breaking news
Highest-Paid Actress
-
టాప్ పెయిడ్ హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందెవరో తెలిస్తే..షాక్‌వుతారు
Trisha Krishnan సౌత్ ఇండియన్ సినిమాలో హీరోయిన్ల్ హవా కొనసాగుతోంది. ఒకర్ని మించి ఒకరు పలుభాషల హీరోయిన్లు తమ సత్తా చాటుకుంటున్నారు అందం, అభినయంతో స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఏ-లిస్ట్ హీరోలు సినిమా చేయడానికి చాలా ఎక్కువ ఫీజు తీసుకుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడిక సౌత్ టాప్ హీరోయిన్లు ఫీజు చాలా మంది బాలీవుడ్ నటుల ఫీజు కంటే ఎక్కువే అనడంలో ఎలాంటి సందేహంలేదు. తాజాగా ఈ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష కృష్ణన్. ఫిన్‌క్యాష్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, మణిరత్నం చిత్రం 'పొన్నియన్ సెల్వన్' తర్వాత త్రిష స్టార్ వాల్యూ ఒక రేంజ్లో పెరిగిందట. త్రిష తన నెక్ట్స్ మూవీకి రూ. 10 కోట్లు వసూలు చేస్తుందని, తద్వారా సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. త్రిష త్వరలో విజయ్ దళపతితో కలిసి 'లియో' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్నిఅక్టోబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 ఏళ్ల విరామం తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. (15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్) మల్టీ స్టారర్ 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా విడుదలైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న ఈ చిత్రంలో త్రిష ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఈ మూవీల్లోతన అద్భతమైన నటనతో ఆకట్టుకుంది. అంతకుమంచిన అందంతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కాగా టాలీవుడ్ టాప్ స్టార్ సమంత రూత్ ప్రభు 'సిటాడెల్ ఇండియా' కనిపించనుంది. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప లోని ఐటెం సాంగ్ 'ఊ అంటావా' తో సామ్ పాపులారీటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తన ఫీజును పెంచిందని, ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ధృవీకరణ ఏదీ లేదు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) -
అత్యధిక పారితోషికం అందుకునే నటి ఈమెనట..
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణి ఎవరో తెలుసా..? మళ్లీ "హంగర్ గేమ్స్" స్టార్ జెన్నిఫర్ లారెన్సేనట. వరుసగా రెండో ఏడాది కూడా ఈ బ్యూటీనే అత్యధిక పారితోషికం అందుకునే జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించిన 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో, 46 మిలియన్ డాలర్ల(308కోట్లకు పైగా)తో జెన్నిఫర్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. జెన్నిఫర్ తర్వాతి స్థానంలో మెలిస్సా కార్టీ నిలిచినట్టు ఫోర్బ్స్ మంగళవారం వెల్లడించింది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన హంగర్ గేమ్స్ నుంచి వచ్చిన లాభాలతో ఈ నటి మళ్లీ టాప్ నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది. హాలీవుడ్ నటులు అందుకుంటున్న పారితోషికాలు కంటే నటీమణులు అందుకునే పారితోషికాలు ఇంకా తక్కువగానే ఉంటున్నాయని లారెన్స్ మరోసారి స్పష్టంచేసింది. పారితోషికం చెల్లించడంలో లింగవివక్ష చూపుతున్నారని లారెన్స్ చేసిన వ్యాఖ్యలు గతేడాది చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే గతేడాదితో పోలిస్తే జెన్నిఫర్ ఆదాయాలు 2016లో 11.5 శాతం క్షీణించాయి. గతేడాది ఆమె పారితోషికం 52 మిలియన్ డాలర్లు. మొత్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది నటీమణుల సంపద 205 మిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. మూవీస్, టీవీ, కాస్మోటిక్, ఇతర కంపెనీల నుంచి వచ్చే ఎండోర్స్మెంట్స్ ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఈ లిస్టులో న్యూకామర్గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే నిలిచారు. 10 మిలియన్ డాలర్లతో దీపికా టాప్ 10లో చోటుదక్కించుకుంది.