breaking news
Governor and CM KCR
-
నేడు సుప్రీంలో తెలంగాణ గవర్నర్ బిల్లుల పెండింగ్ కేసు విచారణ
-
క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్‌లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్
నల్గొండ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఉదయం హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. స్వామి, అమ్మ వార్లకు రాష్ట్రపతి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయంలో స్వామి వారికి స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మహామండపంలో ప్రణబ్‌ను వేద పండితులు ఆశీర్వదించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.00 గంటల వరకు దేవాలయంలో సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు ఆర్జిత సేవలను నిలిపివేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు యాదాద్రి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రణబ్ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా ఉన్నారు.