breaking news
Harjinder Kaur
-
CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.ఆఖరి క్షణాల్లో అద్భుతంఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్‌లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.వర్షంలోనూ తగ్గని జోరుకాగా స్కాట్స్టౌన్ స్టేడియంలో ఈ పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్-2లో నిలిచాడు. అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ సైతం సత్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాలు సంఖ్య 12కు చేరింది. -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?


