breaking news
Grooming Services
-
గడ్డానికి గ్లామర్!
‘నో షేవ్ నవంబర్’ వచ్చిందంటే చాలు, గడ్డం పెంచడం ఒక ట్రెండ్ అయితే, దాన్ని స్టయిల్‌గా మలచుకోవడమే అసలైన ఫ్యాషన్! షేవింగ్ కోసం ఖర్చు చేసే డబ్బును, స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం కూడా ఈ ఉద్యమంలో భాగమే! మరి ఈ నెలలో మీ గడ్డానికి కొత్త ఇమేజ్ ఇవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!రూల్స్ తెలుసా?నవంబర్ మొదలయ్యేలోపు పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకుని, ఆ తర్వాత గడ్డాన్ని సహజంగా పెరగనివ్వండి. అయితే, క్లీన్షేవ్ తప్పనిసరి నియమం కాదు. ఇప్పటికే గడ్డం ఉన్నవాళ్లు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనవచ్చు. అసలు విషయం... నవంబర్ నెలంతా షేవింగ్‌కు దూరంగా ఉండటమే!గ్రూమింగ్ మానకండి!గడ్డం పెరిగిందని దాన్ని అలాగే వదిలేస్తే సరిపోదు. రోజూ శుభ్రం చేసుకుని, చిక్కులు తొలగించి, అవసరాన్ని బట్టి బియర్డ్ ఆయిల్ లేదా కండిషనర్ వాడండి. ఇవి గడ్డాన్ని మృదువుగా ఉంచి, దువ్వుకోవడాన్ని సులభం చేస్తాయి. వీటిలో మీ చర్మానికి సరిపోయే ఉత్పత్తులనే ఎంచుకోవాలి.లుక్కు కొత్త హైప్!గడ్డం గుబురుగా పెంచి, తలపై ఉన్న జుట్టును కూడా అస్తవ్యస్తంగా వదిలేస్తే, అడవి మనిషిలా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే గడ్డం పొడవు, ముఖాకృతికి తగ్గ హెయిర్ స్టయిల్‌ను ఎంచుకోండి. గుబురు గడ్డానికి ఫేడ్ కట్, చిన్న గడ్డానికి సైడ్ పార్టింగ్ లేదా టెక్స్చర్డ్ హెయిర్‌స్టయిల్ బాగుంటాయి. గడ్డం అంచులను నీట్‌గా సర్దుకుంటే రఫ్ లుక్‌లోనూ క్లాస్ కనిపిస్తుంది.పర్ఫెక్ట్ పార్ట్నర్!గడ్డాన్ని హైలైట్ చేయాలంటే దుస్తుల రంగుల విషయంలోనూ కాస్త శ్రద్ధ పెట్టాలి. నలుపు, నేవీ బ్లూ, ఆలివ్ గ్రీన్ , బ్రౌన్ రంగుల దుస్తులతో రగ్గడ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్, బ్రౌన్ బూట్స్ కాంబినేషన్ అదిరిపోతుంది. తెల్లని టీషర్ట్తోనూ గడ్డానికి మంచి కాంట్రాస్ట్ ఇవ్వొచ్చు.అదనపు ఆకర్షణ!గడ్డం పెంచినప్పుడు వాచ్, సన్‌గ్లాసెస్, షూస్ వంటి యాక్సెసరీస్ మీ లుక్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చగలవు. క్యాజువల్ దుస్తులకు వైట్ స్నీకర్స్, డెనిమ్ జాకెట్ జత చేయండి. ఫార్మల్ లుక్కు క్లాసిక్ వాచ్, లెదర్ షూస్ ఎంచుకోండి. గడ్డం, హెయిర్‌స్టయిల్, యాక్సెసరీస్ మధ్య సమన్వయం ఉంటే మీ రూపం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.చివరగా, గడ్డం పెంచే క్రమంలో కొందరికి దురద, పొడిబారడం వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. గడ్డం ఎంత స్టయిలిష్‌గా ఉన్నా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యం! ∙కొండి దీపిక -
బక్కగా ఉన్నా.. ఈ లేయరింగ్లతో బాస్‌లా కనిపించొచ్చు!
