విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్‌.. అసలు దానికథేంటి..?

Airplane Black Box: All You Need to Know about Device - Sakshi

విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో చీచీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్‌ రావత్‌తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ క్రమంలో  అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. 

చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) 

నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్‌ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. 

చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు)

ప్రయాణ సమయాల్లో రాడార్‌ సిగ్నల్స్‌ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top