breaking news
gym trainer pradeep reddy arrested
-
వరకట్న వేధింపుల కేసులో జిమ్ నిర్వాహకుడి అరెస్ట్
బంజారాహిల్స్: సినీ హీరోల వ్యక్తిగత జిమ్ ట్రైనర్ పల్లి ప్రదీప్‌కుమార్‌రెడ్డిని వరకట్న వేధింపుల కేసులో బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 వెంకటేశ్వరనగర్‌కు చెందిన ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం తాను ఆస్ట్రేలియాలో ఉంటున్న సమయంలో ఎర్రగడ్డకు చెందిన దివ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అతను జూబ్లీహిల్స్‌లో ఫిట్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. గత కొంత కాలంగా అతను తన భార్య దివ్యను అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
టాప్ హీరోల జిమ్ ట్రైనర్ ప్రదీప్ అరెస్ట్