నార్వే మాజీ ప్రధానికి ఆసియా ‘నోబెల్’
తైపీ: ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు. సంతులిత అభివృద్ధి అమలు, నాయకత్వం, నవకల్పనలకుగాను ఆమెను దీనికి ఎంపిక చేసినట్లు అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ బుధవారం తెలిపారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్‌ల్యాండ్‌కు ప్రకటించారు. ఆమెకు రూ.10 కోట్లు అందజేస్తారు.