breaking news
hire more
-
భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త
సాక్షి, బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్ భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త అందించింది. సంవత్సరం భారతదేశంలో ఎక్కువ మందిని టెకీలను నియమించుకోనున్నట్టువెల్లడించింది. ఎందుకంటే విద్యార్థులు డిజిటల్ నైపుణ్యాలలో మెరికల్లా యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ఎక్కువ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2020లో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ల నియామకంలో 30 శాతం పెంచాలని నిర్ణయించాలని తెలిపింది. 2019 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 10-12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన కాగ్నిజెంట్ భారతదేశంలో నియామకాలను పెంచడం విశేషం. భారతదేశంలోని ప్రధాన ఇంజనీరంగ్ కాలేజీలనుంచి 20వేల మందికి పైగా అభ్యర్థులను నియమించుకోవాలని యోచిస్తున్నామని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. అంతేకాదు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జీతాలను 18శాతం పెంచి, రూ. 4 లక్షలను ఆఫర్ చేయనుంది. దాదాపు 100 ప్రీమియర్ ఇంజనీరింగ్ క్యాంపస్‌ల నుంచి తమ సంస్థలో చేరుతున్న వారి శాతం 80 శాతానికి పైమాటేనని, కాగ్నిజెంట్ పై పెరిగిన విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని హంఫ్రీస్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తరువాత భారతదేశంలో 2 లక్షల మంది ఉద్యోగులతో రెండవ ఐటీ కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. మొత్తం 4.4 లక్షల మంది ఉద్యోగులతో భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ ఉన్నసంగతి తెలిసిందే. -
చల్లటి మాట చెప్పిన టీసీఎస్
ముంబై: ఐటి కంపెనీల భారీ ఉద్యోగాలకోతతో ఆందోళనలో ఉన్న టెకీలకు ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) శుభవార్త అందించింది. ఒకవైపు దిగ్గజ టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంటే టీసీఎస్ సమీప భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా మరింతమంది ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామంటూ తీపికబురు అందించింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కొత్త బీపీవో కేంద్రాన్ని గురువారం లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల కోతపై ప్రశ్నించినపుడు ఖచ్చితంగా అలాంటి ప్రణాలికలేవీ లేవని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా మరింత మందిని టెక్ నిపుణులు నియమించుకోనున్నట్టు తెలిపారు. టిసిఎస్ అధికార ప్రతినిధి ప్రదీప్ బాజీ మాట్లాడుతూ డిటిటల్ ఇండియా ఇనీషియేషన్ తో భవిష్యత్తులో దేశీయ ఐటి రంగంలో మరింత ప్రకాశవంతంగా ఉండనుందన్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ కావడానికి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశీయ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉద్యోగులను తగ్గించుకుంటోంటే టీసీఎస్ ప్రకటన ఆహ్వానించతగినదని మార్కెట్నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా టిసిఎస్ 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ పొందిన కన్సల్టెంట్లు 387,000 మంది ఉన్నారు. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 17.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది.