breaking news
Gurudayal Singh Sandhu
-
అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’
1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం స్పష్టంగా కనిపించేది. ఇందుకు భిన్నంగా 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన ‘గురు’ క్రీడాప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను విద్యార్థులలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడుతుండేవారు. విద్యార్థులు ఆయన వద్ద పాఠ్యాంశంగా చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, వారు నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు ఆయన బోధించినవే. ఇలా చేయమని గురు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ఆయనొక ఉదాహరణగా కనిపించేవారు. మేము ఆయన్ని ‘గురు’ అని పిలుచు కోవడం ఆపేక్షతోనే అయినప్పటికీ నిజానికి ఆయనకు అదే కచ్చితమైన మాట. విశ్వగురు అనడం ఫ్యాషన్ ఈ రోజుల్లో. కానీ ఆయన నిజమైన, అంకితభావం కలిగిన, శ్రద్ధాబద్ధుడైన ఉపాధ్యాయుడు. కావాలంటే మీరు ఆయన్ని భారతీయ ‘మిస్టర్ చిప్స్’ అనుకోవచ్చు. డూన్ స్కూల్ అబ్బాయిలకు ‘గురు’ అనే పేరుతోనే గురుదయాళ్ సింగ్ తెలుసు. గురు అన్నది ఆయన పేరుకు సముచి తమైన నామకరణ. గత నెలలో ఆయన కన్ను మూసినప్పుడు కూడా అదే పేరుతో మాకు స్మరణీయం అయ్యారు. నేను గురును మొదటిసారి కలిసినప్పుడు నా వయసు పదేళ్లు. జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ ఆయన. పొడవాటి మనిషి. నా వయ సుకు ఇంకా పొడవుగా, భారీగా కనిపించారు. అయితే ఆయన చిరు నవ్వుతో నా భయాలు, అందోళనలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఆయన నవ్వినప్పుడు నేనూ పెద్దపెట్టున నవ్వాను. నవ్వును ఆపు కోలేకపోయాను. ఆయన వద్ద పాఠ్యాంశంగా నేను చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, నేను నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు సైతం ఆయన బోధించినవే. ఆ కొన్నింటిలో మొదటిది అతి కష్టమైనది మాత్రమే కాకుండా, అసలు నేనేమిటన్న దాన్ని నాకు బహిర్గతం చేసినది కూడా! 1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. దీనర్థం ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం అన్నది స్పష్టంగా కనిపించేదని! నేను నటనలో, వాదోపవాద చర్చలలో ముందుండే వాడిని. అలాగే, ఆఖరు నిమిషంలో చదివి మార్కుల్ని అదర గొట్టేయడంలో కూడా. కానీ నేను ఆటల్లో లేకపోవడం వల్ల నాలోని ఈ నైపుణ్యాలు చిన్నచూపునకు గురయ్యేవి. అయితే గురు, క్రీడా ప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను నాలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడు తుండేవారు. నేను పాల్గొన్న చర్చల్లోని నా తెలివైన మాటల్ని గుర్తు చేసుకునేవారు. అదొక ప్రశంసలా ఉండేది నాకు. లేదా చర్చావేదిక మీద అలా స్తంభించిపోయిన నా భంగిమ గురించి మాట్లాడుతూ నవ్వేసేవారు. పైకి అది సున్నితమైన ఎగతాళిగా ఉన్నప్పటికీ నిన్ను నేను శ్రద్ధగా గమనిస్తున్నాను సుమా అనే ఒక అంతర్లీనత కూడా ఆయనలో వ్యక్తం అయి, నేనొక ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన నాలో కలిగించేది. జూనియర్స్ క్రికెట్లో నేను అత్యుత్తమంగా ఆడినప్పటికీ ఆయన ఉద్దేశం ప్రకారం నా చివరి ఏడాదిలో నేను ‘హౌస్ కెప్టెన్’ అవడానికి తగిన కారణం