breaking news
Guggenheim Museum
-
ట్రంప్ కోసం బంగారపు టాయిలెట్
న్యూయార్క్ లోని గుగ్గెన్హైమ్ మ్యూజియంకు భలే గోల్డెన్ ఐడియా వచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏకంగా గోల్డెన్ టాయిలెట్‌నే బహుకరిస్తోంది. ట్రంప్‌కు అసలెందుకు ఈ గోల్డెన్ టాయిలెట్‌ను పంపిస్తోందో తెలుసా? అధ్యక్షుడు, తొలి మహిళ తాము నివసించే ప్రైవేట్ గదిలో 19వ శతాబ్దపు విన్సెంట్ వాన్ గోగ్ అనే పేయింటర్ చిత్రీకరించిన ''ల్యాండ్‌స్కేప్ విత్ స్నో'' పేయింటింగ్‌ను పెట్టుకోవాలని ఆశించారు. వారి ఆశ మేరకు ఆ పేయింటింగ్‌ను త్వరగా పంపించాలంటూ వైట్‌హౌజ్ మ్యూజియాన్ని ఆదేశించింది. అయితే ఆ పేయింటింగ్ ఇవ్వడం ఇష్టంలేని మ్యూజియం అధికారులు దాని బదులు గోల్డెన్ టాయిలెట్‌ను ట్రంప్‌కు బహుకరిస్తున్నారని వాషింగ్టన్ పోస్టు రిపోర్టు చేసింది. మ్యూజియం చీఫ్ క్యూరేటర్ ఈ టాయిలెట్‌ను అందిస్తున్నారని, ఇప్పటి వరకు ఈ టాయిలెట్‌ను వేలాది మంది సందర్శకులు వాడారని తెలిసింది. దీనిపై గుగ్గెన్హైమ్ మ్యూజియం అధికార ప్రతినిధి కానీ వైట్‌హౌజ్ అధికారులు కానీ స్పందించడానికి నిరాకరించారు. అయితే ఆర్థిక అసమానతలను రూపుమాపడమే ఇతివృత్తంగా మారాజియో కాటలెన్ అనే కళాకారుడు 18 క్యారెంట్లతో ఈ టాయిలెట్‌ను రూపొందించారు. విలాసవంతమైన రూపం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే దీన్నిమ్యూజియం లోని యూనిసెక్స్ బాత్రూంలో 2016లో ఏర్పాటు చేశారు. 100,000 మందికి పైగా ఈ టాయిలెట్‌ను వాడినట్టు గుగ్గెన్హైమ్ మ్యూజియం బ్లాగ్ పోస్టు పేర్కొంది. -
ఈ అవకాశం అమెరికన్లందరికీ..
-
ఈ అవకాశం అమెరికన్లందరికీ..
న్యూయార్క్: ఏంటీ.. ఏదో సరదా కోసం దీన్నిలా డిజైన్ చేశారనుకుంటున్నారా? అదేంకాదు.. దీనిని ఉపయోగించుకోవచ్చు. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన దీనిని ఉపయోగించుకునేందుకు అమెరికన్లందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు గుగెన్ హీమ్ మ్యూజియం ప్రకటించింది. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మారిజియో క్యాటెలాన్.. మ్యూజియంలోని నాలుగో అంతస్తులోని ఓ రెస్ట్ రూమ్‌లో ఏర్పాటు చేశాడు. కేవలం చూసేందుకే కాకుండా ఉపయోగించుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది. 2011 నుంచి ఇలాంటివాటిని తయారు చేస్తున్నా.. తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది మాత్రం దీనినే. ఇటువంటి కళాఖండాల గురించి మరింత ప్రచారం కల్పించేందుకే ప్రజలందరికీ దీనిని ఉపయోగించే అవకాశం కల్పించామని, ఆర్ట్ మార్కెట్‌కు ఆదరణ పెరగడానికి ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయని మ్యూజియం తన వెబ్సైట్లో పేర్కొంది.