breaking news
holograms
-
ఇక సర్టిఫికెట్లపై హోలోగ్రామ్
న్యూఢిల్లీ: విద్యార్థుల సర్టిఫికెట్లపై హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్లు ముద్రించేందుకు యోచిస్తున్నామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో పారదర్శకతకు, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సర్టిఫికెట్లపై విద్యార్థుల ఫొటో, విద్యాసంస్థ హోలోగ్రామ్, మార్కుల జాబితాపై క్యూఆర్ కోడ్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని వైస్ చాన్స్లర్లకు రాసిన లేఖలో యూజీసీ సెక్రటరీ రజనీశ్జైన్ అన్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో పారదర్శకత ఉంటుందని, వారికి సంబంధించిన వివరాల సేకరణ మరింత సరళంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఓటర్ కార్డులివ్వకుంటే మీసేవ లెసైన్స్లు సస్పెండ్’
సాక్షి, హైదరాబాద్: హోలోగ్రాములు లేవంటూ ఓటర్ కార్డులు ఇవ్వని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల లెసైన్స్లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ హెచ్చరించారు. కోటిన్నర హోలోగ్రాములు నిల్వ ఉన్నాయని, వాటిని తెప్పించుకుని ఓటర్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కేంద్రాలపైనే ఉందని ఆయన తెలిపారు. ఓటరు కార్డులు నిరాకరించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.