breaking news
hand looms
-
Miss World 2025 అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ (Miss World 2025 ) పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు. ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరి గుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది. ఇదీ చదవండి: కేన్స్‌లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు. యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్‌గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్‌ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. -
నేతన్నల భారీ బైక్ ర్యాలీ
ధర్మవరం: సీఎం వైఎస్ జగన్ నాలుగో విడత ‘నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది చేనేత కార్మికులు తరలివచ్చారు. పట్టణంలోని కదిరిగేట్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో 15,981 మంది కార్మికులకు రూ.38.35 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. చేనేతకు పూర్వ వైభవం జగనన్నతో సాధ్యమవుతోందన్నారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
ఇక్కత్‌కు ప్రింటెడ్ దెబ్బ
చేనేత కార్మికుడి శ్రమ, కళ, నైపుణ్యతకు ప్రతిరూపం పట్టు చీర. నాణ్యతను బట్టి రూ.3వేల నుంచి రూ.20వేల వరకు పలికే ‘పట్టు’ నేడు ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన చేనేత డిజైన్లను కంపెనీలు కాపీ కొట్టి ప్రింటెడ్ సిల్క్ చీరలను తయా రు చేసి.. తక్కువ ధరకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పేటెంట్ హక్కులకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా నిద్ర వీడడం లేదు. వెరసి చేనేత కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : ఇక్కత్ పట్టుచీర డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. చేనేత కార్మికుడు తయారు చేసిన పట్టుచీర నాణ్యతను బట్టి రూ.3వేల–రూ. 20వేల వరకు డిమాండ్ పలికితే ప్రింటెడ్ పట్టుచీరల పేరుతో వస్తున్న సిల్క్ చీరలు మార్కెట్లో కేవలం రూ.400కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రిం టెడ్ చీరల వైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా చేనేత కార్మి కుల పొట్టగొట్టినట్లవుతోంది. చేనేత కుటుంబ సభ్యులంతా రెక్కలు ముక్కలు చేసుకుని తమకున్న నైపుణ్యంతో రకరకాల డిజైన్ల ను రూపొందిస్తూ, వాటికి రంగులు అద్దుతూ(టై అండ్ డై) పద్ధతిలో తయారు చేస్తున్న పట్టు చీరలను, వాటి డిజైన్లను కొన్ని కంపెనీలు కాపీ కొడుతూ ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో మార్కెట్లో విచ్చలవిడిగా చెలామణి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చేనేత ప్రభావిత గ్రామాలు యాదాద్రిభువనగిరి జిల్లాలో ముఖ్యంగా భూదాన్‌పోచంపల్లి, కొ య్యలగూడెం, చౌటుప్పల్, వెల్లంకి, సిరిపురం, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, గుండాల, మోత్కూర్, ఆలేరు, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల, పుట్టపాక, చండూరులో చేనేత పరిశ్రమ విస్తరించి ఉంది. కాగా పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పల్‌లో టై అండ్ డై వస్త్రాలు, చీరెల తయారీకి ప్రసిద్ధి. ఇక రాజాపేట మండలంలోని రఘునా«థపురం, రేణికుంట, బేగంపేట, ఆలేరు, మూటకొండూర్, చొల్లేరు, కొలనుపాక, దిలావర్పూర్, టంగుటూరు, శ్రీని వాసపురం, గౌరాయిపల్లి, సాదువెల్లి, నల్లగొండ మండలం చర్లపల్లి తదితర గ్రామాల్లో మరమగ్గాలు (సాంచలు) ఉన్నాయి. 