breaking news
H S Prannoy
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
క్వార్టర్స్ లో శ్రీకాంత్
టోక్యో: సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, కేరళ కుర్రాడు హెచ్.ఎస్.ప్రణయ్... జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడ్ శ్రీకాంత్ 21-12, 21-16తో కజ్తెర్ కొజాయ్ (జపాన్)పై విజయం సాధించాడు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ.. స్మాష్‌లతో చెలరేగాడు. కీలక సమయంలో నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించాడు. ఆరంభంలో ఇద్దరు ప్లేయర్లు మెరుగ్గా ఆడటంతో స్కోరు 7-7తో సమమైంది. అయితే ఏపీ కుర్రాడు కాస్త దూకుడు పెంచి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గాడు. చివర్లో మరో నాలుగు పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో జపాన్ ఆటగాడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 5-5, 10-10, 16-16తో స్కోరు సమం చేశాడు. ఈ దశలో శ్రీకాంత్ బలమైన స్మాష్‌లతో హోరెత్తించాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను వశం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 21-13, 11-21, 21-18తో యుచి కెదా (జపాన్)పై పోరాడి నెగ్గగా; ఆనంద్ పవార్ 12-21, 16-21తో టాప్‌సీడ్ లీ చోంగ్‌వీ (మలేసియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. డబుల్స్‌లో మను ఆత్రి-సుమీత్ రెడ్డి 17-21, 16-21తో జియోలాంగ్ లీ-జిహాన్ క్యూ (చైనా) చేతిలో కంగుతిన్నారు. ప్రణయ్ సంచలనం మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్.ఎస్.ప్రణయ్ సంచలనం సృష్టించాడు. 21-14, 13-21, 21-17తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ ఓ జార్గెన్సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ పోరాట స్ఫూర్తిని కనబర్చాడు. తొలి గేమ్‌లో 1-4తో వెనుకబడ్డా 9-9తో స్కోరును సమం చేశాడు. తర్వాత బలమైన స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా పాయింట్లు సాధించాడు. రెండో గేమ్‌లో 4-2 ఆధిక్యంలోకి వచ్చిన జార్గెన్‌సన్‌ను ఓ దశలో ప్రణయ్ అధిగమించినా.. చివరి వరకు అదే జోరును కనబర్చలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన భారత కుర్రాడు 18-17 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ను నిలబెట్టుకున్నాడు. సింధు ఓటమి మహిళల ప్రిక్వార్టర్స్‌లో ఏపీ అమ్మాయి పి.వి.సింధు 6-21, 17-21తో అకెని యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. 32 నిమిషాల ఈ మ్యాచ్‌లో సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. స్మాష్‌లు సంధించడంతో పాటు నెట్ వద్ద పూర్తిగా విఫలమైంది. తొలి గేమ్‌లో నిరాశపర్చిన సింధు... రెండో గేమ్‌లో పుంజుకునే ప్రయత్నం చేసింది. అయితే క్వాలిఫయర్ యమగుచి భిన్నమైన షాట్లతో భారత క్రీడాకారిణిని కట్టిపడేసి సంచలనం సృష్టించింది. దిగజారిన సింధు ర్యాంక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో... హైదరాబాద్ ప్లేయర్ పి.వి.సింధు రెండు ర్యాంక్‌లు దిగజారింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 12వ స్థానంలో నిలిచింది. స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ 14వ, గురుసాయిదత్ 23వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. అజయ్ జయరామ్ ఏడు స్థానాలు కోల్పోయి 30వ ర్యాంక్‌లో, ఆనంద్ పవార్, సాయి ప్రణీత్, కె.శ్రీకాంత్, సౌరభ్ వర్మలు వరుసగా 37, 38, 39, 46వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో పి.వి.సింధు ఓటమి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తెలుగు ఆంధ్రప్రదేశ్ స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె పోరాటం ముగిసింది. గురువారం యమగుచి (జపాన్)తో 32 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 6-21 17-21తో సింధు ఓటమి పాలయింది. పురుషుల సింగిల్స్‌లో ఏపీ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో కాజుటెరు కొజయ్(జపాన్)పై శ్రీకాంత్ 21-12 21-16తో విజయం సాధించాడు. అరగంటలోనే మ్యాచ్ ముగించాడు. మరో మ్యాచ్‌లో జాన్ ఒ జొర్జన్సెన్(డెన్మార్క్)పై ప్రణయ్ 21-14 13-21 21-17తో గెలుపొందాడు.