మాత్రం నాలోని ఆ కళాత్మక నైపుణ్యాలే! ఎందుకంటే, క్రికెట్ గ్రౌండ్లో నేనొక్కడినే ఉన్న వైపు నేరుగా వచ్చి నా చేతుల్లో పడిన బంతిని కూడా నేను క్యాచ్ పట్టలేకపోయాను. ఆ విధంగా గురు, డూన్ స్కూల్ తానుగా ఎప్పటికీ నాకు అందించని విశ్వాసాన్ని నాలో కలిగించారు. నాలోని ప్రతిభ, నైపుణ్యాలతో సమానంగా, నా పరిమితుల్నీ నేను గుర్తించేలా; నా అపజయాల్ని, వైఫల్యాలను, తప్పుల్ని నేను ఎదుర్కొనేలా నేను ఎదగడానికి గురు తోడ్పడ్డారు. పడిపోతే పైకి లేచి, ముందుకు సాగిపోవడం ఎలాగో నేర్పించారు. అది నాకు ముఖ్యమైన పాఠం. ఎందుకంటే జీవితంలో తరచు నేను పొరపాట్లు చేసి పడిపోతుంటాను. ఏళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయినప్పుడు గురు నాకు చెప్పిన మరొక పాఠాన్ని గుర్తుకు చేసుకున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించడం అన్నదొక్కటి మాత్రమే ఉత్తమ మార్గం కాదు. తప్పును మన్నించడం అన్నది ఉత్తమమైన మార్గం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అంటారు గురు. గురు స్వయంగా ఈ సూత్రాన్ని పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొండితనాన్ని, అబద్ధాలను, ఉద్దేశ పూర్వకమైన తెలివితక్కువ వేషాలను ఆయన భరించారు. నా తప్పు లన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆ తప్పుల్ని పోనిచ్చేవారు. అయితే ఆయన ముఖభావాలను బట్టి, నేను మరికొంత మెరుగ్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించేవాడిని. ఏమీ తెలియని టీనేజ్‌లో ఉన్నప్పటికీ ఆ గ్రహింపు నాకు బాధను కలిగించేది. గురు దృష్టిలో గొప్పగా ఉండటం కన్నా నాకు వేరేదీ అక్కర్లేకపోయేది. అందుకే ఆయన అనిష్టత నా మనసును పిండేసినట్లుగా ఉండేది. ఆ మాత్రం శిక్ష సరిపోతుందని గురుకు తెలుసు. ఇతరులు తప్పు చేసినప్పుడు నేను ఈ పాఠాన్ని గుర్తు చేసు కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత తేలికగా ఉండదు. అందుకు వివేకం, నిగ్రహం రెండూ కావాలి. గురుకు ఆ రెండూ ఉన్నాయి. నాకు తరచు అవి రెండూ ఉండవు. నేను సరిగా నేర్చుకోని ఒక పాఠం ఇది. మూడవ పాఠం, నేనింకా సాధన చేస్తూనే ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అది సులభమైనది. కొద్దిపాటి మర్యాదల పాటింపుతో స్పష్టమైన వ్యత్యాసాలను మీరు చూపగలుగుతారు. గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అందరినీ పలకరించండి. ‘దయచేసి’, ‘ధన్యవాదాలు’ అని చెప్పడాన్ని ఎప్పుడూ విస్మరించకండి. ఇలా చేయమని గురు స్పష్టంగా నాకెప్పుడైనా చెప్పి ఉంటారని నేను అనుకోను. అయితే ఆయనొక ఉదాహరణగా ఎల్లవేళలా ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఉంటారు. జాగ్రత్తగా గమనించవలసింది ఆయన పెంపొందించిన సత్ప్రవర్తన, ఆయన పట్ల మనలో ఉన్న గౌరవ భావన ఆయన్ని మనం అనుకరించేలా చేస్తాయన్నది. ప్రత్యక్షంగా ఆయన ప్రబోధించని విలువలకు మనమంతా అలవాటు అవుతాం. అనుకరణ ద్వారానే నేను నేర్చుకున్నాను. నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నాపై గురు ముద్ర పొరపాటున పడినట్లుగా అనిపించదు. వాటర్లూ యుద్ధంలో బ్రిటన్ గెలుపు ఈటన్ (పాఠశాలల) ఆట మైదానాల వల్ల సాధ్యమయిందేమో నాకు తెలియదు కానీ నాలోని మనిషిని మలిచింది మాత్రం కచ్చితంగా జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ అనే చెప్పగలను. అందుకే ఎప్పటికీ ఆయన నా ‘గురు’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
