breaking news
heavy storm
-
అల్విదా.. అపార్చునిటీ!
వాషింగ్టన్: అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా ప్రకటించింది. ఇది గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. అపార్చునిటీ ఉన్న పర్సెవరెన్స్ లోయ దక్షిణ భాగంలో ఏడు నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుం దని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ తుపాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారడంతో బ్యాటరీల చార్జింగ్ ఆగిపోయిందని వెల్లడించారు. అయితే క్రమంగా తుపాను ఉధృతి తగ్గిన తరువాత రోవర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మిషన్ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అపార్చునిటీ నుంచి చివరిసారిగా గతేడాది జూన్ 10న భూమికి సంకేతాలు చేరాయి. ఆ తరువాత రోవర్‌కు సుమారు 600 కమాండ్లు పంపామని నాసా తెలిపింది. డీప్ స్పేస్ నెట్వర్క్(డీఎస్ఎన్) రేడియో సైన్స్ సాయంతో వేర్వేరు పౌనఃపున్యాలు, పోలరైజేషన్లలో అపార్చునిటీ గురించి పరిశోధకులు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా రాబోయే వారాల్లో మరిన్ని కమాండ్లు పంపాలని కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ పరిశోధకులు సమాయత్తమవుతున్నారు. అపార్చునిటీతో తిరిగి సంబంధాలు పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాల్ని పరిశీలిస్తామని వారు చెప్పారు. లక్ష్యం 90 రోజులు..కొనసాగింది 5 వేల రోజులు గోల్ఫ్ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరితలంపై కాలుమోపింది. దీనితో పాటు స్పిరిట్ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజులు సేవలందించేలా దీన్ని రూపొందించారు. కానీ గత ఏడాది ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్ మిషన్ 2011లోనే ముగిసింది. అపార్చునిటీకి కాలం చెల్లినా దాని పనితీరు సంతోషకరంగా సాగిందని ఈ ప్రయోగ ప్రధాన అధ్యయనకర్త స్టీవెన్ డబ్ల్యూ స్క్వైర్స్ చెప్పారు. -
కన్యాకుమారి అతలాకుతలం..
-
‘సమాచార’ బంధం తెగింది!
- ఈదురుగాలుల దెబ్బ నుంచి ఇంకా కోలుకోని హైదరాబాద్ - రాజేంద్రనగర్ ప్రాంతంలో మూడో రోజూ వీడని అంధకారం - విద్యుత్ సరఫరా చేసినా.. సర్వీసు వైర్ల పునరుద్ధరణ మరిచారు - నగరవ్యాప్తంగా దెబ్బతిన్న చానెల్ యాంటెన్నా రిసీవర్లు, డిష్‌లు - తెగిపడిన కేబుళ్లతో చాలా చోట్ల టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ బంద్ - చార్జింగ్ లేక మూగబోయిన ఫోన్లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురుగాలులు, జడివాన దెబ్బకు అటు విద్యుత్ వ్యవస్థతో పాటు ఇటు సమాచార వ్యవస్థకూ తీవ్ర అంతరాయం కలిగింది. చార్జింగ్ లేక సెల్ఫోన్లు మూగబోయాయి. పలు చోట్ల సెల్‌ఫోన్ సిగ్నళ్లకూ అంతరాయం కలిగింది. రాజేంద్రనగర్ ప్రాంతంలోనైతే మూడో రోజూ అంధకారమే అలుముకుంది. విద్యుత్ సరఫరా లేక జనం నానా అవస్థలూ పడ్డారు. ఇక గాలుల తీవ్రతకు కేబుల్ ఆపరేటర్లతోపాటు ఇళ్లలోని డీటీహెచ్ యాంటెన్నాలు, కేబుళ్లు దెబ్బతిన్నాయి. దీంతో అంతో ఇంతో విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాల్లోనూ జనం టీవీలను వినియోగించుకోలేకపోయారు. మరోవైపు వివిధ ఇంటర్నెట్ సర్వీసు సంస్థలకు చెందిన తీగలు తెగిపోవడం, బాక్స్‌లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు చోట్ల ఇంటర్నెట్ కూడా నిలిచిపోయింది. సర్వీసు వైర్లు దెబ్బతినడంతోనే.. విద్యుత్ లైన్లను పునరుద్ధరించి సరఫరా చేసినప్పటికీ... స్తంభాల నుంచి ఇళ్లలోకి విద్యుత్ సరఫరా చేసే సర్వీసు వైర్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. దాంతో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకుండా పోయింది. ఫలితంగా రాజేంద్రనగర్, బండ్లగూడ, శాంతినగర్, హైదర్‌గూడ, ఉప్పర్‌పల్లి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, శివరాంపల్లి, హ్యాపీహోమ్స్, గోల్డెన్‌హైట్స్ తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు ఆదివారం రాత్రి కూడా అంధకారంలోనే మగ్గాల్సి వచ్చింది. మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవ డంతో బోర్లు పనిచేయలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికే కాదు, తాగడానికి కూడా మంచినీరు లేక జనం ఇబ్బందులు పడ్డారు. చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. కొత్త వైరు తెచ్చుకుంటే కనెక్షన్ ఇస్తాం ‘‘ఈదురుగాలి వర్షానికి విద్యుత్ తీగలు, స్తంభాలేకాదు వినియోగదారుల సర్వీసు వైర్లు కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి, విద్యుత్ కూడా సరఫరా చేశాం. సర్వీసు వైర్లు దెబ్బతిన్న చోట కొత్తవి తెచ్చుకుంటే వెంటనే కనెక్షన్ ఇచ్చాం. అక్కడక్కడ కొంత మంది ఇంకా తెచ్చుకోలేదు. సర్వీసు వైరు తెచ్చుకుని సమాచారమిస్తే లైన్మెన్ వచ్చి కనెక్షన్ ఇస్తారు..’’ - రఘుమారెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