20 చేనేత కార్మిక సంఘాలు యాదాద్రిభువనగిరి జిల్లాలో సుమా రు 20 చేనేత పారిశ్రామిక సం ఘాల ఉన్నాయి. ఇందులో ఆరు వేల చేనేత మగ్గాల ద్వారా నెలకు సుమారు 30 వేల పట్టుచీరల వరకు ఎగుమతి చేస్తుంటా రు. చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలను భూదాన్‌పోచంపల్లి పట్టు శారీ మార్కెట్లో విక్రయిస్తుంటారు. దేశ, విదేశాల నుంచి కొనుగోలుదారులు భూ దాన్పోచంపల్లి పట్టు శారీ మార్కెట్‌కు వచ్చి పట్టుచీరలను తీసుకెళ్తుంటారు. రోజుకు వెయ్యి పట్టుచీరల ఉత్పత్తి యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత సంఘాల పరిలో సుమారు 6వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరు రోజు కు వెయ్యి పట్టుచీరలను ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న పట్టుచీరల్లో రాజ్‌కోట్, జకాట్, బార్డర్ చీరలు అంటూ రకరకాలుగా ఉంటాయి. బార్టర్ పట్టు చీర ఒక్కటి రూ. 3,500, జకాట్ పట్టుచీర రూ.20,000, రాజ్‌కోట్ పట్టుచీర రూ.7.500ల వరకు ఉంటుంది. వాటి డిజైన్లను బట్టి 7 చీరలు గల వార్పును చేనేత కార్మికుడు 30 రోజుల నుంచి 60 రోజుల్లో పూర్తిచేస్తాడు. ఇందుకు కూలి కూడా డిజైన్లను బట్టి చేనేత కార్మికుడికి రూ.8,000 నుంచి 36,000 వరకు ఇస్తుంటారు. ఇక్కత్ పట్టుచీరలకు ప్రసిద్ధి భూదాన్‌పోచంపల్లి. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కత్ పట్టుచీరలను కొనుగోలు చేస్తుం టారు. పట్టుచీరల అమ్మకాల మీద రోజుకు రూ. కోటి వరకు లావాదేవీలు నడుస్తున్నాయి తక్కువ ధరకే ప్రింటెడ్ చీరలు చేనేత కార్మికుడు తయారు చేసి న పట్టుచీరలను ప్రస్తుతం మార్కెట్లో లభి స్తున్న ప్రింటెడ్ పట్టుచీరలు సరిపోలి ఉంటున్నా యి. చేనేత పట్టుచీరలు వాటివాటి డిజైన్ల ను బట్టి సుమారు రూ. 20,000 వరకు ఖరీదు ఉండగా.. ప్రింటెడ్ పట్టుచీరల ధర కేవలం రూ.300 –రూ.500కే లభిస్తోంది. చూడడానికి పోచంపల్లి పట్టుచీరల మాదిరిగా ఉండడంతో భువనగిరి, మో త్కూరు, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, రాజా పేట తదితర ప్రాంతాల్లో విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఇటువంటి చీరలు సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో మిల్లుల్లో తయారై ఇక్కడికి వస్తున్నట్టు చేనేత కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ధర తక్కువగా ఉండడం.. అచ్చం చేనేత పట్టుచీరలాగే ఉండడంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో రోజుకు లక్ష వరకు చీరలు అమ్ముడవుతున్నట్టు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. తనిఖీలు ఏవీ? చేనేత కార్మికులు తయారు చేసిన 11 రకాల పట్టుచీరల డిజైన్లకు 2014లో పేటెంట్ హక్కలు కల్పించబడింది. ఇందుకు 10 మంది సభ్యులతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ అధికారులు తరచూ వస్త్రదుకాణాలపై చేనేత డిజైన్లను కాపీ కొట్టి చీరలను తయారు చేస్తున్న కంపెనీలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం తనిఖీలు జరగడం లేదు. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ సొంతం నాణ్యమైన, పర్యావరణహితమైన చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం 2015లో ఇం డియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్‌ను దేశంలోనే ప్రప్రథమంగా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ సొంతం చేసుకుంది. దీని ద్వారా స్వయంగా వస్త్రోత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మార్కెటింగ్ చేస్తూ రూ.7కోట్ల టర్నోవర్ సాధించింది. దీంతో పార్క్ మెరిట్ అవార్డు, సర్టిఫికెట్ అందుకొంది. దేశవిదేశాలలో ఎగ్జిబిషన్లను నిర్వహిస్తూ ఇక్కత్ ఖ్యాతిని రెట్టింపు చేస్తుంది. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిరూ.37 కోట్లతో దేశంలో మొదటిసారిగా 5వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాలనే లక్ష్యంతో హ్యాండ్లూమ్ పార్క్‌ను నెలకొల్పారు. హ్యాండ్లూమ్, సిల్క్ మార్క్ నకిలీ వస్త్రాలతో వినియోగదారులు మోసపోకుండా, మగ్గం మీద నేసిన స్వచ్ఛమైన పట్టువస్త్రాలకు ప్రభుత్వం హ్యాండ్లూమ్, సిల్క్ మార్క్‌ను అందజేసింది. అయితే వినియోగదారులు వస్త్రాలను కొనుగోలు చేసేటప్పుడు ఆ రెండు మార్క్‌లను చూసి కొనాలి. 