క్రమంగా పసిడి ఆంక్షల తొలగింపు
ముంబై: పసిడి దిగుమతులపై ఆంక్షలను క్రమంగా సడలించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఇచ్చారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14, ఏప్రిల్-మార్చి) క్యాడ్‌ను గణనీయంగా తగ్గించగలిగిన నేపథ్యంలో రాజన్ ప్రకటన వెలువడింది. ఆర్బీఐ పాలసీ అనంతర సమీక్షా సమావేశంలో రాజన్ బుధవారం మాట్లాడుతూ ఆంక్షలు తొలగించడానికి తాను సానుకూలమేనని అన్నారు. అయితే ఇది నెమ్మదిగా, క్రమరీతిన స్థిరంగా జరగాల్సి ఉంటుందని వివరించారు. ఆంక్షల సడలింపు సమయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, అనిశ్చితి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా అంశాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బంగారం దిగుమతులకు మరిన్ని బ్యాంకులకు కొద్ది రోజుల క్రితం అనుమతించిన విషయాన్నీ ఈ సందర్భంగా రాజన్ ప్రస్తావించారు. నేపథ్యం ఇదీ...: క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్(ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ) మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తాం. 2013-14లో క్యాడ్ భారీగా తగ్గడానికి కేంద్రం బంగారం-వెండి దిగుమతులపై 2 శాతం నుంచి 10 శాతానికి సుంకాల పెంపుసహా పలు ఆంక్షలు విధించింది. ఈ చర్యలు తగిన ఫలితాలను అందించాయి. అధికారిక గణాంకాల ప్రకారం- ఫిబ్రవరితో ముగిసిన యేడాది కాలంలో బంగారం, వెండి దిగుమతుల విలువ భారీగా 71.42 శాతం పడిపోయింది. రూపాయిపై ఇలా...: డాలర్ మారకంలో రూపాయి విలువ 45-50 శ్రేణిలో బలపడితే అది భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎగుమతుల పేలవ పనితీరుపై మాత్రం రూపాయి బలోపేతం ప్రభావం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. రూపాయి కొంత స్థాయిలో బలోపేతమయితే సమస్య ఉండదని, అయితే మరీ ఎక్కువగా బలపడితే మాత్రం ఎగుమతులకు ఇది ఆందోళనకరమైన అంశమేనని ఒక చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనివల్ల కరెన్సీలు బలహీనపడిన కొన్ని అభివృద్ధి చెందిన దేశాల నుంచి మనకు అంతర్జాతీయ మార్కెట్లో గట్టిపోటీ ఉంటుందని వివరించారు. ఆర్బీఐ,ఎస్బీఐ బోర్డ్‌ల్లో గురుదయాల్ సింగ్ సంధు ఆర్బీఐ, ఎస్బీఐ సెంట్రల్ బోర్డ్‌ల్లో డెరైక్టర్‌గా ఆర్థిక సేవల కార్యదర్శి గురుదయాల్ సింగ్ సంధు నామినేట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ నోటిఫికేషన్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచీ ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఎస్బీఐ కూడా మరొక ప్రకటన చేస్తూ, సంధూను బ్యాంక్ బోర్డ్‌లో నామినేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీ రేట్లూ తగ్గిస్తాం ద్రవ్యోల్బణ కట్టడి ప్రక్రియ ఊహించిన దానికంటే వేగంగా కొనసాగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని రాజన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ద్రవ్య పటిష్టీకరణకు, పెట్టుబడుల వృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ద్రవ్య విధానం స్థిరంగా ఉండాలి గానీ, ప్రతి సమాచారానికీ స్పందించేదిగా ఉండరాదని అభిప్రాయపడ్డారు.