breaking news
Hanmakonda Jawaharlal Nehru Stadium
-
ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
న్యూశాయంపేట : పోలీస్‌శాఖలో ఎస్సై పోస్టులకు చేపట్టిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నాలుగో రోజు గురువారం హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మంది అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరణతోపాటు శారీరక కొలతల పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉదయం వర్షం లేకపోవడంతో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో 540 మంది అభ్యర్థుల ఎత్తు, చాతి కొలతలను మాత్రమే పరీక్షించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు 4వ తేదీన నిర్వహించే క్రీడాంశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మ హేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ అధికారులు, ఎస్సై, ఆర్ఎస్సై, ఐటీకోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. కేయూ మైదానంలో 977 మందికి.. వరంగల్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మైదానంలో గురువారం 977 మంది అభ్యర్థులకు శారీరక కొలతలు, 582 మందికి అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు పందెంతోపాటు షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ, ఏఆర్ అదనపు ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, పరకాల, నర్సంపేట ఏఆర్, టీఎస్ఎస్పీ డీఎస్పీలు సుధీంద్ర, మురళీధర్, రాంచందర్‌రావు, కుమారస్వామి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
హ్యాండ్‌బాల్ బాలుర విజేత వరంగల్
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 పాఠశాలల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. బాలుర విభాగంలో వరంగల్ జట్టు విజేతగా నిలవగా... బాలికల విభాగంలో మొదటి స్థానాన్ని నల్లగొండ జట్టు కైవసం చేసుకుంది. క్రీడల ముగింపు కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. హోరాహోరిగా సాగిన ఫైనల్లో బాలుర విభాగంలో వరంగల్ జట్టు మొదటి స్థానంలో, హైద రాబాద్ జట్టు రెండో స్థానంలో నిలిచారుు. అలాగే బాలికల విభాగంలో నల్లగొండ మొదటి స్థానంలో, ఖమ్మం జట్టు రెండోస్థానంలో నిలిచారుు. విజేతలుగా నిలిచిన జట్లు డిసెంబర్ మొదటి వారంలో నాగ్‌పూర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మళ్ల సురేందర్ తెలిపారు. మూడు రోజులపాటు సాగిన పోటీల్లో 300 మంది పీఈటీలు, 26 మంది టెక్నికల్, 50 మంది అధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శివకుమార్, పవన్, శ్రీను, సారయ్య పాల్గొన్నారు.