breaking news
	
		
	
  High cholesterol
- 
      
                   
                                 2023లో జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?
- 
      
                   
                                 కొలెస్ర్టాల్‌తో మెదడుకు ముప్పులండన్ : అధిక కొవ్వుతో గుండెకు చేటు అని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో తాజాగా హై కొలెస్ర్టాల్‌తో అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉందని, ఇది మెదడుకూ ముప్పు కలిగిస్తుందని ఓ అథ్యయనం స్పష్టం చేసింది. అల్జీమర్స్ జన్యువులు శరీరంలో ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా రక్తంలో చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉండే వారిలో అల్జీమర్స్ ముప్పు త్వరగా చుట్టుముట్టే అవకాశం ఉందని ఎమరీ యూనివర్సిటీ, అట్లాంటా వెటరన్స్ అఫైర్స్ హాస్పిటల్‌తో కలిసి చేపట్టిన అథ్యయనంలో పరిశోధకులు తేల్చారు. జ్ఞాపకశక్తిని కోల్పోయేందుకు దారితీసే అల్జీమర్స్‌కు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడమే మేలని తాజా అథ్యయనం సూచించింది. కాగా ఈ అథ్యయనం కోసం పరిశోధకులు 2215 మంది రక్త నమూనాలనూ, డీఎన్ఏ శాంపిల్స్‌ను పరీక్షించి ఓ అవగాహనకు వచ్చారు. చెడు కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న మహిళలు, పురుషులు వారి రిస్క్ ఫ్యాక్టర్స్‌తో సంబంధం లేకుండా యుక్తవయసులోనే వారికి అల్జీమర్స్ ముంపు పొంచిఉందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయనం పేర్కొంది.
- 
      
                   
                                 అధిక కొవ్వుతో అల్జీమర్స్ ముప్పులండన్ : అధిక కొవ్వుతో పలు రకాల అనారోగ్యాలు దరిచేరతాయని వైద్యులు హెచ్చరిస్తుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో మెదుడులో అల్జీమర్ ప్రొటీన్స్ 20 రెట్లు అధికంగా చేరే ముప్పు పొంచి ఉందని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. హై కొలెస్ర్టాల్ డిమెన్షియాకు దారితీస్తుందని ఈ అథ్యయనం హెచ్చరించింది. అల్జీమర్స్‌కు నూతన చికిత్సా విధానాల రూపకల్పనలో తమ అథ్యయనం తోడ్పడుతుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం పేర్కొంది. మెదుడులో కొవ్వులు పేరుకుపోయే జీన్స్‌ను కొందరు కలిగిఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మెదడు నుంచి కొవ్వు పేరుకుపోవడాన్ని ఎలా నిరోధించాలన్నది ప్రశ్న కాదని, అల్జీమర్స్ వ్యాధిలో కొలెస్ర్టాల్ పాత్రను నియంత్రించడమేనని అథ్యయన రచయిత, కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ వెండ్రుస్కోలో చెప్పారు. కొలెస్ర్టాల్ ఒక్కటే ఈ వ్యాధులను ప్రేరేపించడం లేదని, వ్యాధి కారకాల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అధ్యయన వివరాలు నేచర్ కెమిస్ర్టీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
- 
      
                   
                                 మిల్క్‌షేక్‌తో గుండెకు షాక్లండన్ : మిల్క్ షేక్‌లతో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. స్నేహితులు, బంధువులు ఇచ్చే విందుల్లో మునిగి తేలిన అనంతరం వారిలో గుండె వైఫల్యానికి దారితీసే అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు తాజా అథ్యయనం వెల్లడించింది. పాల ఉత్పత్తులతో రూపొందిన ఈ తరహా ఆహారంతో రక్తంలో కొవ్వు, కొలెస్ర్టాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని తాజా అథ్యయనంలో గుర్తించారు. అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకున్న కొందరు వెంటనే మరణించిన ఉదంతాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తులు ప్రమాదకరమని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాకు చెందిన డాక్టర్ నీల్ వీన్‌ట్రాబ్ చెప్పారు. పెద్దలు తాము తీసుకునే రోజువారీ ఆహారంలో కొవ్వు శాతం 20 నుంచి 35 శాతం మించకుండా చూసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచించింది.
- 
      
                   
                                 పిల్లల్లో అధిక బరువు... సమస్యలు
 ఇటీవల పిల్లలకు శారీరక శ్రమ తగ్గడం, వాళ్లు టీవీ, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వంటి మార్పుల వల్ల అధిక బరువు అనే సమస్య పెరుగుతోంది. పైగా ఇటీవలి జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.
 
 బరువు పెరగడం వల్ల వచ్చే భవిష్యత్తు సమస్యలు : అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న పిల్లలు భవిష్యత్తులోనూ చాలా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని...
 
 అధిక రక్తపోటు 
 అధిక కొలెస్ట్రాల్
 భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్
 కీళ్లనొప్పులు
 కొద్దిపాటి శారీరక శ్రమతోనే
 సమస్యలు కలగడం, సమస్యలు పెరగడం 
 ఊపిరి తీసుకోవడంలో సమస్యలు 
 ఆస్తమా వమంటి ఇబ్బందులు 
 నిద్రలేమి 
 భవిష్యత్తులో సెక్స్ సమస్యలు
 కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమస్యలు
 డిప్రెషన్
 హృదయసంబంధ వ్యాధులు
 అమ్మాయిల విషయంలో రుతుస్రావ సమయంలో ఇబ్బందులు వంటివి చాలా సాధారణం.
 
 పిల్లల్లో అధిక బరువు సమస్యను అధిగమించడం ఎలా : ముందుగా వారికి తగినంత శారీరక శ్రమ కలిగిలా తల్లిదండ్రులు చూడాలి. ఈ శ్రమను పిల్లలు వినోదంగా తీసుకునే చేయాలి. ఉదాహరణకు తల్లిదండ్రులు షాపింగ్‌కు వెళ్లే సమయంలో పిల్లలను ఇంట్లో వదలకుండా తమతో తీసుకుని వెళ్లాలి. ఎక్కువగా నడిచేలా చేయాలి.
 
 పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు నేర్పాలి. పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. వాళ్లు తీసుకునే వాటిల్లో తీపిపదార్థాలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి.
 
 పిల్లలకు క్రమబద్ధమైన వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఆరుబయట ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలి.
 
 స్థూలకాయం, అధికబరువు సమస్యకు కొన్ని మందులు :
 కాల్కేరియా కార్బ్, గ్రాఫైటిస్, యాంటిమోనియమ్ క్రూడ్, ఫైటోలెక్కా బెర్రీ, ఫ్యూకస్ వంటి హోమియో మందులు పిల్లల్లో అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని పిల్లల స్వరూప స్వభావాలను బట్టి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్


