breaking news
Government rice
-
మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు, ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.అవినీతికి మోడల్‌గా మధ్యప్రదేశ్గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్‌ను పూర్తిగా ‘అవినీతి మోడల్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
అట్టకట్టేసి మధ్యాహ్న భోజనం పథకం బియ్యం
-
సంపద ఒకరిది.. సోకు మరొకరిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో మిల్లర్లు కొత్త రకం అక్రమాలకు తెర తీశారు. ఇప్పటి వరకు ఒకటి, రెండేళ్లు ఆలస్యంగా ఇస్తూ లాభాలు ఆర్జించిన మిల్లర్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. నేరుగా స్వాహా చేయకుండా... ప్రభుత్వం ధాన్యాన్ని బగడువు ముగిసిన తర్వాత అధికారులు బియ్యం ఇవ్వాలని అడిగితే... మిల్లర్లకు బదులుగా బ్యాంకులే అడ్డం పడుతున్నాయి. ఇలా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని జిల్లాలోని పలువురు మిల్లర్లు, బ్యాంకులతో కలిసి ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే పనులకు దిగారు. కొడకండ్ల మండలం పెద్దవంగరలో ఉన్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ ఇదే పని చేసింది. గత ఖరీఫ్, రబీలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ), వ్యవసాయ సహకార సంఘాలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రైస్ మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలోని ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు ఈ నెల 30లోపు బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. ఇలా 6236 టన్నుల ధాన్యం తీసుకున్న చిల్లంచెర్ల ఆగ్రోటెక్ ఇండస్ట్రీ మళ్లీ బియ్యం ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించింది. గడువు ముగుస్తున్నా ఇవ్వాల్సిన బియ్యంలో 70 శాతమే ఇచ్చింది. మిగిలిన బియ్యం విషయంలో అధికారులు వాస్తవ పరిస్థితిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఈ మిల్లర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో తనఖా పెట్టి కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తిం చారు. మిల్లులో ఉన్న సరుకును వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా, రుణం తీరే వరకు కుదరదంటూ బ్యాంకు అధికారులు జిల్లా యంత్రాంగానికి తెలిపారు. ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ విధానాల్లోని లోపాలే వల్లే ఇలా జరిగిందని గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ జి.కిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్ వద్ద ఇటీవల ప్రత్యేకంగా విచారణ జరిగినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ఉషారాణి ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తనఖా పెట్టిన సరుకుతో సంబంధం లేకుండా బియ్యాన్ని గడువులోపు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 84 శాతమే.. గత ఖరీఫ్, రబీలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. 2013-2014 లెవీ సీజన్ ముగిసే సెప్టెంబర్ 30 లోపు ఈ ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. తుది గడువుకు ఇంకా రెం డు రోజులే ఉంది. జిల్లాలో మాత్రం ఇప్పటికి 86 శాతం బియ్య మే పౌర సరఫరాల సంస్థకు చేరింది. మొత్తం 89 మిల్లుల్లో వంద శాతం బియ్యం ఇచ్చినవి 19 మాత్రమే. 99 శాతం లెవీ పూర్తి చేసిన మిల్లులు 36, యాభై శాతంలోపు బియ్యం కోటా అప్పగించిన మిల్లులు నాలుగు ఉన్నాయి. ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. ఈ లెక్కన ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇంకా 17,360 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.


