breaking news
heat storke
-
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్‌లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్‌కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్‌ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పిల్లల పై వడదెబ్బ ఎలా ప్రభావం చూపిస్తుందంటే..
-
ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగ కార్యక్రమాలు..
మహారాష్ట్రలోని అవార్డుల కార్యక్రమంలో వడదెబ్బతో సుమారు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన చర్చనీయాంశంగా మారడమే గాక సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి కూడా. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించకూడదని నిషేధించింది. వాస్తవానికి నాడు బహిరంగ మైదానంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూషణ్ అవార్డుల కార్యక్రమానికి లక్షలాదిమంది హాజరయ్యారు. ఆ సమావేశం మండే ఎండలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు ఆ సమావేశం జరిగనప్పుడూ గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ కార్యక్రమానిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే రూ. 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక పై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. షిండే ప్రభుత్వంపై నరహత్య కేసు నమోదు చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇది ప్రకృతి వైపరిత్యం కాదని, మానవ నిర్మిత విపత్తు అని విమర్శులు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని పవార్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు అధిక పరిహారం ఇవ్వాలని కూడా పవార్ డిమాండ్ చేశారు. (చదవండి: దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?) -
టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు
సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయనను రమేష్ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు సమాచారం. నిన్న కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు) -
క్యాబ్ సర్వీసులకు విశ్రాంతినిస్తున్నాం!
కోల్ కతా: మండే ఎండలతో ట్యాక్సీ సర్వీసులకు విశ్రాంతి ఇస్తున్నట్లు బెంగాల్ ట్యాక్సీ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. ఉదయం 11గం.ల నుంచి సాయంత్రం 4.గం.ల వరకూ ట్యాక్సీ సర్వీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ నడపలేమని స్పష్టం చేసింది. భానుడి ఉగ్రరూపంతో ఇప్పటికే ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మృత్యువాత పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి ట్యాక్సీ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. ' ఎండ వేడిమి ఎక్కువగా ఉండే సమయంలో మేము ఏ క్యాబ్ ను కూడా రోడ్డుపై తిప్పలేం. ఒకవేళ ఎవరైనా తిప్పడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటాం. ఈ విషయాన్ని పోలీసులు, ప్రయాణికులు అర్ధం చేసుకోవాలి. సర్వీసులను నిలుపదల చేసే క్రమంలో పోలీసులు మాపై ఎటువంటి జరిమానా విధించొద్దు' అని ట్యాక్సీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీమల్ గుహ విజ్ఞప్తి చేశాడు. శుక్రవారం ఎండ తాపానికి తాళలేక నగరంలోని ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, ఈ రోజు జాదవ్ పూర్ ప్రాంతంలో శత్రుఘాన్ పొడ్డార్ అనే ట్యాక్సీ డ్రైవర్ సృహ తప్పిపడిపోయిన అనంతరం ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


