ఫుట్పాత్ పై కవిత
అది ఒక కదిలే ఇల్లు
కవితలు వెదజల్లే ఇల్లు
ఆ ఇంటికి అవ్వనే కూరాడు
అయ్యనే నిట్టాడు
పిల్లలే మూలవాసాలు దూలాలు
ఆ ఇంటికి గోడలు లేవు గేట్లు లేవు
వాడలు లేవు బోర్డులు లేవు
పంచభూతాలే రక్ష
ఉదయం పొయ్యి రగులుతుంది
పాట రగులుతుంది ఆట రగులుతుంది
కబీ కబీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై
అది పాట కాదు ఏదో గాంధర్వము
ఏదో గేయం ఏదో గాయం
ఏదో వేదం ఏదో నాదం ఏదో వాదం
హిరామ్! ఆవోరే అంటున్నాడు ఒక పిల్లకాయ
వస్తున్నా రహీం ఠైరో అంటున్నాడు మరో పిల్లవాడు
గోలీలాట దాగుడుమూత గప్చుప్
ఏక్ దో తీన్ చార్ ఏవేవో ఆటలు
కేరింతలు వారింతలు తుళ్లింతలు
ఎన్ని మధురిమలు ఎన్ని సరిగమలు
గులాబీల మల్లారెడ్డి 9440041351