రవారం టోర్నీ ఆరంభం కాగా.. ఇండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. రాబిన్ ఊతప్ప కెప్టెన్సీలోని భారత జట్టు.. నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ ఊతప్పతో పాటు.. భరత్ చిప్లీ రాణించాడు. ఊతప్ప ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేయగా.. భరత్ చిప్లీ 16 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నందున నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.తప్పని ఓటమిఅయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని పాకిస్తాన్ సులువుగానే ఛేదించింది. ఆసిఫ్ అలీ 14 బంతుల్లో 55 పరుగులు చేయగా.. మహ్మద్ అఖ్లాక్ 12 బంతుల్లోనే 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరికి తోడుగా కెప్టెన్ ఫహిమ్ ఆష్రఫ్ 5 బంతుల్లోనే 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎక్స్ట్రా రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత జట్టుపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.భారత్: రాబిన్ ఊతప్ప (కెప్టెన్), కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, స్టువర్ట్ బిన్నీ, శ్రీవత్స్ గోస్వామి, భరత్ చిప్లీ, షాబాజ్ నదీమ్.పాకిస్తాన్:ఫహీమ్ అష్రఫ్ (కెప్టెన్), మహ్మద్ అఖ్లాక్, ఆసిఫ్ అలీ, డానిష్ అజీజ్, హుస్సేన్ తలాత్, అమీర్ యామిన్, షహబ్ ఖాన్.స్కోర్లు: భారత్- 119/2పాకిస్తాన్- 121/0ఫలితం: భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో పాక్ విజయం Bharat Chipli chipped in with a cracking 53 off 16 before he had to retire out according to the #HongKongSixes rules. 💪#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/IlePJhuPbP— FanCode (@FanCode) November 1, 2024Simply Sublime by Robin Uthappa 🤌Captain Robin got Team India off to a flying start, scoring 31 off 8 balls!#HongKongSixesonFanCode #ItsRainingSixes pic.twitter.com/BZVA5KUuP5— FanCode (@FanCode) November 1, 2024