60 ఏళ్ల క్రితమే చీరల తయారీ.. భూదాన్‌పోచంపల్లిలో 60 ఏళ్ల క్రితమే సిల్క్ చీరెలను తయారు చేశారు. 1956లో పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, చిలువేరు రాంలింగం, చిలువేరు కనకయ్య అనే చేనేత కళాకారులు సిల్క్ చీరెలు, వస్త్రాలపై ఎన్నో నూతన ఆవిష్కరణలకు జీవం పోశారు. పాన్‌పటోలా, రాజస్థాన్, నారీకుండీ, ఏనుగు, చిలుక అంబాల, సీతాగీతా లాంటి డిజైన్లు పోచంపల్లి సొంతం. మారుతున్న కాలానుగుణంగా నేటి యువత అభిరుచికి అనుగుణంగా డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రా జ్కోట్ చీరలకు డి మాండ్ ఉంది. టై అండ్ డై వీరి సొంతం టై అండ్ డై వస్త్రాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయి. టై అండ్ డై అంటే ఏమిటంటే.. ‘టై’ అంటే దారానికి రబ్బరు చుట్టడం, డై’ అంటే రంగులద్దడం. దీనినే వాడుక పరిభాషలో ‘ఇక్కత్’ అని కూడా పిలుస్తారు. కానీ ఇలా దారానికి రంగులద్ది డిజైన్లు సృష్టించడం ఒక్క పోచంపల్లి చేనేత కళాకారులకే సొంతం. మిగతా ప్రాంతాల్లో మాత్రం వస్త్రంపైన డిజైన్లు వేస్తారు. ఇక్కత్ వస్త్రాలకు పేటెంట్ ఇక్కత్ వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రి(పేటెంట్) సర్టిఫికెట్స్ జారీ చేసింది. ఇందులో 11 చేనేత డిజైన్లకు రిజర్వేషన్లతో పాటు చేనేత వస్త్రాలైన చీరెలు, రుమాలు, కార్పెట్, బెడ్షీట్లు, మ్యాట్స్‌కు పెటెంట్ హక్కు కల్పించింది. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు, వస్త్రాలను ఎవరైన కాపీ(ప్రింటింగ్) కొట్టినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. కార్మికులకు చాలా నష్టం చేనేత కార్మికుడు ఎంతో శ్రమకోర్చి పట్టుచీరను తయారు చేస్తాడు. అటువంటి పట్టుచీర డిజైన్లు కాపీకి గురవుతున్నా అధి కారులు పట్టించుకోవడం లేరు. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు చర్యలు తీసుకోకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. కార్మికులకు చాలా నష్టంగా వాటిల్లే ప్రమాదం ఉంది. – పొడుగు వెంకటేశం, చేనేత కార్మికుడు, పల్లెర్ల, ఆత్మకూరు(ఎం) -
రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
చేనేత సొసైటీల అధ్యక్షుల సమావేశంలో తీర్మానం అంగర (కపిలేశ్వరపురం) : చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో తీర్మానం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో సహకార సంఘాల నిర్వహణ కష్టంగా మారిందని నేతలు అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని అంగర గణ పతి చేనేత సహకార సంఘంలో చింతకింద రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దొంతంశెట్టి విరూపాక్షం హాజరయ్యారు. సభకు స్థానిక సొసైటీ అధ్యక్షుడు కుడకా వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ ఏడాది ఆగస్టు ఆరున ఖరారు చేసిన ధర్మవరం డిక్లరేషన్‌ను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ప్రకారం చేనేత రుణమాఫీ నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న సిలపనూళ్ల సబ్సిడీలో 50 శాతం మొత్తాన్ని సంఘాలలో పనిచేస్తున్న సభ్యులకు ప్రొడక్షన్ బోనస్‌గా వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. చేనేత సంక్షేమానికి సిఫారసులు చేయడానికి అనుభవమున్న ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు, సంఘాల వస్త్రృ విక్రయాలపై నిరంతర రిబేటు అమలు, ఉత్పత్తులను నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపడం అనే నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది. వీటి పరిష్కారానికి అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదని ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. డీసీసీబీ డైరెక్టర్లు మేడిశెట్టి బాలయ్య, అంకం వీర్రాజు, సహకార సంఘాల అధ్యక్షుడు చింతా వీరభద్రీశ్వరరావు పాల్గొన్నారు.