అందరికీ సిక్స్‌ప్యాక్ హీరోలే నచ్చితే, మరి స్లిమ్బాబులను ఎవరు చూస్తారు? సన్నగా ఉండటం క్రైమ్ కాదు, స్టయిల్‌గా లేకపోవడమే సమస్య. అందుకే, మరి స్లిమ్ అబ్బాయిలు కూడా స్టయిలిష్ హీరోల్లా మెరవాలంటే ఈ మూడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే!ఒక్క టీషర్ట్‌తో సరిపెట్టొద్దు... లేయర్లు వేసుకోండి!ప్లెయిన్ టీషర్ట్ ఒక్కటే వేసుకుని బయటికి వస్తే, మీ బాడీ ఎంత సన్నగా ఉందో అదే హైలైట్ అవుతుంది. అందుకే స్టయిల్లో మొదటి మంత్రం... లేయరింగ్! తెల్లటి లేదా సాలిడ్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకుని, బటన్లు మాత్రం వేయొద్దు. ఓపెన్ గా వదిలేస్తే చాలు! ఒక్కసారిగా లుక్‌లో డెప్త్ వచ్చేస్తుంది. చలికాలమైతే హుడీపై డెనిమ్ జాకెట్ లేదా ఓవర్షర్ట్ ట్రై చేయండి. చూసేవాళ్లు... ‘జిమ్ మొదలుపెట్టాడేమో!’ అని అనుకునేంత మార్పు ఒక్కసారిగా కనిపిస్తుంది.స్కిన్నీ జీన్స్‌తో యుద్ధం ఆపేయండి!సన్నగా ఉన్న అబ్బాయిలు చేసే అతి పెద్ద పొరపాటు– స్కిన్నీ జీన్స్. అవి వేసుకుంటే కాళ్లు జీన్స్‌లో ఉన్నాయా, లేక జీన్స్ కాళ్లకు అతుక్కుపోయాయా అన్న డౌట్ వస్తుంది! దానికి బదులుగా స్ట్రెయిట్ ఫిట్ జీన్స్, రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్, చినోస్ లేదా కార్గోస్ ఎంచుకోండి. ఇవి బాడీకి సరైన బ్యాలెన్స్ ఇచ్చి, లుక్‌ను కాస్త బల్కీగా చూపిస్తాయి. గుర్తుంచుకోండి... ప్రతి ట్రెండ్ మన కోసం కాదు, మనకు సెట్ అయ్యేదే అసలు ట్రెండ్.యాక్సెసరీస్‌ను బోల్డ్‌గా ఉంచండిసన్నగా ఉన్నవాళ్లు మరీ సన్నటి చైన్లు, చిన్న రింగులు, చిన్న డయల్ వాచ్‌లు.. ఇవన్నీ స్లిమ్ లుక్‌ను ఇంకా హైలైట్ చేస్తాయి. కానీ స్టయిల్ కనిపించదు. అందుకే కాస్త పెద్ద డయల్ ఉన్న వాచ్, బోల్డ్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్, కొంచెం మందంగా ఉండే బ్రేస్లెట్ లేదా చైన్ ఎంచుకోండి. ఇవి మీ లుక్కు వెయిట్ ఇవ్వడమే కాదు, కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.బాడీని మార్చడానికి నెలలు పడుతుంది... కానీ స్టయిల్‌ను మార్చుకోవడానికి మూడు నిమిషాలు చాలు! కాబట్టి బక్కగా ఉన్నందుకు బాధపడటం మానేసి, సరైన దుస్తులను ఎంచుకోండి. స్టయిల్‌గా కనిపించండి. -
చీరకు జెండర్ లేదు!
నారీ వార్డ్రోబ్ లిస్ట్‌లో ఉండే ఎవర్గ్రీన్ డ్రెస్.. శారీ. ఇప్పుడిక మగవారి అలంకరణలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. సంప్రదాయ దుస్తులలో ఈ కళ కొత్తగా మెరిసిపోతోంది. ధోతీగా మారి దావత్‌లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. జెండర్ పరిమితులు లేని ఈ స్టైల్‌కి జనాల నుంచి కితాబులూ అందుకోవచ్చు.ఆరు గజాల చీర ఆడవారి ఆహార్యానికే కాదు, మగవారి రాజసానికి కూడా అలంకరణగా మారింది. యూనీసెక్స్ డిజైన్స్‌లో మేటిగా నిలిచింది. సంప్రదాయ వేడుకలలో స్టైలిష్‌గా నిలుస్తోంది. పట్టు, కాటన్, ఆర్గంజా., శారీస్ లేదా దుపట్టాలతో షర్ట్, ఓవర్ కోట్లను డిజైన్ చేయవచ్చు.. బ్లేజర్ కోసం చీర పల్లూను వాడచ్చు. డిజైన్ బట్టి ఒకే చీరను కుర్తా, పైజామా సెట్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు దళసరిగా ఉండే పట్టు, కాటన్ శారీస్లో అందమైన డిజైన్స్ ఉన్నవి ఎంచుకోవాలి. చీర కొంగును షర్ట్ కాలర్, కఫ్ట్, పాకెట్స్ డిజైన్ చేయడానికి ఉపయోగించవచ్చు. అంతగా ఉపయోగించని, మంచి డిజైన్ ఉన్న శారీస్‌తోనూ మెన్ అండ్ ఉమెన్ సంప్రదాయ దుస్తులను రూపొందించవచ్చు.కట్టులో ఎన్నో వైవిధ్యాలుఈ రోజులను గమనిస్తే 40 ఏళ్ల లోపు మెన్ అండ్ ఉమెన్ వేర్, యాక్ససరీస్ చాలా వరకు ఒకే మోడల్స్‌లో ఉంటున్నాయి. హారమ్ ప్యాంట్స్/ ధోతీ అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు, అబ్బాయిలు కూడా వాడుతున్నారు. వీటిమీదకు ఇద్దరూ టీ షర్ట్స్, షార్ట్ కుర్తీలూ, షర్ట్స్ వేసుకుంటున్నారు.→ బ్లేజర్స్, టీ షర్ట్స్, ధోతీ, టులిప్ ప్యాంట్స్... ఇలా జెండర్ లేకుండా యూనీసెక్స్ డిజైన్ మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇది డ్రెస్సులకే కాదు కళ్లద్దాలు, వాచీ, ఫుట్‌వేర్ విషయంలో కూడా ఇద్దరి డిజైన్స్ ఒకేలా ఉంటున్నాయి. → చీరలను కట్ చేసి, కుట్టడం అనే ఆలోచన కూడా దూరమై చీరలనే ధోతీలుగా, లుంగీలుగా కట్టుకుంటున్నారు. ఇందుకు కాటన్, ప్రింటెడ్, సిల్క్... ఇలా ఏ శారీ అయినా ధోతీలాగా మార్చుకుంటున్నారు. ఇలా సంప్రదాయ వేడుకలు, పండుగలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీటి మీదకు షార్ట్, లాంగ్ కుర్తీలు, బ్లేజర్లు వేసుకోవచ్చు. → సాధారణంగా ఆడవాళ్లు నాలుగుసార్లు కట్టాక ఆ చీరను మళ్లీ కొన్నాళ్ల పాటు కట్టరు. అలాగని, ఆ చీరను కట్ చేసి, కుట్టడం అనే దానిని ఆడవాళ్లు ఇష్టపడరు. అందుకని, చీరను ధోతీ, ప్యాంట్లాగా విభిన్న పద్ధతులలో కట్టుకుంటున్నారు. చీరను ధోతీలాగా ఎలా కట్టుకోవచ్చో సోషల్‌మీడియాలో చూసి, తెలుసుకోవచ్చు. దీనికి నడుము భాగంలో బెల్ట్ సెట్ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది.బెనారస్ చీరతో ధోతీఇటీవలి నా వివాహానికి రెడీమేడ్‌గా ఉండే కుర్తా పైజామా, ధోతీ డ్రెస్సులను షాపుల్లోనూ, బొటిక్లలోనూ చూశాను. ఏదైనా స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. పెళ్లికి మా అమ్మ కొన్న చీరలను చూసినప్పుడు బ్లూ బెనారస్ శారీ భలే ఆకర్షణీయంగా అనిపించింది. ఆ చీరతో ఏమైనా స్పెషల్ చేయవచ్చా... అని ఆలోచించాను. ఆన్లైన్లో కనిపించే సంప్రదాయ దుస్తుల డిజైన్స్ చూశాను. టైలర్ని కలిసి, నా ఆలోచనను చెప్పాను. ధోతీ, కండువా చేయడానికి టైలర్ ఒప్పుకున్నారు. అలా చీర మిడిల్ పార్ట్‌తో ధోతీ చేయించాను. పల్లూ, బార్డర్ వంటివి ఉపయోగించి దుపట్టా డిజైన్ చేయించాను. కుర్తా కోసం కాంబినేషన్ క్లాత్ కోసం వెతికితే ఆ కలర్ మార్కెట్లో దొరకలేదు. దీంతో వైట్ క్లాత్ తీసుకొని, లైట్ షేడ్ వచ్చేలా డై చేయించాను. ఆ క్లాత్‌తో కుర్తా పూర్తయ్యింది. ఈ సెట్‌కి లైనింగ్ వేయించడం వల్ల డ్రెస్‌కి మంచి ఫాలింగ్ వచ్చింది. సాధారణంగా పెళ్లికి మెన్ ట్రెడిషనల్ వేర్కి 50 వేల రూపాయల నుంచి బడ్జెట్ అవుతుందని చెప్పా,రు. నేను ఇలా డిజైన్ చేయించుకోవడం వల్ల పాతిక వేల రూపాయలలో డ్రెస్ పూర్తయ్యింది. పెళ్లిలో ఈ యునిక్ డిజైన్ గురించి చాలా మంది అడిగారు. – కృష్ణ సందీప్ -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)


