breaking news
Harris polls
-
ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త ఇంధన వాహనాలపై (ఎన్ఈవీ) క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. 2030 నాటికి వాటికి గణనీయంగా ఆమోదయోగ్యత పెరగనుందని ఒక సర్వే నివేదికలో వెల్లడైంది. అర్బన్ సైన్స్ సంస్థ తరఫున ది హ్యారిస్ పోల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం అప్పటికి, పెట్రోల్/డీజిల్ వాహనాల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై 49 శాతం వరకు అధికంగా చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని తేలింది. సర్వేలో పాల్గొన్న 1,000 మందిలో 83 శాతం మంది ఈ దశాబ్దం ఆఖరునాటికి ఎన్ఈవీని కొనుగోలు చేసే అంశం పరిశీలిస్తామని తెలిపారు. భారత్ సహా అమెరికా, ఆ్రస్టేలియా, చైనా, జర్మనీవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్‌కి సంబంధించిన విశేషాలు చూస్తే.. → ప్రధాన నగరాలు, వర్ధమాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్ వేగవంతంగా విస్తరిస్తుండటంతో ఎన్ఈవీలపై భారత్‌లో సానుకూల అభిప్రాయం నెలకొంది. ప్రస్తుతం ప్రధాన నగరాలు, హైవేల వెంబడి 6,000 పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య ఒక లక్షకు పైగా పెరగనుంది. → ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీలక విధానాలు అమలు చేస్తుండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సానుకూలతకు దోహదపడుతోంది. → ఈ విభాగంలో చైనా స్థాయిలో భారత్ కూడా అధునాతన టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యాలను సాధించాలి. అవకాశాలు భారీగా ఉన్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌లో ఈవీల తయారీకి సవాళ్లు ఉంటున్నాయి. ఈవీలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు .. ఎలక్ట్రిక్ మోటర్లను ఉత్పత్తి చేయడంలోనూ, చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ చైనా అధిపత్యం కనిపిస్తోంది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు సాధించకుండా ముందుకెళ్లడంలో భారత్ కష్టపడాల్సి రావచ్చు. → భారత్‌లో ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఎలక్ట్రిక్ కార్లను మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడంలో చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం కీలకంగా ఉండవచ్చు. చైనా అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్ మరింత వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లవచ్చు. -
దెయ్యాల టూరిజం!
సర్వే దెయ్యాలు ఉన్నాయి సుమా... అని భయపడేవారు కొందరు. దెయ్యాలు లేనే లేవు... అంటూనే భయపడేవారు కొందరు. రాత్రయినా సరే, పగలయినా సరే ‘దెయ్యాలున్నాయి’ అని భయపడే వారు మరికొందరు. పగలంతా ‘దెయ్యాలు లేవు’ అని గట్టిగా వాదించి రాత్రయితే చాలు ప్లేటు ఫిరాయించి కిటికీల వంక భయంగా చూసేవాళ్లు కొందరు... మొత్తానికైతే దెయ్యాల గురించి మాట్లాడకుండా ఉండలేం. దెయ్యాలను నమ్మడం మూఢ నమ్మకమని, వెనుకబడిన దేశాలలో, వెనకబడిన ప్రాంతాలలో, నిరక్షరాస్యత ఉండేచోట ‘దెయ్యాల మీద నమ్మకం’ ఎక్కువగా ఉంటుందనేది సాధారణ అభిప్రాయం. ప్రసిద్ధ మార్కెటింగ్ రిసెర్చ్ సంస్థ ‘హారిస్ పోల్స్’తో సహా ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలలో మాత్రం పాశ్చాత్యదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తక్కువేమీ లేదనే విషయం బయటపడింది. దెయ్యాలను నమ్మేవారు అమెరికాలో 42 శాతం మంది ఉన్నారు. బ్రిటన్‌లో 52 శాతం మంది ఉన్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘దెయ్యాలు ఉన్నాయి’ అని బల్లగుద్ది వాదించే వాళ్లలో విద్యావేత్తలు, వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కొందరైతే ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తం చేసుకున్న కొన్ని వింత ఫోటోలను చూపిస్తూ ‘‘ఇంతకంటే రుజువు అవసరమా?’’ అని కూడా అంటున్నారు. సర్వేలో భాగంగా దెయ్యాలు తిరుగాడే ప్రాంతాల గురించి అడిగినప్పుడు రకరకాల దేశాల్లో రకరకాల పేర్లు వినిపించాయి. ఈ దెబ్బతో ‘పారానార్మల్ టూరిజం’ పెరిగిపోయింది. ఒకానొక ప్రాంతంలో ఎలాంటి చూడదగిన ప్రదేశమూ లేకపోయినా ‘అక్కడ దెయ్యం ఉంది’ అనే నమ్మకంతో వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది. అలా పర్యటించిన వారికి దెయ్యాలు కనిపించాయో లేదోగానీ- ‘నేను మరియు ఆ దెయ్యం’లాంటి హాట్ హాట్ యాత్రాకథనాలు రాయడం మొదలు పెట్టారు కొందరు. హతవిధీ!