breaking news
Government changes
-
ప్రభుత్వం మారితేనే!
మాస్కో: ఉక్రెయిన్‌లో ప్రభుత్వం మారితేనే శాంతి నెలకొంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శాంతి చర్చలు జరపాలన్నారు. చర్చల్లో అమెరికాతో పాటు బ్రిక్స్ దేశాలు, ఉత్తర కొరియా కూడా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తర రష్యాలోని ఓడరేవు పట్టణం ముర్మాన్స్కోలో సైనికుల బృందంతో పుతిన్ శుక్రవారం మాట్లాడారు. మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకడానికి సిద్ధమేనన్నారు. అయితే శాంతి ప్రక్రియ కోసం పలు షరతులు విధించినట్టు రష్యా అధికార వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి. ఆ దేశం అంతర్జాతీయ పాలనలోకి రావాలి. ఆలోపు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరాలి. కీలక ఒప్పందాలపై సంతకాల వంటివన్నీ ఆ తర్వాతే’’ అని పుతిన్ పేర్కొన్నట్టు వెల్లడించింది. ‘‘శాంతియుత పరిష్కారమే మా అభిమతం కూడా. కానీ ముందుగా ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం రావాలి. యూరప్‌తో కలిసి పనిచేయడానికీ నేను సిద్ధం. కానీ యూరప్ అస్థిరంగా వ్యవహరిస్తూ మమ్మల్ని మభ్యపెట్టజూస్తోంది’’ అని పుతిన్ ఆరోపించారు. యుద్ధం ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారంటూ కొనియాడారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం సౌదీ అరేబియాలో ఈ వారం రష్యా, ఉక్రెయిన్, అమెరికా చర్చలు జరపడం తెలిసిందే. వాటి తీరుపై అమెరికా పెదవి విరిచింది. ‘‘నల్ల సముద్రంలో నౌకలపై సైనిక దాడులను నిలిపేయడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. కానీ ఆ తర్వాత శాంతి చర్చలను అవి సీరియస్‌గా తీసుకోవడం లేదు’’ అని పేర్కొంది. ఏప్రిల్‌లో రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. -
ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. ► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది. గత 4 ఏళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే. కొత్త లాంచింగ్లొద్దు.. ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను లాంచింగ్ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి. కొనేముందు జాగ్రత్తలివే.. ► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్. ► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించాలి. ► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం. ► అన్ని అనుమతులతో పాటు మార్కెట్లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే.. ► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి. ► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బేరసారాలకు ఇదే సమయం భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. హైదరాబాద్ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్ ఒక మెట్టు దిగే ఛాన్స్ ఉంటుంది. -
అధికారంలో ఎవరున్నా మాకు ఒకటే!: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రభుత్వాల మార్పుతో తమకు సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘సంబంధిత చట్టం ప్రకారం న్యాయం చేయడమే మా పని’ అని మంగళవారం తేల్చి చెప్పింది. ‘ప్రభుత్వ మార్పును పట్టించుకోం. ఏ ప్రభుత్వం వచ్చింది?, ఏ ప్రభుత్వం పోయింది? పట్టించుకోం. చట్టాన్ని ఉల్లంఘించే ఎవర్నైనా అడ్డుకుంటాం. గుజరాత్ అల్లర్ల కేసులో ఈ కోర్టు చాలా చేసింది’ అని జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయి, జస్టిస్ ఎన్వీ రమణల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవరైనా సరే చట్టానికి అతీతుడు కాదని పేర్కొంది. ‘తప్పు జరిగి ఉంటుందని కోర్టు నమ్మితే, అది మే తరువాతనా? లేక మే నెల కన్నా ముందా అనే విషయంతో సంబంధం లేకుండానే ముందుకు వెళ్తుంది’ పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం తనను వేధిస్తోందని సస్పెండైన ఐఏఎస్ అధికారి ప్రదీప్ శర్మ వేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.