breaking news
hike pensions
-
అధిక పెన్షన్ కోసం సంస్థలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అధిక పెన్షన్ కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల తరఫున, వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ గడువు సెపె్టంబర్ 30తో ముగియనుండగా, సంస్థల యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు చేసిన వినతి మేరకు ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సెపె్టంబర్ 29 నాటికి 5.52 లక్షల పెన్షన్ దరఖాస్తులు యాజమాన్యాల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో దరఖాస్తులు ఆహా్వనించగా.. జూలై 11 నాటికి మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ కోసం వచి్చనట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి వేతన వివరాలను సంస్థలు అప్లోడ్ చేసి, తమవైపు ఆమోదం తెలియజేస్తే అప్పుడు వాటిని ఈపీఎఫ్‌వో ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది. -
హామీలను తుంగలో తొక్కిన బాబు
-సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మొగళ్లూరు(పొదలకూరు) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐదు సంతకాలు చేసిన హామీలకు సంబంధించి ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా తుంగలో తొక్కారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొగళ్లూరు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో శనివారం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావిజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ, సృజలస్రవంతి, బెల్టుషాపుల నిర్మూలన, పింఛన్ల పెంపు తదితర ప్రధాన హామీలను సైతం ముఖ్యమంత్రి అమలు చేయలేకపోతున్నారన్నారు. పింఛన్ల కోసం వృద్ధులు పడని పాట్లు లేవన్నారు. ఎంతమంది పింఛన్లు ఉంటాయో, ఊడుతాయో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారన్నారు. 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారనే కారణంతో సీఎం ఎమ్మెల్యేలకు కేటాయించే ఏడాదికి రూ.50 లక్షల నిధులను కూడా నిలిపివేశా రన్నారు. గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, మొగళ్లూరు, పులికల్లు ఎంపీటీసీ సభ్యులు కూకట్ల పెంచలలక్ష్మీ, నల్లు పద్మమ్మ, సర్పంచ్‌లు మోడిబోయిన పాపమ్మ, సోమా సుబ్రమణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, నాయకులు యాతం పెంచలరెడ్డి, వై.పెంచలరెడ్డి, చెన్నూరు సుబ్బరాయుడు, పలుకూరు పెంచలనారాయణరెడ్డి, యనమల రమణారెడ్డి, చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, నెట్టెం కృష్ణంనాయుడు పాల్గొన్నారు.