breaking news
Growth fund
-
ఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్.. రవాణాకు మాస్టర్‌ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) వృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఈల్లో ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.10 వేల కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్(ఎస్జీఎఫ్) ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ అథారిటీ(ఐటీఎల్‌ఏ) పేరిట ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తయారీ, సేవా, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి మూలధనాన్ని(గ్రోత్ క్యాపిటల్) సమకూర్చడమే లక్ష్యంగా ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌ను తీసుకొచ్చారు. 2026–27 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటన మేరకు ఈ నిధికి రూపకల్పన చేశారు. వివిధ రవాణా మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని నివారించి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అపెక్స్ సంస్థగా ’ఐటీఎల్‌ఏ’ను ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తరహాలో ఏర్పాటు చేయబోతున్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, షిప్పింగ్, పౌర విమానయానం, జలమార్గాలు, కోస్టల్ షిప్పింగ్, పట్టణ రవాణాను కలుపుతూ పదేళ్ల భవిష్యత్ ప్రణాళికతో సమగ్ర ’నేషనల్ ట్రాన్స్పోర్ట్ మాస్టర్ ప్లాన్’ను ఐటీఎల్‌ఏ సంస్థ తయారు చేస్తుంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానం ఆమోదం ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం అభినందనలు తెలియజేసింది. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజా నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలను కొనియాడింది. ఈ మేరకు మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మంగళవారం కేబినెట్ భేటీలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు మోదీ నాయకత్వ పటిమ ఏమాత్రం చెక్కుచెదరలేదని ఉద్ఘాటించారు. -
ఎస్ఎంఈలకు ఊరట.. రూ.10 వేల కోట్ల ఫండ్‌కు ఆమోదం
దేశంలోని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) మరింత వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ (ఎస్జీఎఫ్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ ఫండ్ ద్వారా అధిక వృద్ధి సామర్థ్యం, వ్యాపార సాధ్యాసాధ్యాలు, విస్తరణ అవకాశాలు ఉన్న ఎస్ఎంఈలకు డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడుల రూపంలో దీర్ఘకాలిక మూలధనం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎస్జీఎఫ్ కింద ఏర్పాటు చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)కు మొత్తం రూ.10,000 కోట్ల నిధిని అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు ఈక్విటీ ఫండ్లు ప్రధానంగా ప్రారంభ దశలోని సూక్ష్మ సంస్థలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు వృద్ధి దశలో అవసరమైన రిస్క్ క్యాపిటల్‌లో లోటు ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంతరాన్ని భర్తీ చేయడమే ఎస్జీఎఫ్ ప్రధాన లక్ష్యం.తయారీ, సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక విలువ గొలుసుల్లోని సంస్థలకు ఈ ఫండ్ కీలకంగా మారనుంది. ముఖ్యంగా తయారీ సంస్థలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, అధునాతన సాంకేతికతను స్వీకరించడం, ఎగుమతులను విస్తరించడం, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేందుకు అవసరమైన స్థాయిని సాధించడంలో ఇది తోడ్పడనుంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లకు కూడా పెట్టుబడులు అందే అవకాశం ఉంది.ఈ నిర్ణయం 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ‘ఛాంపియన్ ఎస్ఎంఈలు’ లక్ష్యానికి కార్యరూపం. బడ్జెట్లో ఎస్ఎంఈల కోసం రూ.10,000 కోట్ల గ్రోత్ ఫండ్‌తోపాటు సూక్ష్మ సంస్థలకు మద్దతుగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్‌కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.ఇదీ చదవండి: ‘ఓటు హక్కు హరిస్తే’.. న్యాయస్థానాల హెచ్చరిక -
యూలిప్స్ మెరవాలంటే..
ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలానికి ఈక్విటీలే అధిక రాబడినిస్తాయన్నది పదేపదే రుజువవుతున్న వాస్తవం. కానీ స్టాక్ మార్కెట్లలో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకుల దృష్ట్యా వీటిలో పెట్టుబడిపై రిస్క్ ఉంటుంది. ఎవరెంత రిస్క్‌ను భరించగలరో అంతమేరకు వారు పెట్టుబడి పెడుతుంటారు. కానీ ఇలాంటి ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో కూడా ఇటు బీమా రక్షణతో పాటు పెట్టుబడిపై అధిక లాభాలను పొందడానికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యూలిప్స్) అవకాశమిస్తున్నాయి. యూలి ప్స్‌లో వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలామంది తమకు అనువయ్యేవి ఎంపిక చేసుకోవటం లేదని తెలుస్తోంది. అసలు ఎలాంటి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి? ఎవరికి ఏవి అనువుగా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం... గ్రోత్/అగ్రసివ్ ఫండ్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. అంటే మిగిలిన ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ కాస్త ఎక్కువ. అలాగే రాబడీ ఎక్కువే. దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్: పేరుకు తగ్గట్టే ఈ ఫండ్ చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తుంది. సగం మొత్తాన్ని ఈక్విటీలకు మిగిలిన మొత్తాన్ని డెట్ పథకాలకు కేటాయించడం జరుగుతుంది. ఇవి స్థిరాదాయాన్నిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి, గ్రోత్ ఫండ్స్‌తో పోలిస్తే రాబడి కాస్త తక్కువగానే ఉంటుంది. మధ్యస్థాయి రిస్క్ తీసుకునే వారికి వీటిని సూచించొచ్చు. కన్జర్వేటివ్ ఫండ్స్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని రిస్క్ తక్కువగా ఉండే డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పై రెండు పథకాలతో పోలిస్తే దీంట్లో నష్ట భయం మరింత తక్కువ. అస్సలు నష్ట భయానికి సిద్ధపడని వారికి ఇది బాగుంటుంది. ఫండ్ ఎంపికలో చూడాల్సినవి ఫండ్ ఎంపికలో ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి అనేది చాలా ముఖ్యం. మీ ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి ఐదు నుంచి 10 ఏళ్లు అయితే రిస్క్ చాలా తక్కువగా ఉండే కన్జర్వేటివ్ ఫండ్స్‌ని, అదే 10 నుంచి 15 ఏళ్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇంతకంటే దీర్ఘకాలం అయితే అగ్రసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితే కాకుండా, మీ రిస్క్ సామర్థ్యం, వయస్సు తదితర అంశాలు కూడా ఫండ్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. 30-50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 60-70% గ్రోత్ ఫండ్స్‌కు, ఆపైన వయస్సు ఉన్న వారు 50-60% కన్జర్వేటివ్ ఫండ్స్‌కు కేటాయించండి. అలాగే యూలిప్స్‌లో ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసే విధంగా ఎంచుకోవడం మంచింది. డైనమిక్ ఫండ్ ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత కూడా ఏ ఫండ్ ఎంపిక చేసుకోవాలో అర్థం కాని వారి కోసం బీమా కంపెనీలు డైనమిక్ ఫండ్ పేరుతో ఇంకో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీన్ని ఎంపిక చేసుకుంటే మీ ఆదాయం, పాలసీ కాలపరిమితి వంటి అంశాల అధారంగా మీ పోర్ట్‌ఫోలియోలో ఫండ్ కేటాయింపులను కంపెనీయే చేస్తుంది. - వి.విశ్వనాధ్, డెరైక్టర్, మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్


