breaking news
high tension electric poles
-
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
నష్టం ఒకరిది... పరిహారం మరొకరికా..?
పరిగిరూరల్ : హైటెన్షన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు వల్ల పాడైన పంటకు పరిహారం ఇవ్వడం లేదంటూ మండల పరిధిలోని మాదారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి నుంచి పరిగి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు హైటెన్షన్ విద్యుత్(టవర్) స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటకు సంబంధిత రైతుల అనుమతులు తీసుకొని పనులు చేస్తున్నారు. రెండు నెలల క్రితం టవర్లు ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు ఏర్పాటు చేశారు. నెలలు దాటుతున్నా టవర్లు బిగించడం లేదంటూ రైతులు పంటలను సాగు చేసుకున్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసిన పొలాల్లో పదిహేను రోజుల క్రితం టవర్లను ఏర్పాటు చేశారు. టవర్లు ఏర్పాటు చేసేందుకు పొలాల్లోకి ట్రాక్టర్ రావడం, తాళ్లతో టవర్ పట్టీలను లాగడం వంటి పనులు పంటచేలలో చేశారు. ఈ పనులు చేస్తున్న సమయంలో ఒక్కో పొలంలో అర ఎకరా, పావు ఎకరా పంట పూర్తిగా నేల మట్టమైంది. దీనికి పరిహారం అందించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే పరిహారం అందించడంలో కూడా మరో చిక్కు సమస్య రైతులను వేధిస్తోంది. చాలా మంది తమ పొలాలను ఇతరులకు కౌలుకు ఇచ్చారు. పట్టాదారుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభం(టవర్) ఏర్పాటుకు, పరిహారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. భూముులను లీజుకు తీసుకుని వేలరూపాయలు వెచ్చించి పంట నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వకపోవడమేమిటని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చిస్తాం టవర్లు వేసే సమయంలో పొలం యజమాలనులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రస్తుతం ఆ పొలంలో వేరొకరు పంటలను సాగు చేస్తున్నారు. పంట నష్టపోయిన కౌలురైతులకే పరిహారం దక్కాలి. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం, కౌలు రైతులు, పొలం యజమానులు కూడా ఇందుకు సహకరించాలి. ఏఈ రాజ్‌కుమార్ పత్తి మొక్కలు నేలపాలు రంగాపూర్ గ్రామానికి చెందిన నర్మమ్మ పొలం కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాను. విద్యుత్తు స్తంభం ఏర్పాటు పనుల్లో భాగంగా పత్తి పొలంలో ట్రాక్టర్ తిప్పి కాయలు పట్టిన మొక్కలను నేలపాలు చేశారు. మాకు పరిహారం అందించాలని సంబంధింత కాంట్రాక్టర్‌తో మాట్లాడగా పొలం సొంతదారుకే పరిహారం అంటున్నారు. పరిహారం మాకే అందించేలా అధికారులు చొరవచూపాలి. కౌలు రైతు బాలయ్య(మాదారం)