breaking news
Himachal Pradesh government
-
హిమాచల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్
Himachal Pradesh Crisis Live Updates రాజీనామా వెనక్కి తీసుకున్న విక్రమాదిత్య హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. విక్రమాదిత్య తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు: విక్రమాదిత్య పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది: విక్రమాదిత్య పార్టీ విస్తృత ప్రయోజనాలు, పార్టీ ఐక్యత దృష్ట్యా ఉదయం నేను ఇచ్చిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు : విక్రమాదిత్య ఈ తరుణంలో మరింత ఒత్తిడి తీసుకురావాలని నేను కూడా అనుకోవడం లేదు : విక్రమాదిత్య ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు: విక్రమాదిత్య హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్తనయుడే విక్రమాదిత్య తన తండ్రికి కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వలేదని విక్రమాదిత్య ఆరోపణ ఢిల్లీ చర్చలతో.. సాయంత్రానికి చల్లబడ్డ విక్రమాదిత్య #WATCH | Shimla, Himachal Pradesh: Congress MP Rajeev Shukla says, "Our party observers who have come to Shimla are talking to the party MLAs and taking their opinion. First, they met the PCC Chief and also met Vikramaditya Singh. CM Sukhvinder Singh Sukhu has said that he is not… pic.twitter.com/8zIbqWq0vc — ANI (@ANI) February 28, 2024 ఆపరేషన్ లోటస్ జరగనివ్వం: జైరాం రమేశ్ హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఏఐసీసీ సమీక్ష ముగ్గురు పరిశీలకులు సిమ్లాకు పరిశీలకులుగా.. డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ బఘేల్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ వెనకాడదన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రజాతీర్పునకు ద్రోహం జరగనివ్వం: జైరామ్ రమేష్ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీయే ముఖ్యం: జైరామ్ రమేష్ ఆపరేషన్ లోటస్‌తో ప్రజా తీర్పుకు భంగం వాటిల్లనివ్వం: జైరామ్ రమేష్ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: జైరామ్ రమేష్ బీజేపీదే అధికారం: హర్ష్ మహాజన్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ థ్రిల్లింగ్ విక్టరీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల ఓట్లతో 34 ఓట్లు సంపాదించుకున్న హర్ష కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి సైతం 34 ఓట్లు డ్రా కావడంతో టాస్‌లో హర్ష్ మహాజన్ విజయం హర్ష్ మహాజన్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణిస్తున్న రాజకీయ విశ్లేషకులు త్వరలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హర్ష్ ధీమా కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను దింపేసి.. ఒక్కో రాష్ట్రంలో పడగొడుతున్నామన్న హర్ష్ హిమాచల్‌లో.. బీజేపీతో మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్య మరికొన్ని గంటల్లో పరిణామాలు మారిపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు మరో 10-20 ఏళ్లపాటు హిమాచల్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోదంటూ జోస్యం బీజేపీపై ప్రియాంక ఫైర్ హిమాచల్ ప్రదేశ్ పరిణామాలపై ప్రియాంక వాద్రా గాంధీ మండిపాటు ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కుతోందంటూ బీజేపీపై ఫైర్ రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు యత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆరోపణ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, అధికార దుర్వినియోగంతో వారి తీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ యత్నిస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనేందుకు ఇదే నిదర్శనం. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం. హిమాచల్ ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ చర్యలను గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోని కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోంది హిమాచల్ సంక్షోభం.. ఏఐసీసీ ఫోకస్ హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ప్రమాదంలో హిమాచల్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిణామాలపై ఏఐసీపీ ఫోకస్ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భేటీ హిమాచల్‌లో ఏం జరిగింది?.. అలాగే తాజా పరిణామాలపై చర్చ తెరపైకి సీఎంను మారుస్తారనే ప్రచారం రాజీనామా ఊహాగానాలకు కొట్టేసిన సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. ఐదేళ్లు ఉంటుందంటూ వ్యాఖ్య నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం హిమాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభ పరిస్థితుల్ని కాంగ్రెస్ కేంద్రం నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు ముగ్గురు పరిశీలకులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాలతో పాటు స్టేట్ ఇన్‌ఛార్జి రాజీవ్ శుక్లా సిమ్లాకు బయల్దేరినట్లు సమాచారం. నేను ఫైటర్ని: వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్ సీఎం రాజీనామా వదంతుల్ని కొట్టిపారేసిన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు. ‘‘ నేను ఫైటర్‌ను. పోరాడుతూన ఉంటా. ఎవరూ నన్ను రాజీనామా చేయాలని కోరలేదు. నేనెవరికీ రాజీనామా సమర్పించలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరుగుతోంది. కానీ, మా మెజారిటీని మేం నిరూపించుకుంటాం. మేమే గెలుస్తాం. బడ్జెట్ టైంలో ఊహాగానాలతో కాంగ్రెస్‌లో చీలిక తేవాలని బీజేపీ యత్నిస్తోంది. కాంగ్రస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని యత్నిస్తోంది. కానీ, కాంగ్రెస్ సంఘటితంగానే ఉంది అని ప్రకటించారాయన. రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడటంతో రాజీనామా యోచనలో సీఎం సుఖ్విందర్సింగ్ కాంగ్రెస్ హైకమాండ్‌కు నిర్ణయం తెలిపిన సీఎం గవర్నర్‌కు ఇంకా రాజీనామా లేఖ పంపని సుఖ్విందర్ హిమాచల్‌కు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్ డీకే, భూపిందర్ హుడా కాంగ్రెస్‌లో అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హుడాలు హిమాచల్‌కు పయనం సీఎంను మార్చాలని ఇప్పటికే పట్టుబడుతున్న ఎమ్మెల్యేలు ఉదయం నుంచి అజ్ఞాతంలోకి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. హిమాచల్‌లో రాజకీయ సంక్షోభం రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాటరీలో గెలిచిన బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ మరుసటి రోజు బుధవారమే ఆట షురూ చేసిన బీజేపీ అసెంబ్లీలో బడ్జెట్ బిల్లుపై ఓటింగ్‌కు బీజేపీ పట్టు తిరస్కరించిన స్పీకర్, మూజువాణి ఓటుతోనే పాస్ చేస్తామని స్పష్టం సభ రెండుసార్లు వాయిదా పడ్డ శాంతించని బీజేపీ ఎమ్మెల్యేలు 15 మంది బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా వెంటనే గవర్నర్‌ను కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాం ఠాకూర్ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతి ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ అయిన అసెంబ్లీ స్పీకర్ #WATCH | After meeting Governor Shiv Pratap Shukla, Himachal Pradesh LoP Jairam Thakur says, "We have informed the Governor about what happened in the Assembly...In the Assembly, when we demanded division of vote during the financial bill, it was not allowed and the House was… pic.twitter.com/5RymuHzEop — ANI (@ANI) February 28, 2024 మంత్రి రాజీనామా పదవికి రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య సింగ్ ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ లేనందునే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి సీఎంను మార్చాలన్న డిమాండ్‌ను పట్టించుకోనందునే క్రాస్ ఓటింగ చేశామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరి బాటలోనే మంత్రి విక్రమాదిత్య సింగ్ అజ్ఞాతంలోకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసి హర్యానాలోని పంచకులకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇవాళ ఉదయం అజ్ఞాత ప్రదేశానికి తరలింపు రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం సంక్షోభంలో హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి అధిష్టానం ముఖ్య నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుజ్జగింపు ఎమ్మెల్యేల డిమాండ్ మేరకే సీఎంను మారుస్తారని ప్రచారం తెరపైకి పీసీసీ చీఫ్ ప్రతిభాసింగ్ పేరు మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68 కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 40 మంది సభ్యులు, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు. వీరు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. -
వై ప్లస్ సెక్యూర్టీ!
‘‘ప్రస్తుతం ముంబై పరిస్థితి కాశ్మీర్‌ను తలపిస్తోంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆయితే ఆ కామెంట్లు పలువురు మహరాష్ట్ర నేతలకు రుచించలేదు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వం అన్ని సవాళ్లు విసిరారు. లాక్డౌన్లో వచ్చిన బ్రేక్ కారణంగా తన సొంతూరు భంభ్లాలో ఉంటున్నారు కంగనా. హిమాచల్ ప్రదేశ్‌లోని చిన్న పట్టణం ఇది. ‘‘సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నా’’ అని ప్రకటించారు కంగనా. ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా కంగనా సోదరి రంగోలి, ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కోరారట. దాంతో ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పుడే కాదు.. ముంబైలోనూ సెక్యూర్టీ కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమండ్ చేసిన మేరకే కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ సెక్యూర్టీ అందించడానికి సిద్ధమవుతోందని సమాచారం. 9న ముంబై చేరుకున్నప్పటి నుంచి కంగనాకి కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించనుందట. -
డీఎస్పీగా భారత మహిళా వికెట్ కీపర్
సిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళా క్రికెటర్లకు ఊహించని రీతిలో ప్రోత్సాహక బహుమతులు అందుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ మహిళల జట్టులో ఒక్కోక్కరికి రూ.50 లక్షలు అందించగా.. రైల్వే శాఖ తమ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కొంత నగదు బహుమతి కూడా ఇచ్చింది. ఇక వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నజరానలు ప్రకటించాయి. హిమచాల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర భద్ర సింగ్ ఆ రాష్ట్ర లేడీ క్రికెటర్ భారత వికెట్ కీపర్ సుష్మావర్మకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు డీఎస్సీ ఉద్యోగం ఇస్తానని అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఆమెకు రూ.5 లక్షల చెక్కుతో పాటు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. సుష్మాను ప్రశింసిస్తూ ఈ విషయాన్ని సీఎం అధికారిక ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశారు. हिमाचल का नाम अंतर्राष्ट्रीय स्तर पर ऊँचा करने वाली @BCCIWomen की खिलाड़ी @ImSushVerma को 5 लाख की प्रोत्साहन राशि देकर सम्मानित किया है 1/1 pic.twitter.com/IQsTgmCJcw — Virbhadra Singh (@virbhadrasingh) 8 August 2017 2011లో అండర్-19 స్థాయిలో జరిగిన మహిళల క్రికెట్ టోర్నమెంట్లో హిమచల్ ప్రదేశ్ కు సుష్మ కెప్టెన్ గా చేశారు. ఆ టోర్నీలో హిమాచల్ ప్రదేశ్ రన్నరప్ గా నిలిచింది. హిమచల్ ప్రదేశ్ తరపున జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న తొలి క్రికెటర్ సుష్మే కావడం విశేషం. ప్రస్తుతం సుష్మా వర్మ రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో 20 ఫోర్లు 7 సిక్సులతో రెచ్చిపోయిన వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు కూడా డీఎస్సీ ఉద్యోగం లభించింది. మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం కోటి నజరాన 600 గజాల ఇంటి స్థలం ప్రకటించిన విషయం తెలిసిందే. అసంతృప్తి వ్యక్తం చేసి హిమాచల్ షూటర్.. దేశానికి ఒలంపిక్ కాంస్యం అందించిన షూటర్ విజయ్‌కుమార్ తనకు ప్రోత్సాహకం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయ్ కుమార్ పలు ఈవెంట్లలో 150 మెడల్స్ వరకు సాధించాడు. అయినా రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత్-పాక్ మ్యాచ్ మా దగ్గర వద్దు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ మ్యాచ్‌కు తాము ఆతిథ్యమివ్వలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మ్యాచ్‌కు సరైన భద్రతను కల్పించలేమని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్... కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. స్థానికుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను తాము నిర్వహించలేమన్నారు. ‘ధర్మశాలలో మ్యాచ్ వద్దు. ఇటీవల పఠాన్‌కోట్‌లాంటి ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పాక్‌తో మ్యాచ్ ఏర్పాటు చేస్తే స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడి సైనికులు చాలా మంది జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మా యుద్ధ అనుభవజ్ఞులు ధర్మశాలలో ఇండో-పాక్ మ్యాచ్ వద్దనుకుంటున్నారు. వాళ్ల అభిప్రాయాలను హిమాచల్ క్రికెట్ సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. మా వాళ్లు క్రికెట్‌కు వ్యతిరేకం కాదు.. కేవలం పాక్‌తో మ్యాచ్ మాత్రమే వద్దంటున్నారు’ అని సింగ్ పేర్కొన్నారు. ఓవరాల్‌గా రెండు సూపర్-10 మ్యాచ్‌లతో కలిపి ధర్మశాల 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. రాజకీయాలొద్దు: ఠాకూర్ మరోవైపు వీరభద్ర సింగ్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్‌ల విషయంలో రాష్ట్రం రాజకీయాలు చేయకూడదన్నారు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడానికి ఇది సరైన సమయం కాదని సూచించారు. ‘వరల్డ్‌కప్ వేదికలను ఏడాది కిందట నిర్ణయించాం. ఆరు నెలల కిందటే ఆయా వేదికలకు మ్యాచ్‌లను కేటాయించాం. మేం ఆతిథ్యమివ్వలేమని అప్పుడు చెప్పినా బాగుండేది. షెడ్యూల్‌ను చూసి చాలా మంది ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లు, ఇతర సౌకర్యాలు బుక్ చేసుకున్నారు. వాళ్లకు సరైన వసతులు కల్పిస్తామని కూడా చెప్పాం. కానీ చివరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెప్పడం సరికాదు’ అని ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలో పని చేస్తున్న హిమాచల్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దక్షిణాసియా క్రీడల సందర్భంగా వందల మంది పాక్ అథ్లెట్లకు అస్సాం భద్రత కల్పించినప్పుడు... ఇప్పుడు హిమాచల్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. భద్రత కల్పించలేమని చెప్పడం ఇటీవల పాక్ చేస్తున్న ఆరోపణలకు ఊతమివ్వడమేనన్నారు. ఇలా చేయడం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని ధ్వజమెత్తారు. ‘కార్గిల్’ తర్వాత ఫొటోలు దిగలేదా? ధర్మశాలలో పాక్ జట్టు ఆడేందుకు వ్యతిరేకిస్తున్న చాలా మంది స్థానిక నాయకులు (హిమాచల్ ప్రదేశ్)... 2005లో అదే జట్టు ఇక్కడ ఆడినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ఠాకూర్ ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఇదే నాయకులు పాక్ ఆటగాళ్లకు బొకేలు ఇచ్చి.. వాళ్లతో ఫొటోలకు పోజు ఇవ్వలేదా? అని విమర్శించారు. ధర్మశాలలో మ్యాచ్ జరగాలని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని తెలిపారు. కాబట్టి క్రీడల్లో రాజకీయాలను చూడొద్దని, దేశ ప్రతిష్టగా భావించాలని పేర్కొన్నారు.