breaking news
Harishravu
-
నర్సరీ మేళాకు విశేష స్పందన..
-
ప్రకటనలు కాదు.. జీవోలివ్వాలె
► మంత్రి హరీష్రావు ప్రకటనపై ► మధ్య మానేరు నిర్వాసితులు ► సీఎం హామీ అమలు చేయూలని డిమాండ్ ► 14న చలో అసెంబ్లీ వేములవాడ రూరల్ : మధ్యమానేరు నిర్వాసితులు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పడుతున్న వేళ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రకటనపై పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఉద్యమాన్ని చల్లార్చేందుకే మంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటుంటే.. మరికొందరేమో పరిహారంపై ఆశగా ఎదురుచూస్తున్నారు. మధ్యమానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు 2015, జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. అయితే కేవలం ప్రకటనలు వద్దని ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. 14న చలో అసెంబ్లీ ఈనెల 14న ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి ప్రకటించిన సంగతి తెలిసిందే. వేములవాడ రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపు హామీ అమలు చేయూలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. నజరానాలు..గాలమేనా మధ్యమానేరు నిర్వాసితుల ఉద్యమాలకు కల్లెం వేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు భారీ నజరానా పేరుతో ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం 2015, జనవరి నాటికి 18 ఏళ్లు నిండినవారికి రూ.2లక్షలు ప్రకటిస్తూ, రూ.113కోట్ల వరకు మిడ్మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వేములవాడ మండలం మిడ్మానేరు నిర్వాసితులకు ఈ వార్త సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ.. వేములవాడకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ డబుల్బెడ్రూమ్పై ఆశలు వదులుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రకటనలు మానుకుని ప్రభుత్వం అధికారికంగా జీవోలు ఇవ్వాలని మధ్యమానేరు నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 14న యువతకు పరిహారం, డబుల్ బెడ్రూమ్ వర్తింపు కోసం చలో అసెంబ్లీ చేపడుతున్నట్లు నాయకులు చెబుతున్నారు. ప్రకటనలతో సరిపుచ్చలేరు ప్రకటనలతో మభ్యపెట్టి మధ్యమానేరు నిర్వాసితుల ఉద్యమాలను ఆపలే రు. 2015, జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ.2లక్షలు పరిహారం ఇస్తామని మంత్రి హరీష్రావు చెప్పడం అంత బూటకం. రూ.2లక్షలతోపాటు నివేశనస్థలం ఇవ్వాలి. - కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకుడు ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ముఖ్యమంత్రి మంత్రులతో బోగస్ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. మంత్రి హరీష్రావు చేసిన ప్రకటన సైతం ఈ కోవకే చెందినదే. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవోలు రాని మోసపూరిత ప్రకటన. - ఎర్రం రాజు, ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకుడుఈ నాటకాలెన్నాళ్లు? నిర్వాసితులను మభ్యపెట్టేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు చేస్తున్న ప్రకటనల నాటకాలెన్నాళ్తో సాగవు. వేములవాడ రాజన్న సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ అమలు చేయూలి. మంత్రి హరీష్రావు మాటలు ఏవిధంగా నమ్మాలో తెలపాలి. - ఎర్రం నర్సయ్య, మాజీ ఎంపీటీసీ, అనుపురం