helicpoters
-
ఐఎఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ భోపాల్ సమీపంలో ముందుజాగ్రత్తగా ల్యాండ్ అయ్యింది. ప్రాథమికంగా అందిన వార్తల ప్రకారం హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అందులో ఆరుగురు సైనికులు ఉన్నారని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని పొలంలో దిగాల్సి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆ హెలికాప్టర్ ఆనకట్టపై చాలా సేపు చెక్కర్లు కొట్టింది. అనంతరం కిందకు ల్యాండ్ అయ్యింది. బెరాసియాలోని డూమారియా గ్రామంలోని ఆనకట్ట సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హెలికాప్టర్ ల్యాండ్ అయిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వీడియోలో హెలికాప్టర్ చుట్టూ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. కాగా ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ జవానులు సాంకేతిక నిపుణుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం #WATCH | Madhya Pradesh: An Indian Air Force ALH Dhruv helicopter made a precautionary landing near Bhopal. As per the initial reports, the crew is safe and a team is on the way to look into the technical issues: IAF sources pic.twitter.com/cQRxCrJjzK — ANI (@ANI) October 1, 2023 -
విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..?
విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్ వరుణ్‌సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) ప్రయాణ సమయాల్లో రాడార్ సిగ్నల్స్ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. -
మూడు హెలికాప్టర్లతో ఆపరేషన్ శేషాచలం
-
మూడు హెలికాప్టర్లతో ఆపరేషన్ శేషాచలం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఏడు కొండల్లో ఒకటైన శేషాచలం మీద ఉన్న అడవుల్లో రేగిన కార్చిచ్చును చల్లార్చడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పుతున్నారు. శేషాచలం కార్చిచ్చుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. మంటలు మరింత వ్యాపించకుండా తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అటవీ అధికారులతో ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి సమీక్షించారు. మంటలార్పడానికి కందకాలు తవ్వాలని నిర్ణయించారు. మరోవైపు మూడు హెలికాప్టర్లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కుమారధార, పసుపుధార డ్యాంల నుంచి హెలికాప్టర్ల ద్వారా పెద్ద పెద్ద కంటెయినర్లలో నీళ్లు తీసుకెళ్లి మంటల మీద చల్లుతూ వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీ సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.