breaking news
hangover free
-
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్‌కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్‌లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!
న్యూ ఇయర్(New year) ముందు రోజు (డిసెంబర్ 31) రాత్రంత కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాల్లో మునిగి తేలుతుంటారు. ఆట, పాట, మందు, విందు అంటూ పార్టీలతో పెద్దలు, కుర్రకారు మంచి జోష్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. అర్థరాత్రి పన్నెండు దాక సెలబ్రేషన్స్ ఖుషీలో పరిమితికి మించి ఫుడ్‌ని హాంఫట్ చేసేస్తుంటారు. దీంతో నెక్ట్స్ డే మార్నింగ్ నుంచి మొదలవుతుంది తలంతా పట్టేసి హ్యాంగోవర్‌తో బాధడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి ఓ పట్టాన బయటపడమేమో అన్నంతగా దాని ప్రతాపం చూపిస్తుంటుంది. ఒకటే తల బరువు, నొప్పితో తెగ బాధపడుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు దీన్నుంచి తేలికగా బయటపడాలంటే ఇలా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దామా..కొందరు మిడ్నైట్ వరకు పార్టీల పేరుతో మందు పుచ్చుకుంటే..మరికొందరూ నచ్చిన ఫుడ్, కూల్‌డ్రింక్స్ లాగించేస్తుంటారు. అదీగాక అర్థరాత్రి వరకు మేల్కొనడంతో ఒక్కసారిగా ఈ సడెన్ ఛేంజ్‌ని మన శరీరం ఆకలింపు చేసుకోలేక ఎదురయ్యే పరిస్థితే ఈ హ్యాంగోవర్(Hangover) అని చెబుతున్నారు ఆరోగ్య నిపణులు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వాళ్లకు ఈ సమస్య మరింత త్రీవంగా ఉంటుందట. కొందరికి దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, వాంతులు కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటప్పడు అలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఉపశమనం లభించడమే గాక చాలా సులభంగా దీన్నుంచి బయటపడతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..హైడ్రేటింగ్ డ్రింక్స్హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి, బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్లను రిస్టోర్ చేసుకోవాలి. దీని కోసం స్పోర్ట్స్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్-ఎన్హాన్స్డ్ డ్రింక్స్ వంటి కొన్ని డ్రింక్స్ తీసుకోవచ్చు. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న దోసకాయ నీరు, బచ్చలి నీళ్లు వంటి డ్రింక్స్ కూడా తాగుతుండాలి. వాటర్(Water) తాగొచ్చా అంటే..నీరు తాగవచ్చు కాకపోతే నెమ్మదిగా, చిన్న సిప్స్ మాత్రమే తీసుకోవాలి. అతిగా లేదా చాలా వేగంగా తాగితే, వాంతులు కావచ్చు. అలాగే, చాలా చల్లటి నీటిని తీసుకోకూడదు. గోరు వెచ్చని నీరు అయితే మంచి ఉపశమనంగా ఉంటుంది. విరేచనాలు లేదా వికారం ఉంటే..చప్పగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినవచ్చు. ముఖ్యంగా అరటి, రైస్, యాపిల్సాస్, టోస్ట్ వంటి ఫుడ్స్ తీసుకోవచ్చుపండ్లు(Fruits)హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి పండ్లు తినొచ్చు. పండ్లలోని సహజసిద్ధమైన చక్కెరలు బాడీలో నుంచి ఆల్కహాల్నిగ ఎలిమినేట్ అయ్యలా చేస్తాయి. అలాగే హైడ్రేషన్‌ను, శక్తిని పెంచేలా విటమిన్లు, నీరు, పోషకాలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. మామిడిపండ్లు, ద్రాక్ష, నారింజ, బేరి, అరటిపండ్లు, పుచ్చకాయ హ్యాంగోవర్‌ను సమర్థవంతంగా దూరం చేయగలవు.వికారం తగ్గాలంటే..అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. దీన్ని వివిధ రూపాల్లో తినవచ్చు లేదా తాగవచ్చు, కానీ జింజర్ ఆలే లేదా అల్లం బీర్ వంటి చక్కెర, జిగట డ్రింక్స్ సేవించకూడదు. బదులుగా పచ్చి అల్లంతో చేసిన గోరు వెచ్చని నీళ్లే మంచివి.. విటమిన్ ట్యాబెలెట్స్ వద్దు..వ్యక్తులు హ్యాంగోవర్లను నయం చేయడానికి విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటారు, కానీ అవి పని చేయవు. బదులుగా సాల్మన్ చేప ఒక గొప్ప ఎంపిక. ఇందులో B6, B12, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.తీసుకోకూడనవి..హ్యాంగోవర్‌ను నివారించడానికి(Prevention) బర్గర్లు, ఫ్రైస్, కాఫీ వంటి డ్రింక్స్ కొందరు తీసుకుంటుంటారు. వీటిని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ హ్యాంగోవర్ మరింత తీవ్రతరం చేస్తాయి.(చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
హ్యాంగోవర్ లేని మద్యం వస్తుందోచ్..!
ఉత్తరకొరియా: మద్యం ప్రియులకు ఇక పండగే. మున్ముందు రోజుల్లో వారు ఎంతైనా తాగి ఊగే అవకాశం కలగనుంది. ఎంత తాగినా వారికి ఇక పొద్దున్నే హ్యాంగోవర్ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే హ్యాంగోవర్ పుట్టించని మద్యాన్ని తాము తయారు చేసినట్లు, ఇది ప్రపంచంలోని మొట్టమొదటిదని ఉత్తర కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. తాము తయారుచేసిన మద్యం ప్రస్తుతం తాగే మద్యంకన్నా మరింత మధురంగా ఉంటుందని, దానిని మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేలా చేస్తుందని, అంతేకాకుండా అది సేవించిన వారిని సౌమ్యంగా మారుస్తుందని వివరించారు. చీనా దేశానికి చెందిన ఓ చెట్టు మూలిక దినుసుల నుంచి తాము ఆ మద్యాన్ని కనుగొన్నట్లు చెప్పారు. కిరియో లిక్కర్ గా పిలిచే ఈ డ్రింక్ ను ఉత్తర కొరియాలోని ప్రభుత్వం నడుపుతున్న టాడాగాంగ్ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారని వివరించారు. ఇక్కడే చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు పనిచేసి ప్రయోగాలు చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు.