Gowlidoddi
-
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
రాయదుర్గం: పేదింటి విద్యార్థులు ఇంజినీర్లు...డాక్టర్లు కాబోతున్నారు. ఇంటర్మీడియేట్ విద్యతోపాటు ఐఐటీ, నీట్, ఎంసెట్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఐఐటీ, జేఈఈ నీట్, ప్రెప్ అకాడమీ విద్యాలయం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉపాధ్యాయుల సమష్టి కృషి, విద్యార్థుల కష్టపడే తత్వం, క్రమ శిక్షణ, పోటీ పడి చదవాలనే తపనతో వారు ఇంటర్మీడియట్‌తోపాటు ఉన్నత విద్య కోసం రాసే పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. పక్కాగా టైం టేబుల్.. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ రైతు కూలీ లు, కూరగాయల విక్రయదారులు, రైతులు, ఇతర సామాన్య, పేద వర్గాలకు చెందిన వారి పిల్లలే కావ డం గమనార్హం. రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు టైంటేబుల్ ఆధారంగా చదువుకోవడం, ఏవైనా డౌట్లు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవడం జరుగుతోంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమేగాక, వారు ఏఏ అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు ♦ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలబాలికల కళాశాలల్లో కలిసి 161 సీట్లు సాధించారు. ♦ ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన మొదటి రౌండ్లోనే 161 మందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ♦ కాగా మరో 29 మంది విద్యార్థులు మొదటిసారిగా ఇంటర్మీడియెట్ చదువుతూ నీట్ కోచింగ్ పొంది ఎంబీబీఎస్ సీట్లు పొందడం విశేషం. ♦ బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మొదటిసారిగా మురళీమనోహర్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ సీటు పొందారు. ♦ బి.ప్రవీణ్‌కుమార్ కేఎంసీ వరంగల్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు ♦ స్పందన, కావ్య, శామ్యూల్, వేణుమాధవ్తోపాటు 18 మందికి ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్లు దక్కాయి. ♦ ఏడుగురు విద్యార్థులకు గాంధీ మెడికల్ కళాశాలలో కూడా సీట్లు పొందడం విశేషం. ♦ 120 మందికి ఐఐటీ, ఎన్ఐటీ కోసం శిక్షణ ఇవ్వగా 87 మందికి ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించడం విశేషం. -
పేదింటి కుసుమాలు.. కాబోయే డాక్టర్లు
రాయదుర్గం : వారంతా పేదింటి పిల్లలు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, గురుకుల విద్యా సంస్థల తోడ్పాటుతో కాబోయే డాక్టర్లుగా మారబోతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతులు, నిత్యకూలీల పిల్లలలో 13 మంది డాక్టర్లు అయ్యే అవకాశం రావడం విశేషం. నీట్లో గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ /మెడికల్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 54 మంది విద్యార్థులు నీట్ çపరీక్ష రాయగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు, మరో ఇద్దరు విద్యార్థులకు బీడీఎస్ సీట్లు రావడం ఖాయంగా మారింది. 13 మంది విద్యార్థులు పది వేల లోపు ర్యాంకులు సాధించారు. కళాశాల నుంచి ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులుగా అఖిల భారత స్థాయి ఎస్టీ కేటగిరిలో రాజు (2,876), అనూష (2,900), ఎస్సీ కేటగిరిలో రాము (3519 ర్యాంకు), కార్తీక్ (4452), మాధవి (4,982), అన్వేష్ (5,737), ఆర్.శ్వేత (6,213), అభిలాష్ (7,091), నవ్యశ్రీ (7860), సాయితేజ (9480), సంధ్య(9707) ర్యాంకులను సాధించడం విశేషం. వీరందరికీ ఎంబీబీఎస్ సీట్లు రావడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. పది వేలకుపైగా ర్యాంకులు సాధించిన రాధిక (10,471), లావణ్య (10,751) బీడీఎస్ సీట్లు రావడం ఖాయమని వారు తెలిపారు. 30 మందికి టాప్–5 కళాశాలల్లో ఇంజనీరింగ్ సీట్లు ఖాయం నగరంలోని టాప్–5 కళాశాలల్లో 30 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు కచ్చితంగా వస్తాయని గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ/మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వివేకానంద అన్నారు. మరో 20 మంది విద్యార్థులకు ఏజీ బీఎస్సీలో కూడా సీట్లు వస్తాయన్నారు. నీట్లో సత్తా చాటిన విద్యార్థులలో 11 మంది ఎంబీబీఎస్ సీట్లు, ఇద్దరికి బీడీఎస్ సీట్లు ఖాయంగా వస్తాయని చెప్పారు. గత ఏడాది 8 మందికి మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని, ప్రస్తుత ఏడాది పెరగడం ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టి కృషి ఫలితమన్నారు. కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఉన్నతాధికారుల ప్రోత్సాహం తోనే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. -
భలేగా చేశారే..!
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లే ముఖ్య అతిథులయ్యారు. ఈ అరుదైన సంఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల/పాఠశాలలో జరిగింది. ఇక్కడ చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థినుల వీడ్కోలు వేడుక శనివారం రాత్రి నిర్వహించారు. దీనికి గతానికి భిన్నంగా పాఠశాలలో స్వీపర్లు నరసింహ, రాజును ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. సాంప్రదాయం ప్రకారం ప్రధాన గేటు వద్ద అతిథులకు ప్రిన్సిపల్ ప్రమోద పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. విద్యార్థులు గౌరవ మర్యాదలతో వేదిక వద్దకు తీసుకెళ్లి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ, రాజు మాట్లాడుతూ.. కలలో కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. -
'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు
-
'అభయ' దోషులకు 20 ఏళ్ల జైలు
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయ (22) కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులో ఎల్బీనగర్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన నెమ్మడి వెంకటేశ్వర్లు, వెడిచెర్ల సతీష్‌లకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించింది. కేవలం 209 రోజుల్లో అభయ కేసు దర్యాప్తు, విచారణ పూర్తై తీర్పు రావడం విశేషం. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అరెస్టైనప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఆరోజు ఏమైంది... బెంగళూరుకు చెందిన అభయ (22- పేరు మార్చడం జరిగింది) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది.